Latest Updates
-
బఠానీ, పెసరపప్పు కాంబినేషన్... ఈ సమోసా రుచి చూస్తే మళ్లీ మళ్లీ తింటారు! -
వ్యాయామం చేసటప్పుడు విపరీతంగా చెమట.. కొవ్వు కరిగిపోతుందని అస్సలు సంబరపడొద్దు.! -
ఉదయం లేవగానే ఒళ్లు నొప్పులు, జాయింట్స్ పట్టేస్తున్నాయా? -
పప్పులు నానబెట్టే పనిలేదు,రుబ్బే శ్రమలేదు..అటుకులు,బంగాళదుంపలతో క్షణాల్లో కరకరలాడే అప్పడాలు.. -
ప్రెగ్నెన్సీలో చర్మం ఎందుకు నల్లబడుతుందో తెలుసా.. పిగ్మెంటేషన్‌ను ఇలా పోగొట్టుకోండి.! -
ఈ 5 రాశుల వారికి నేడు అదృష్టం.. శివయోగం ప్రభావంతో కాసుల వర్షం ఖాయం! -
గర్భస్రావం తర్వాత సంతాన సామర్థ్యం పెరుగుతుందా.. ఇందులో నిజమెంత.? -
జూన్ 24న శివ యోగం: ఈ సమయం నుంచి మీ కెరీర్, అదృష్టం మారుతుందా? -
ఇంట్లో శ్రీ చక్రం ఉంటే ఏమవుతుంది? ఆధ్యాత్మిక నిపుణులు చెప్పిన విషయాలు -
జూన్ 24 నుంచి తులా రాశిలో చంద్ర సంచారం: ఈ రాశుల వారికి అదృష్టం, ధన లాభం ఖాయం!
కలియుగం అంతమయ్యే సమయంలో ఇవి జరుగుతాయ్..! ప్రస్తుతం ఇలాంటివే కనిపిస్తున్నాయ్..!
కలియుగాంతం ముందు కనిపించే సంకేతాలు ఎలా వుంటాయ్. ఆ సమయంలో ఎటువంటి పరిణామాలు, ఎటువంటి కీలక మార్పులు చోటుచేసుకుంటాయో తెలుసుకుందాం.కలియుగం అంతమయ్యే సమయం ఆసన్నమైందా. వాటి సంకేతాలు ఎలా వుంటాయోిప్పుడు మనం తెలుసుకుందాం. అసలు కలి ఎవరనే విషయాన్ని కూడా చూద్దాం. క్రోధ అనే యువకుడు, హింస అనే తన చెల్లెలిని పెళ్లి చేసుకుంటాడు. వారికి కలిగిన సంతానమే కలి. కలి పుట్టుకే ధర్మానికి విదుర్ధం. అలాంటి కలిపాలించే లోకం ఎలా వుంటుందో అర్థం చేసుకోవచ్చు. ఏ కర్మలు పాటించవద్దని పరమేశ్వరుడు చెప్పాడో వాటిని మాత్రమే ఆచరిస్తారు.

కల్కి అవతారం ఎవరనే విషయం కూడా చాలా మందికి తెలిసే వుంటుంది. శ్రీ మహావిష్ణువు పదవ అవతారమే కల్కీ. కలియుగం అంతమై సత్యయుగం ప్రారంభమయ్యే దశలో శంబలా నగరంలో విష్ణు యశస్సు అనే బ్రాహ్మణుడి ఇంట్లో జన్మిస్తాడు.చేతిలో ఖడ్గం, తెల్లని గుర్రంపైన స్వారీ చేస్తూ ధర్మ సంస్థాపన చేస్తాడు. కల్కీ అంటే దోషాన్ని తొలగించేవాడు. దోషాన్ని తొలగించేవాడు కాబట్టే కల్కీ అయ్యాడు.
అయితే కలియుగం అంతమయ్యే సమయంలో కొన్ని సంకేతాలు కనిపిస్తాయ్. ఆ సంకేతాల గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ విషయాలన్నీ విష్ణు పురాణంలో చాలా స్పష్టంగా చెప్పబడి వుంది. కలియుగం అంతమ్యే సమయంలో సత్యం, ధర్మం అనే మాట వుండదు. చిన్న పిల్లలను, గోవులను, స్త్రీలను దారుణంగా హింసిస్తారు. అత్యాచారాలు, గోవధ ఇప్పటికే చాలా చూస్తూనే వున్నాం. వివాహాల్లో పెద్దల ప్రమేయం అవసరం లేదన్నట్టు తాము ముందుండి పెళ్లి చేసుకుంటారు. యగ్నయాగాదులు జరిపే సమయంలో ప్రకృతి ఘోషిస్తుంది. చెట్లు ఎండిపోతాయ్, సన్యాసులకు స్త్రీలపై వ్యామోహం పెరుగుతుంది. వితంతువులతో కలిసి వారు సంతానాన్ని పొందుతారు.
పిల్లలు కన్నవారిని రోడ్డుపైన పడేసి వారిని పట్టించుకోకుండా వుంటారు. కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నమైపోతుంది. మత్తూ, శారీరక సుఖాలపై మనుషులు ఆసక్తిని పెంచుకుంటున్నారు. గంగమ్మను గౌైరవించరు, తులసిని చాలా అవమానపరుస్తారు. రోగం లేని మనిషి ఎవరూ కనిపించరు. తినే ఆహారంలో రుచి తగ్గుతుంది. ఘోరమైన తప్పులు చేసిన వారు కూడా సమాజంలో అందరి మధ్యా స్వేచ్ఛగా తిరుగుతుంటారు. కంటికి కనిపించిందే ప్రామాణికమని అంటారు. కంటికి కనిపించని దేవుడిని కూడా నమ్మరు. పైగా వితండవాదం చేస్తారు.

తినకూడని పదార్ధాలు తింటారు. చూడకూడని విషయాలపై కళ్లు ఆకర్శితులౌతాయ్. కోరికలు పెరిగి వ్యాధులబారిన పడతారు. గురువులకు తలవంచి నమస్కరించే విద్యార్ధులు కనుమరుగైపోతారు. విద్యార్ధులను చూసి గురువులు భయపడే పరిస్థితి ఎదురౌతుంది. దొంగలే పాలకులుగా మారుతారు. కావాలని ఉపద్రవాలు సృష్టించి ప్రజల్ని హింసిస్తారు. అనవసర వస్తువులపై పన్నులు విధించి ప్రజల్ని పట్టి పీడిస్తారు. రాక్షసులకు శరీరం వుండదు. ప్రతీ మనిషిలో గుణాల రూపంలో రాక్షసులు వుంటారు.
చాలా మందికి జీవితం ఎందుకు అని అనిపిస్తుంది. ఈ లక్షణాలు కలియుగం ముగిసే సరికి మరింత ఎక్కువౌతాయ్. కలియుగంలో ఏడేళ్లకే పిల్లలను కంటారు. మరుగుజ్జులుగా జన్మించిన ఆ సంతానం కేవలం 20 ఏళ్ల వరకే బ్రతుకుతారు. వానలూ, పంటలూ లేక మంసం తిని బ్రతుకుతారు. ఒక మనిషిని తింటే కానీ మరో మనిషి బ్రతకలేని స్థితికి చేరుకుంటారు. ఆఖరి వందేళ్లలో కరువు విలయతాండవం చేస్తుంది.



Click it and Unblock the Notifications