Latest Updates
-
రైలులో హనీమూన్ సెటప్.. ఏసీ కోచ్‌లో క్యాబిన్ అలంకరణ చూస్తే మతిపోవాల్సిందే.! -
ప్రసవానంతరం తల్లుల్లో విపరీతంగా డిప్రెషన్.. బిడ్డ పుడితే ఇన్ని మార్పులా.? -
పెళ్లి విషయంలో ఆలస్యం చేస్తున్న జెన్ జెడ్ యువత.. భాగస్వామి కంటే ముందు వాటికే ప్రాధాన్యత.! -
ఉదయం నిద్రలేవగానే మెడ నొప్పితో బాధపడుతున్నారా? ఇలా చేస్తే రిలీఫ్! -
100 కి.మీ స్పీడ్ లో బస్సు..ఫోన్ లో లీనమైపోయిన డ్రైవర్, కండక్టర్..వైరల్ వీడియో చూడండి -
చిన్న వయసులోనే వినికిడి లోపం.. ఈ స్వల్ప మార్పులతో చెవి సమస్యలకు చెక్.! -
వంకాయతో ఇలా పకోడీ చేస్తే ప్లేట్ క్షణాల్లో ఖాళీ అవ్వాల్సిందే! -
వర్షాకాలం.. జంటలకు రొమాంటిక్ సీజన్.. ఈ డేటింగ్ టిప్స్‌తో మరింత మధురం.! -
ప్రేమ జీవితంలో ఒక్కసారే వస్తుందా? క్రియేటివ్ వ్యక్తులు మళ్లీ మళ్లీ ప్రేమలో ఎందుకు పడతారు? -
పోషకాలు పుష్కలంగా సూపర్ టేస్టీ మునగాకు చట్నీ..ఇడ్లీ, దోశ, అన్నం ఎందులోకైనా పర్ఫెక్ట్.. నెలల తరబడి నిల్వ
భగవద్గీతకు హిందూ మతంలో ఉన్న విశిష్ట స్థానాన్ని ప్రశంసించే కొన్ని విషయాలు
భగవద్గీత ప్రపంచవ్యాప్తంగా గర్వించ దగిన ఆధ్యాత్మిక గ్రంథం. భగవద్గీత గురించి పూర్తిగా తెలిసిన వాళ్లు తక్కువ. కేవలం దైవ సంబంధ గ్రంథంగా భావించి పూజా మందిరానికి పరిమితం చేసే వాళ్లే ఎక్కువ. నిజానికి భగవద్గీత యుద్ధభూమిలో విజయునికి చెప్పిన విషయాలు: ప్రతి వ్యక్తి జీవితంలో జరిగిన ఘటనలు, ఆత్మవిశ్వాసం కోల్పోయే పరిస్థితులు, మానసిక సంఘర్షనలు ఉండక తప్పదు. అటువంటి సందర్భాల్లో 'గీత' తమను ఓదార్చిందని చాలా మంది చెప్పారు.
భగవద్గీత మొత్తం పద్దెనిమిది అధ్యాయాలు. చదివితే అందులో మానసిక శారీరక వ్యవస్థలను ఎలా అదుపులో ఉంచుకోవాలో మానవజీవన గతిలో అనుసరించవలసిన సూత్రాలు, విధానం వివరించటం గమనించవచ్చు. మనకు అనేకానేక సందేహాలు వస్తుంటాయి.

యోగి ఎవరు? ధర్మం ఏమిటి? హింస అంటే? పాపమంటే? పుణ్యమంటే? ఇటువంటి సందేహాలకు చక్కని సమాధానం మనకు భగవద్గీతలో లభిస్తుంది. ఆధ్యాత్మిక పరంగా కూడ భగవంతుడు, భక్తి, సృష్టి, ఆరాధన, దేవుని గొప్పతనం, వంటి ఎంతో సరళంగా వివరించింది గీత.
భగవద్గీత ఉపనిషత్తుల సారమని, గీతా పఠనం కర్తవ్య నిర్వహణకు, పాపహరణకు మార్గమని హిందువుల విశ్వాసం. కర్మ యోగం, భక్తి యోగం, జ్జాన యోగం అనే మూడు జీవన మార్గాలు, భగవంతుని తత్వము, ఆత్మ స్వరూపం ఇందులో ముఖ్యాంశములు. భగవద్గీతకు హిందూ మతంలో ఉన్న విశిష్ట స్థానాన్ని ప్రశంసించే కొన్ని ఆర్యోక్తులు ఇవి..

సర్వోపనిషదో గావ: దోగ్థా గోపాల నందన:
పార్థో వత్స స్సుధీర్భోక్తా దుగ్థం గీతామ్రుతం మహాత్
శ్రీకృష్ణుడను గొల్లవాడు ఉపనిషత్తులనెడు గోవులనుండి అర్జునుడనెడి దూడను నిమిత్తముగా చేసికొని గీత అను అమృతమును పితికెను. బుద్ధిమంతులు అంతా ఈ గీతామృతమును పానము చేయవచ్చును.

ప్రతి వ్యక్తి గీతను శ్రవణ, కీర్తన, పఠన, పాఠన, మనన, ధారణాదుల ద్వారా సేవింపవలెను. అది పద్మనాభుని ముఖ కమలమునుండి ప్రభవించినది. (మహాభారతం - భీష్మ పర్వం)
నేను గీతను ఆశ్రయించి ఉండును. గీత నా నివాసము. గీతాధ్యయనము చేయువాడు భగవంతుని సేవించినట్లే (వరాహ పురాణం)

నిరాశ, సందేహములు నన్ను చుట్టుముట్టినపుడు, ఆశాకిరణములు గోచరించనపుడు నేను భగవద్గీతను తెరవగానే నన్ను ఓదార్చే శ్లోకము ఒకటి కనిపిస్తుంది. ఆ దుఃఖంలో కూడా నాలో చిరునవ్వులుదయిస్తాయి. భగవద్గీతను మననం చేసేవారు ప్రతిదినమూ దానినుండి క్రొత్త అర్ధాలు గ్రహించి ఆనందిస్తారు. (మహాత్మా గాంధీ)



Click it and Unblock the Notifications