Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
Ratha saptami 2025: రేపు ఈ సమయంలో ఈ పనులు చేస్తే ఊహించనంత డబ్బు మీ సొంతం.. మీపై సాక్షాత్తు సూర్యుడి అనుగ్రహం!
హిందూ సంప్రదాయాల్లో రథ సప్తమికి విశేషమైన స్థానం ఉంది. ఈ రథసప్తమిని, రథ ఆరోగ్య సప్తమిగా కూడా పిలుస్తారు. ఈరోజున దేశంలోని అన్ని ప్రాంతాల్లో సూర్య భగవానుడికి ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తుంటారు. ఈరోజున సూర్యుడిని పూజించడం వలన ఏడు జన్మల పాపాలు తొలిగిపోవడంతో పాటు ఆదాయం పెరుగుతుందని భక్తులు నమ్ముతుంటారు. ఏడాది పొడవునా వచ్చే రథ సప్తమితో పోలిస్తే, మకర సంక్రాంతి తరువాత వచ్చే రథ సప్తమి నాడు ప్రత్యక్ష దేవుడైన సూర్య భగవానుడిని పూజించడం వలన మంచి ఫలితాలు వస్తాయట. అయితే ఈ ఏడాది రథ సప్తమి ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు సూర్యుడిని పూజించాలి? సూర్యుడిని పూజిస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
రథ సప్తమని ఎప్పుడంటే?
హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది రథ సప్తమి రెండు రోజుల్లో వచ్చింది. ఫిబ్రవరి 4, 5వ తేదీల్లో ఈ సప్తమి యొక్క ఘడియలు ఉన్నాయి. కానీ రథ సప్తమిని ఫిబ్రవరి 4వ తేదీనే జరుపుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే రథ సప్తమిని తిథి ఫిబ్రవరి 4వ తేదీ ఉదయం 7:56 గంటలకు ప్రారంభమవుతుంది. అలాగే ఫిబ్రవరి 5వ తేదీ ఉదయం 5:29 గంటల వరకు ఉంటుంది. కానీ ఫిబ్రవరి 5వ తేదీన సూర్యోదయం 6:36 గంటలకు అవుతుంది. దానికి ముందే రథ సప్తమి తిథి ముగుస్తుండడంతో, ఫిబ్రవరి 5న జరుపుకోలేరు. కేవలం ఫిబ్రవరి 4వ తేదీన మాత్రమే ఈ పండగను జరుపుకునేందుకు వీలుంటుంది. ఆరోజు ఉదయం 7:56 గంటల తరువాత రథ సప్తమిని జరుపుకోవచ్చు.

రథసప్తమి రోజున ఏం చేయాలంటే?
రథసప్తమి పర్వదినంలో ముఖ్యంగా చేయవలసిన పనుల గురించి చెప్పుకుంటే, ఈ రోజున దానధర్మాలు చేయడం వల్ల గొప్ప ఫలితాలు సాధ్యమవుతాయని వేదాలొ, పురాణాలొ పేర్కొంటున్నారు. ముఖ్యంగా, సూర్యునికి దానం చేసినప్పుడు ఆయన ప్రసన్నుడై, శ్రేష్టమైన ఫలితాలను అనుగ్రహిస్తాడు. రథసప్తమి రోజున పేద బ్రాహ్మణులకు పప్పు, బెల్లం, గోధుమలు, రాగి, ఎరుపు లేదా కాషాయం రంగు వస్త్రాలు ఇవ్వడం చాలా ముఖ్యం.
ఈ రోజు ఉదయం నదిలో స్నానమాచరించి, సూర్యుని పూజ చేసి, ఉపవాస దీక్షతో దానధర్మాలు చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు లభిస్తాయని చెబుతున్నారు. ఈ విధంగా చేయడం వల్ల, ఏడు జన్మల పాపాలు నశించి, పుణ్యాల సమృద్ధి కలుగుతుంది. రథసప్తమి రోజున సూర్యునికి ఆరాధన చేస్తే దీర్ఘాయువు, ధనసంపద మరియు కుటుంబసుఖం పొందుతారని శాస్త్రాలొ సూచిస్తారు. ఈ సారి రథసప్తమి నాడు బ్రహ్మయోగం మరియు భరణి నక్షత్రం కూడా ఉన్నందున ఈ రోజు మరింత పవిత్రమైనది అని భావిస్తారు.



Click it and Unblock the Notifications