Latest Updates
-
ఒకవైపు షుగర్, మరోవైపు స్వీట్ క్రేవింగ్స్.. అయినా పర్లేదు, ఇలా చేసుకుని ఎన్ని కప్పులైనా తినేయొచ్చు.! -
గ్యాస్ మీద కాప్సికమ్ కాల్చి పెరుగుతో కలిపి ఈ పచ్చడి చేస్తే.. ఆ రుచే వేరబ్బా! -
జొన్న రొట్టె తినేవారికి ఎవర్ గ్రీన్ కాంబినేషన్.. గోంగూర గుడ్డు కర్రీతో లెక్క పెట్టకుండా తినేస్తారు.! -
దొండకాయ ఉల్లికారం ఇలా చేశారంటే..వద్దన్న వాళ్లే మళ్లీ మళ్లీ అడిగి తినడం గ్యారెంటీ! -
పిల్లల్లో ఏటా పెరుగుతున్న లుకేమియా కేసులు.. బ్లడ్ క్యాన్సర్‌కి తల్లిదండ్రులూ ఒక కారణమా.? -
మనిషివా.. మృగానివా? బతికున్న కుక్కను నదిలోకి విసిరేసిన మహిళ..వీడియో చూడండి -
భాద్రపద మాసంలో పవిత్రమైన రోజు.. సంతానం లేని వారు ఈ వ్రతం చేస్తే శివపార్వతుల ఆశీర్వాదం మీవెంటే.! -
కేవలం పచ్చి బియ్యం, బంగాళదుంప ఉంటే చాలు.. టేస్టీ రైస్ పాప్ కార్న్ రెడీ! -
ఉప్పు, చక్కెర.. ఈ రెండింటిలో గుండెకు ఏది ఎక్కువ డేంజర్? -
రెస్టారెంట్ స్టైల్ ఉప్మా.. ఈ ఒక్కటి కలిపారంటే వద్దు అన్న వాళ్లు కూడా ఆవురావురుమంటూ తినడం పక్కా.!
Sindoor: హిందూమతంలో సింధూరం ప్రాముఖ్యత ఏంటీ? సింధూరం వెనుక దాగి ఉన్న రహస్యాలు ఇవే
సింధూరం భారతీయ సంస్కృతిలో ఒక ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉంది. హిందూ సంస్కృతిలో వివాహిత స్త్రీలకు ఇది ఒక గౌరవప్రదమైన చిహ్నంగా పరిగణించబడుతుంది. వివాహిత స్త్రీలు తమ జుట్టు పాపిడిలో లేదా నుదుటిగా బొట్టుగా సింధూరం పెట్టుకుంటారు. దీనిని భర్త తన భార్యకు వారి వివాహ వేడుకలో తొలిసారి పెడతాడు. ఆ క్షణం వారి జీవితాల్లో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుంది. కొన్ని మతపరమైన వేడుకలు, పండుగలలో కూడా సింధూరాన్ని ఉపయోగిస్తారు. ఒక వివాహిత స్త్రీ తన నుదిటిపై ధరించే ఈ చిన్న ఎర్రటి బొట్టు వెనుక విశ్వంతో ముడిపడిన ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయని మీకు తెలుసా?
సింధూరం వెనుక దాగి ఉన్న కొన్ని రహస్యాలు
సింధూరం, జ్యోతిష్య ప్రాముఖ్యత
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మన నుదుటిని మేషరాశి స్థానంగా భావిస్తారు. ఈ రాశిని అంగాకర గ్రహం పాలిస్తుంది. అంగారకుడి రంగు ఎరుపు. ఈ రంగు శుభానికి,శక్తికి చిహ్నం. అందుకే నుదిటిపై ముఖ్యంగా జుట్టు పాపిడిలో ఎర్రటి సింధూరం ధరించడం ఒక అదృష్ట సూచకంగా పరిగణించబడుతుంది. సింధూరం కేవలం అదృష్టాన్ని మాత్రమే కాకుండా స్త్రీ శక్తిని కూడా సూచిస్తుంది. ఇది సౌభాగ్యానికి,ఐశ్వర్యానికి ప్రతిరూపం.

ఆధ్యాత్మిక ప్రాముఖ్యత
సింధూరం పెట్టుకోవడం వల్ల ఆజ్ణాచక్రం(నుదిటి మధ్య ఉండే శక్తి కేంద్రం)ఉత్తేజితమవుతుందని నమ్ముతారు. ఇది జ్ణానం, అంతర దృష్టి,ఆధ్యాత్మిక సృహను పొంపొందించడానికి సహాయపడుతుంది.
పురాణాల్లో సింధూరం గురించి
హిందూ పురాణాల ప్రకారం శివుడి భార్య పార్వతీదేవి తన భర్త నట్ల ఉన్న అనంతమైన ప్రేమకు,భక్తికి సూచనగా నిత్యం తన నుదుటిపై సింధూరం పెట్టుకునేది.శివుడికి సింధూరం అంటే ఎంతో ఇష్టం అని చెప్పబడింది. కాబట్టి సింధూరం పెట్టుకునే స్త్రీలకు దీర్ఘకాలిక,ఆనందమైన వైవాహిక జీవితం లభిస్తుందని విశ్వసిస్తారు. అంతేకాకుండా దుష్టశక్తుల నుంచి వారిని కాపాడుతుందని, ఎలాంటి హాని కలగకుండా రక్షిస్తుందని విశ్వసిస్తారు.కాబట్టి సింధూరం కేవలం భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమకు,భక్తికి చిహ్నం మాత్రమే కాదు..కొత్తగా పెళ్లైన వాళ్లకి భద్రతనిచ్చే ఒక కవచం లాంటిది.
ఆనందం
సింధూరం స్త్రీ లింగతత్వాన్ని చాలా వరకు పెంచి,దైవిక సౌందర్యాన్ని. సాధారణంగా ఎర్ర రంగును ప్రేమకు,అభిరుచికి చిహ్నంగా చెబుతారు. అందుకే భారత మహిళలు తమ భర్త హృదయాలను గెల్చుకోడానికి దీనిని ఉపయోగిస్తారు. సింధూరం.. ఒక మహిళ ఆమె భర్త సంరక్షణలో ఉందని సూచిస్తుంది,దీంతో ఆమెను ఎవరూ తప్పుడు ఉద్దేశ్యంతో చూడరు. అయితే ప్రస్తుతం కలికాలం నడుస్తున్న సమయంలో కొందరు పండు ముసలివాళ్లను కూడా వదిలిపెట్టకుండా వారిపై లైంగిక దాడులుకు పాల్పడుతున్నారు అది వేరే విషయం.
సంప్రదాయకంగా సింధూరం ఎలా తయారుచేస్తారు
సాంప్రదాయకంగా సింధూరం పసుపు, సున్నం లేదా ఇతర సహజ మూలికా పదార్థాల నుండి తయారు చేస్తారు. పసుపు పొడిని నిమ్మరసం లేదా సున్నం పొడితో కలిపినప్పుడు అది ఎరుపు రంగులోకి మారుతుంది. ఆధునిక కాలంలో సింధూరంలో ఎక్కువగా సిన్నబార్ (మెర్క్యురీ సల్ఫైడ్ సహజ రూపం) ఉంటుంది.. ఇది విషపూరితమైనది కాబట్టి జాగ్రత్తగా వాడాలి. కొన్ని వాణిజ్య సింధూరాలలో సీసం కూడా ఉండవచ్చు.. ఇది ఆరోగ్యానికి హానికరం. ప్రస్తుతం సహజ, ఆయుర్వేద పదార్థాలతో తయారు చేసిన సింధూరం కూడా అందుబాటులో ఉంది.



Click it and Unblock the Notifications
