Latest Updates
-
ఎండల తీవ్రతతో గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు అప్రమత్తంగా ఉండాల్సిందేనా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ బ్రేక్ ఫాస్ట్ కి గుడ్ బై.. నోటికి కమ్మగా, ఒంటికి బలంగా పనీర్ పెసర దోశ..ఎలా చేసుకోవాలంటే.. -
ఢిల్లీలో మండుటెండల ఎఫెక్ట్: పెళ్లిళ్ల ప్లాన్స్ మార్చేసిన జంటలు.. అర్ధరాత్రికి షిఫ్ట్ అవుతున్న ఫేరాలు! -
జాకీ భగ్నానీ 'సిట్యుయేషన్షిప్' కామెంట్.. రకుల్ ప్రీత్ సింగ్ అదిరిపోయే రిప్లై! -
వీకెండ్ స్పెషల్..పక్కా రెస్టారెంట్ రుచితో అంబూర్ స్టైల్ సోయా బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే -
వైశాఖ పౌర్ణమి నాడు ఈ చిన్న పనులు చేస్తే.. మీ కష్టాలన్నీ మంచులా కరిగిపోతాయి! -
ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ నుంచి తప్పించుకోవడానికి ఇంట్లోనే ఉన్న ఈ చిట్కాలు ట్రై చేయండి -
చుక్క క్రీమ్ వాడకుండానే..రెస్టారెంట్ స్టైల్ క్రీమీ పెరి పెరి సోయా.. ఎలా చేయాలో చూడండి! -
ఆర్సీబీ విజయం: ఒత్తిడిలో కూడా సక్సెస్ సాధించే అద్భుతమైన లైఫ్ లెసన్స్ ఇవే! -
నోరూరించే గోంగూర అన్నం..తెలుగువారి రుచుల్లో రారాజు!
ఈఏడాది రెండు శ్రావణ మాసాలు, వరలక్ష్మీ వ్రతం ఎప్పుడో తెలుసా?
శ్రావణం వచ్చిందంటే ప్రతి ఇంట్లోనూ ఆధ్యాత్మికత వెల్లివిరుస్తుంది. ఉదయం, సాయంత్రం పూజాది కార్యక్రమాలు జరుగుతుంటాయి. హిందూ సనాతన ధర్మం ప్రకారం, తెలుగు మాసాల్లో శ్రావణ మాసానికి ఎంతో విశిష్టత ఉంది. హిందూ సాంప్రదాయం ప్రకారం శ్రావణ మాసాన్ని అత్యంత పవిత్రమైన నెలగా పరిగణిస్తారు. అయితే ఈ సారి శ్రావణ మాసం అధికంగా వస్తోంది. సాధారణంగా నెల రోజులు ఉండాల్సిన శ్రావణ మాసం ఈ సారి 2 నెలల పాటు ఉంటుంది.
తెలుగు పంచాంగం ప్రకారం జులై 17వ తేదీతో ఆషాఢమాసం ముగుస్తుంది. జులై 19వ తేదీతో శ్రావణ మాసం మొదలవుతుంది. ఈ సంవత్సరం అధిక శ్రావణ వస్తోంది కాబట్టి జులై 18 నుంచి ఆగస్టు 16 వరకు ఉండేది అధిక శ్రావణం. ఆగస్టు 17వ తేదీ నుంచి నిజ శ్రావణం మొదలవుతుంది. నిజ శ్రావణం సెప్టెంబర్ 15వ తేదీ వరకు ఉంటుంది. దక్షిణాయనంలో వచ్చే అత్యంత పవిత్రమైన నెలగా శ్రావణాన్ని పరిగణిస్తారు. శ్రావణ మాసంలో లక్ష్మీ ఆరాధన, శివారాధన చేస్తే దేవదేవుళ్ల అనుగ్రహం లభిస్తుందని, పుణ్యం ప్రాప్తిస్తుందని భక్తుల విశ్వాసం.

వరలక్ష్మీ వ్రతం 2023 తేదీ, శుభముహూర్తాలు:
ఈ ఏడాది ఆగస్టు 25వ తేదీన వరలక్ష్మీ వ్రతం వస్తోంది.
- సింహ లగ్న పూజ ముహూర్తం (ఉదయం) - 05:55 నుండి 07:42 వరకు
- వృశ్చిక లగ్న పూజ ముహూర్తం (మధ్యాహ్నం) - 12:17 నుండి 14:36 వరకు
- కుంభ లగ్న పూజ ముహూర్తం (సాయంత్రం) - 18:22 నుండి 19:50 వరకు
- వృషభ లగ్న పూజ ముహూర్తం (అర్ధరాత్రి) - 22:50 నుండి 00:45 వరకు, ఆగస్టు 13
వరలక్ష్మీ వ్రతం చేసే రోజు:
వరాలిచ్చే తల్లినే వరలక్ష్మీ దేవత అని అంటారు. శ్రావణ మాసంలో శుక్ల పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతం చేయడం ప్రతి ఏటా ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో తమ ఇంటికి సకల సౌభాగ్యాలు కలగాలని కోరుకుంటూ ఆడవారు చేసే వ్రతం ఇది. ఈరోజున ఉదయాన్నే తలస్నానం చేసి.. ఉతికిన బట్టలను ధరించి పూజ గదిని శుభ్రం చేయాలి. ఈరోజంతా ఉపవాసం ఉండాలి.
వ్రతం సమయంలో నేవైద్యాలు అర్పించి.. చేతికి కంకణం కట్టుకుని.. అక్షింతలు తలపై వేసుకొని పూజను పూర్తి చేయాలి. ఆ తర్వాత ముత్తైదువులందరికీ తాంబూలాలు ఇచ్చి తీర్థ ప్రసాదాలు ఇవ్వాలి. అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని ఆరోజే తినేయాలి. అలాగే రాత్రి వరకూ ఉపవాసం ఉండాలి. ఇంతకన్నా ఈ వ్రతానికి పెద్దగా నియమనిష్టలంటూ ఏమీ లేవని పండితులు చెబుతున్నారు.
వరలక్ష్మీ వ్రతం రోజున మనసులో ఏదో విషయం గురించి ఆలోచిస్తూ.. పరధ్యానంలో ఉంటూ పూజ చేయకూడదు.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications