Latest Updates
-
పోషకాల గని, ఆరోగ్యానికి పెన్నిధి.. గోధుమ రవ్వ కిచిడీ ఎలా చేసుకోవాలంటే.. -
స్నేహితురాలికి ఆశ్రయం ఇస్తే.. బాయ్ ఫ్రెండ్ వింత ప్రవర్తన..ప్రియురాలి ఆవేదన! -
బయట బండి మీద దొరికే రుచితో ఇంట్లోనే భేల్ పూరీ.. ఒక్కసారి రుచి చూస్తే వదలరు! -
ఇడ్లీ, దోసెల్లోకి ఈసారి వంకాయ చట్నీ రుచి చూడండి..లెక్కపెట్టకుండా తినేస్తారు -
హైదరాబాద్ స్పెషల్ ఇరానీ ఛాయ్.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి! -
చపాతీ, పూరీ, పులావ్ లలోకి అదిరిపోయే మీల్ మేకర్ మసాలా గ్రేవీ.. నాన్ వెజ్ కూడా దీని ముందు దిగదుడుపే! -
ఒకే రకమైన మందులు.. వేర్వేరు ఫలితాలు..లివర్ డ్యామేజ్ వెనుక ఉన్న రహస్యం ఇదే! -
హ్యాపీ హోలీ 2026..మీ బంధుమిత్రులకు పంపడానికి బెస్ట్ హోలీ విషెస్, వాట్సాప్ స్టేటస్ లు ఇవే! -
ఈ హోలీకి అదిరిపోయే స్నాక్..అతిథులను మెప్పించే కరకరలాడే హెల్దీ రైస్ కుర్కురే..ఎలా చేసుకోవాలంటే.. -
హోలీ స్పెషల్..తాగేకొద్దీ తాగాలనిపించే చల్లని థాండాయ్..ఎలా చేసుకోవాలంటే..
శ్రీ వెంకటేశ్వరుడు కొలువైన ప్రదేశం ఏడు కొండలకు ఆ పేరు ఎలా వచ్చిది..?
ఏడు కొండలు...ఈ పేరు వింటేనే భక్తజనుల వళ్లు పులకరిస్తుంది. భక్తి ఆవహిస్తుంది. శ్రీమహావిష్ణువు శయనించిన ఆదిశేషుని ఏడుపడగలే ఏడుకొండలు. కలియుగంలో స్వామివారికి ఎంతవిశిష్టత ఉందో ఆయన నివశించే ఈ సప్తగిరులకూ అంతే ప్రాముఖ్యత ఉంది. పచ్చని లోయలు, జలపాతాలు, అపార ఔషదాలు, కోటి తీర్థాలతో అడుగడుగునా పవిత్రత ఉట్టిపడే గిరులు ఈ శేషాచల కొండలు.
తిరుమల వెంకన్నకు శేషాచలం కొండలంటే చాలా ఇష్టం. ఈ ఏడుకొండల్లో ఒక్కో కొండకు ఒక్కో చరిత్ర ఉంది.. వైకుంఠంలో అలిగివచ్చిన లక్ష్మీదేవిని వెతుక్కుంటూ వచ్చిన వెంకన్న ఏడుకొండలపై కొలువైనాడని స్థలపురాణం చెబుతుంది. వైకుంఠంలో నిత్యం శ్రీవారి చుట్టూ ఉండే అనుచరులే... భూలోకంలోకి వచ్చి ఏడుకొండలుగా మారారని పురాణాలు చెబతున్నాయి. అందుకే ఆయన సప్తగిరివాసుడయ్యాడు.
నంది వృషబాధ్రి అయ్యాడు, హనుమంతుడు అంజనాద్రిగా మారి స్వామిని సేవించుకుంటున్నాడు. స్వామివారికి తొలిసారిగా తలనీలాలు సమర్పించిన నీల... నీలాద్రి కొండగా మారింది. శ్రీహరి వాహనమైన గరుత్మంతుడు గరుడాద్రిగా మారాడు. పాలకడలిలో స్వామికి శేషుడైన ఆదిశేషుడు శేషాద్రిగా మారి స్వామి సేవచేస్తున్నాడు. ఇక నారాయణాద్రి,వెంకటాద్రిలు శ్రీవారి రూపాలే. ఈ రెండు కొండలు జయ, విజయులకు ప్రతిరూపాలు.
తిరుమల తిరుపతి లోగల ఏడు కొండలపై కొలువై వున్నాడు కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరుడు . భక్తుల కోరికలను తీర్చే అభయ హస్తుడు శ్రీనివాసుడు . వెంకన్న కొలువై వున్నా ఏడూ కొండలు కేవలం అద్రులు (కొండలు )మాత్రమె కాదు వాటి వెనుక కొన్ని గాధలు వున్నాయి . అవి

వృషభాద్రి
పూర్వం వృషభాసురుడు అనే శివ భక్తుడు భల గర్వితుడై సాక్షాత్ శ్రీహరితోనే యుద్దానికి తలపడ్డాడు . యుద్ధం లో చావుతప్పదని గ్రహించిన రక్కసుడు "తమ చేతిలో మరణించడం నా మహద్భాగ్యం మీరు వున్న ఈ పర్వతానికి నా పేరు ప్రసాదించవలసింది "అని శ్రీహరిని వేడుకున్నాడు . స్వామీ కరుణించి అతడు కోరిన వరాన్ని ఇచ్చి తరువాత వ్రుశాభాసురుడిని సంహరించాడు . ఆ ప్రకారం గా వృషభాద్రి అను పేరు వచ్చినది .

నీలాధ్రి
స్వామీ వారికి తొలిసారిగా తన తల నీలాలు సమర్పించిన భక్తురాలి పేరు నీలాంభరి. ఆమె భక్తి కి మెచ్చిన వేంకటేశ్వరుడు ఏడూ కొండలలో ఒక కొండ కి ఆమె పేరుగా పేరుని పెట్టారు. తలనీలాలు అనే మాట కూడా ఆమె పేరు మీద రూపొందిందే..

గరుడాద్రి:
శ్రీ మహా విష్ణువు హిరణ్యాక్షుని సంహరించిన తరువాత గరుత్మంతుని పిలిచి తన క్రీడాద్రిని తీసుకు రమ్మని ఆదేశిస్తాడు . ఆ ఆజ్ఞ మేరకు గరత్మంతుడు దానిని తెచ్చినందు వల్ల అది గరుడాద్రి గా ప్రసిద్ది చెందింది. మరో విధంగా కూడా చెబుతారు. దాయాదులైన కద్రువ పుత్రుల (నాగులు) ను సంహరించిన గరుత్మంతుడు పాపపరిహారార్ధం విష్ణువును గూర్చి తపస్సు చేశాడు. స్వామి ప్రత్యక్షమవగానే తనకు తిరిగి వైకుంఠం చేరే వరమివ్వమని ప్రార్ధించాడు. దానికి స్వామి... తానే ఏడుకొండల మీద వెలియనున్నానని తెలిపి ఆ వైనతేయుణ్ణి కూడా శైల రూపంలో అక్కడే ఉండమని ఆదేశించారట. అదే గరుడాచలం.

అంజనాద్రి :
వానర ప్రముఖుడు కేసరిని వివాహం చేసుకున్న అంజనాదేవికి చాలాకాలం పాటు పిల్లలు పుట్టలేదట. సంతానం కోసం అంజనా దేవి వెంకటాచల క్షేత్రంలో తపస్సు ఆచరించింది . దాంతో ఆమె గర్భాన్ని దాల్చి అనంతరం బలశాలి, చిరంజీవి అయిన ఆంజనేయుడికి జన్మ నిచ్చింది . అందుకే ఈ పర్వతం అంజనాద్రి గా ప్రసిద్ది పొందింది .

నారాయణాద్రి :
విష్ణుదర్శనం కోసం నారాయణుడు అనే భక్తుడు స్వామీ పుష్కరిణి తీరాన తపస్సు చేయడంతో అతడి పేరు మీదగా ఈ పర్వతం నారాయణాద్రి గా ఖ్యాతి పొందింది . నారాయణ మహర్షి తన తపస్సుకి భంగం కలిగించని స్థలం ఎక్కడుందో చూపాల్సిందిగా బ్రహ్మదేవుణ్ణి కోరాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఒక ప్రదేశం చూపించాడట. అక్కడ స్వామి సాక్షాత్కారం పొందిన నారాయణ మహర్షి తాను తపమాచరించిన పవిత్రస్థలాన్ని శాశ్వతంగా తన పేరుతో పిలిచేలా వరం ఇవ్వమన్నాడట. ఆ విధంగా నారాయణమహర్షి తపస్సు చేసిన కొండకు నారాయణాద్రి అనే పేరు స్థిరమైందని చెబుతారు.

వేంకటాద్రి:
కలియుగ దైవం వెలసిన తిరుమలగిరి..వేం అనగా సమస్త పాపాలను కటః అనగా దహించునది అంటే స్వామి వారి సమక్షంలో పాప రాశులను భస్మం చేసేది కావున ఈ క్షేత్రానికి వెంకటాచలం అని పేరు వచ్చింది .

శేషాద్రి :
ఏడుకొండలలో ప్రధానమైనది శేషాద్రి. ఓ సారి ఆది శేషుడికి వాయు దేవునికి మధ్య ఎవరు గొప్ప అనే వివాదం రేగింది . "నీకు శక్తి వుంటే నన్ను కదుల్చు "అంటూ ఆదిశేషుడు వెంకటాచాలాన్ని చుట్టుకున్నాడు . వాయు దేవుడు అతడిని వేసిరి వేయగా పర్వతం తో పాటు ఎక్కడ వచ్చి పడతాడు . ఓడిపోయినా భాదతో వున్నా ఆది శేషుడిని వెంకటేశ్వరస్వామి ఓదార్చుతూ ,"నిన్ను ఆభరణం గా ధరిస్తాను . నీ పేరుతో ఈ క్షేత్రం ప్రసిద్ది పొందుతుంది అని వరం ఇచ్చాడు . దానితో ఈ కొండ శేషాద్రి గా ప్రసిద్ది పొందింది .

శ్రీ వెంకటేశ్వరుడు కొలువైన ప్రదేశం ఏడు కొండలకు ఆ పేరు ఎలా వచ్చిది..?
ఈ విధం గా ఏడూ కొండలు ఏర్పడి స్వామీ వారు వాటి మీద వసిస్తూ సదా తన భక్తులను కంటికి రెప్పలా కాపాడుతూ కలియుగ దైవం గా ప్రసిద్ది పొందాడు .



Click it and Unblock the Notifications











