Latest Updates
-
పెళ్లిళ్లలో వడ్డించే పూరీ మసాలా.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా ఇలా ఈజీగా చేసుకోండి..వేళ్లు నాకుతూ తినేస్తారు! -
కలియుగం ముగిసేది ఎప్పుడు? మనిషి ఆయుష్షు కేవలం 20 ఏళ్లేనా? -
పెళ్లిళ్లలో వడ్డించే కరకరలాడే చిల్లీ గోబీ.. అచ్చం అదే రుచితో ఇంట్లోనే ఈజీగా చేసేయండిలా.. -
కొల్హాపురి స్టైల్ కోడిగుడ్డు పులుసు..అన్నం, జొన్న రొట్టెలోకి అదిరిపోతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో పాము కాటుకి గురైతే ఏం చేయాలి? ఏం చేయకూడదు? -
ఈ వీకెండ్ కి నాన్వెజ్ వద్దా? నాన్ వెజ్ ను మించే రుచితో కాజు మసాలా ఈజీగా చేసుకోండిలా.. -
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.!
మీకు నాగదోషం ఉందా.. ఈ ఆలయంలో చేసే పూజతో సమస్య తొలగిపోతుంది
కొంత మంది ఎంత ప్రయత్నించినా పెళ్లి సంబంధాలు కుదరవు. సంవత్సరాల తరబడి సంబంధాల కోసం ఎదురుచూసినా ఒక్కటీ సెట్ కాక ఇబ్బంది పడిపోతుంటారు చాలా మంది. 27, 28 సంవత్సరాలకు పెళ్లి సంబంధాలు చూడటం మొదలు పెడితే 30 ఏళ్లు దాటినా ఒక్క సంబంధం కూడా ఖాయం కాదు. మరికొందరేమో పెళ్లయ్యాక పిల్లలు లేక సమస్య ఎదుర్కొంటారు.
ఓ వైపు కుటుంబసభ్యుల ఒత్తిడి, ఆస్పత్రుల చుట్టూ తిరిగినా ఫలితం ఉండదు. ఏ సమస్యా లేదంటారు.. కానీ గర్భం దాల్చలేరు. ఇవి నాగదోషం వల్ల కలిగే సమస్యలు. పూర్వ జన్మల్లో పాములను చంపిన వార, ఔషాధాలతో సర్పాలను బంధించినవారు, పుట్టలను తవ్వేవారు, పుట్టలను తొలగించి ఇల్లు కట్టుకునే వారికి నాగదోషం తగులుతుందని అంటారు.

నాగదోష సమస్యలు:
నాగ దోషం ఉన్న వారు సంతానం, కుటుంబం, అభివృద్ధి, ఆరోగ్య విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారని జ్యోతిష్యం చెబుతోంది. నాగదోషం ఉంటే వివాహాలు కూడా కావు. సంతానం కూడా సమయానికి కాక ఇబ్బంది పడతారు. జాతకచక్రంలోని రాహువు లేదా కేతువు 1,2, 5, 7, 8 స్థాన్లోల ఉండి ఎటువంటి శుభగ్రహ దృష్టి లేకుండా అశుభ స్థానాల్లో ఉంటే నాగదోషం లేదా సర్పదోషం ఉందని అంటారు.
నాగదోషం తొలగిపోవాలంటే నివారణలు, పరిహారాలు చేయడం ముఖ్యం. నాగదోషంతో ఇబ్బంది పడేవారు మోపీదేవి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజ చేస్తే నాగదోషం తొలగిపోతుందని భక్తుల విశ్వాసం. ఈ ఆలయానికి నాగదోష నివారణ పూజ కోసం నిత్యం అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు. కృష్ణా జిల్లాలో దివి సీమకు చెందిన మండలం మోపీదేవి. ఈ ప్రాంతం మచిలీపట్నంకు 30 కిలోమీటర్ల దూరంలో, విజయవాడకు సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ప్రాంతాన్ని మోహినీపురమని, సర్పక్షేత్రమని కూడా పిలుస్తారు.
సర్పరూపంలో వెలిసిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి:
మోపీదేవి ఆలయం విశిష్టమైనది. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి సర్పరూపంలో వెలిశాడు. అలాగే ఈ ఆలయంలో శివుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇద్దరూ ఒకేచోట కొలువుదీరి భక్తులకు ఆశీస్సులు అందిస్తుంటారు. నాగుల పంచమి రోజుల ఈ విశిష్టత క్షేత్రానికి దేశం నలుమూలల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి విశేష పూజలు చేస్తుంటారు.
స్వయంభుగా వెలిసిన స్వామివారు:
మోపీదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి సుమారు 500 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ క్షేత్రం గురించి స్కందపురాణంలోనూ ప్రస్తావించారు. ఇక్కడ స్వామి వారు స్వయంభుగా వెలిశాడని పురాణాలు చెబుతున్నాయి. రాహు కేతు సర్పదోషాలను నివారించే ఇలవేల్పుగా ఇక్కడ స్వామి వారు పూజలు అందుకుంటున్నారు. ఆలయ గర్భగుడిలో సర్పాల రూపంలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామిపై శివుడు కనిపిస్తాడు. దీనినే పానపట్టం అని కూడా పిలుస్తుంటారు. స్వామివారి పానపట్టలంలోని ఓ కన్నం నుంచి ఏటా ఒక సారి నాగు పాము బయటకు వచ్చి భక్తులకు దర్శనం ఇస్తుందని భక్తులు నమ్ముతారు.
సర్పదోషం, సంతానలేమికి ప్రత్యేక పూజలు:
సర్పదోషంతో బాధపడేవారు, వివాహం జరగకా సమస్య ఎదుర్కొనేవారు, సంతానం లేని దంపతులు, కెరీర్ లో వృద్ధి కోరుకునే వారు, మంచి జ్ఞానాన్ని ఆకాంక్షించేవారు, వ్యాపార వృద్ధి కోరుకునే వారు ఈ మోపీదేవి ఆలయంలో చేసే ప్రత్యేక పూజల వల్ల విశేషమైన ఫలితం పొందుతారని భక్తుల విశ్వాసం.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications