Latest Updates
-
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026
నిశ్శబ్దంలో అనంతమైన శక్తి వుంది..! ఒక రోజు ఇలా ట్రై చేస్తే మార్పు మీరే చూస్తారు..!
ఆధ్యాత్మికంగా ఎదగాలంటే నిశ్శబ్దం చాలా ముఖ్యం. ఒకరు తలుచుకుంటే నిశ్శబ్దంగా మారవచ్చు. గాలి తనదైన శబ్దం చేస్తుంది, అలాగే నీరు కూడా తనదైన శబ్దం చేస్తుంది. భూమి కూడా శబ్దం చేస్తుంది, ఆకాశం కూడా, ఈ సృష్టిలో దాదాపు అన్నీ వాటి శబ్దాలు చేస్తున్నాయ్. బాధకు కూడా శబ్దం వుంది, సంతోషానికి కూడా శబ్దం వుంది. ప్రతీ దానికి ఒక శబ్దం వుంది. దీన్ని ఎవ్వరూ కొట్టిపారేయలేరు, ఎవరు అంగీకరించినా , అంగీకరించకపోయినా ఇదే సత్యం. జీవనానికి సంబంధించిన శబ్దాలున్నాయ్, అలాగే మరణానికి సంబంధించిన శబ్దాలున్నాయ్. నిశ్శబ్దానికి సంబంధించిన శబ్దాలు కూడా వున్నాయ్. ఈ శబ్దాలన్నీ తమ స్థాయిని బట్టి నిర్భంధతను సృష్టిస్తుంది. వేరు వేరు స్థాయిల బంధనాలను సృష్టిస్తుంది. అలాగే బంధనాల్లో చిక్కుకుపోయే వేరు వేరు అవకాశాలను సృష్టిస్తుంది. వీటన్నింటి మధ్యలో ఒకరు నిశ్శబ్దంగా అవ్వటానికి ఎంచుకుంటారు. నిశ్శబ్దమనేది మీరు నిరాకరించే మార్గం కాదు.మిమ్మల్ని మీరు మాట్లాడుకోనీయకుండా చేసుకోవడం గురించి కూడా కాదు. నిశ్శబ్దమనేది నిర్బంధం నుంచి చైతన్యం వైపు వెళ్లడం గురించి.

అన్ని శబ్దాలు వేరు వేరు నిర్బంధాలను, పార్శ్వాలను సూచిస్తాయ్. ఒకరు చైతన్యం కావాలని నిర్ణియించుకున్నప్పుడు, ఈ నిర్భంధంలో చిక్కకుండా వుండడానికి వారు నిశ్శబ్దంగా వుండడానికి ఎంచుకుంటారు. నిశ్శబ్దమంటే నోరు చెవులు మూసుకొని వుండే నిశ్శబ్దం కాదు. నిశ్శబ్దంలో మీరు పాడవచ్చు, డ్యాన్స్ చేయవచ్చు, మాట్లాడవచ్చు.
శబ్దం లేకపోవడమంటే ప్రకంపన లేకపోవడం. ప్రకంపన లేకపోవడమంటే జీవం లేకపోవడం. జీవం లేకపోవడమంటే సృష్టి లేకపోవడం. సృష్టి లేకపోవడమంటే సృష్టికర్త కూడా లేకపోవడం. కాబట్టి ఇది సృష్టికీ సృష్టికర్తకీ అతీతమైన చోటు. ఇది జీవన్మరణాలకు అతీతమైన ఒక పార్శ్వం. దాన్నే నిశ్శబ్దం అని మనము అంటాం.
నిశ్శబ్దాన్ని అభ్యాసం చేస్తూ ఆ వ్యక్తి పూర్తిగా నిశ్శబ్దంగా అయిపోవచ్చు. ఒకరు తీక్షణంగా ఏదైనా పనిచేస్తున్నప్పుడు తీక్షణంగా అయిపోవచ్చు. కానీ ఎప్పటికీ అదే తీక్షణతో పనిచేస్తూ వుండలేరు. నిశ్శబ్దాన్ని ఎన్నో విధాలుగా సాధించవచ్చు. ఒక పామును చూసినప్పుడు అది నిశ్చలంగా వుంటుంది. మీరు వేటాడే పులిని గనుక చూస్తే అది పూర్తి నిశ్శబ్దంగా వుంటుంది. ఇవన్నీ మనుగడ కోసం నిశ్శబ్దంగా వుంటాయ్. ఒక పాము ఎక్కువగా కదిలితే అది చంపబుడుతుంది. పులికి నిశ్శబ్దంగా వుండడం తెలియకపోతే దానికి ఆహారం ఎప్పటికీ దొరకదు. ఇవన్నీ మనుగడ కోసం చేసే పనులు.

జీవితంలో అద్భుత విషయాలను సాధించాలంటే తప్పకుండా నిశ్చలతను, నిశ్శబ్దంగా వుండే పరిస్థితి వస్తుంది.కొందరు తమ శరీరాన్ని ఒక చోట ఎప్పటికీ వుంచలేరు. ఎప్పుడూ కదులుతూనే వుంటారు. శరీరాాన్ని నిశ్చలంగా మార్చుుంటే ఎన్నో రోగాల బారిన పడకుండా వుంటారు. జీవితంలో హుందా తనాన్ని పొందాలనుకుంటే కొద్దిపాటి నిశ్చలత్వాన్ని, నిశ్శబ్దాన్ని సాధించాల్సిన అవసరముంది. ఇది జరగాలంటే మీ జీవితంలో ఒక స్థాయి నిశ్శబ్దం రావాలి. దాన్ని మీరు సాధించలేకపోతే కసీనం ముందుగా మౌనంగా వుండడానికైనా ట్రై చేయండి.
ఒక రోజు మౌనంగా వుండడానికి ప్రయత్నించండి. మీలో అద్భుతమైన మార్పు వస్తుంది. ఏదో ఒకటి సాధించామనే సంతృప్తిని మీరు కలిగివుంటారు. నిశ్చలత్వానికి, నిశ్శబ్దానికి చాలా శక్తి వుంది. ప్రపంచంలో అందరూ ఇలా వుండగలిగితే అద్భుత నిలయంగా మారుతుంది.



Click it and Unblock the Notifications