Latest Updates
-
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే..
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.!
తిరుమల యాత్రకు ఏడాదికి ఒక్కసారైనా వెళ్లాలని చాలా మంది భక్తులు అనుకుంటారు. అందుకు అనుగుణంగా ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు. అదేవిధంగా తిరుమల యాత్రలో భాగంగా సమీపంలోని దేవాలయాలనూ సందర్శిస్తుంటారు. కానీ మీరు ఎప్పుడైనా వారాహి శక్తి పీఠాన్ని దర్శించుకున్నారా.? కలియుగ క్షేత్రానికి చేరువలో ఉన్న ఈ ఆలయ ప్రత్యేకత తెలుసుకుంటే తప్పనిసరిగా మీరు ఈ సారి దర్శించుకుంటారు.

తిరుమల క్షేత్రానికి సుమారు 14 కి.మీ దూరంలో శ్వేతవారాహి ఆలయం కొలువై ఉంది. ఈ ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని ముడుపులు కడితే కోరిన కోర్కెలు నెరవేరుతాయని, పవిత్రమైన మట్టితో పూజలు చేస్తే పంటలు బాగా పండుతాయని భక్తుల నమ్మకం. ఇక్కడ అమ్మవారు భూగర్భంలో ప్రతిష్ఠించి ఉంటారు. ముఖ్యంగా ఆషాఢ మాసంలో ఈ ఆలయంలో గుప్త నవరాత్రులు జరుగుతాయి. నేటితో ఈ గుప్త నవరాత్రులు ముగియనున్నాయి. శరన్నవరాత్రుల సమయంలోనూ ఈ ఆలయం భక్తుల రద్దీతో కిటకిటలాడుతుంది.
ఆలయ చరిత్ర
తిరుపతికి సమీపంలోని రాయలచెరువు తీరంలో శ్రీ వారాహి అమ్మవారి శక్తి పీఠం ఉంది. ఈ ఆలయం నిర్మాణం వెనుక ఆసక్తికర చరిత్ర ఉంది. పూర్వాశ్రమంలో వైద్యవిద్యను అభ్యసించిన రమ్యానంద భారతి అమ్మవారి సేవలో తరించాలని భావించి సాధారణ జీవితాన్ని వదిలిపెడతారు. కుర్తాళం పీఠాధిపతి సిద్ధేశ్వరానంద భారతి సమక్షంలో సన్యాస దీక్ష స్వీకరించి కాళీ ఉపాసన చేస్తున్నారు. ఆ సమయంలో అమ్మవారు సాక్షాత్కరించి తన కోసం ఆలయం నిర్మించాలని ఆదేశిస్తారు.
అమ్మవారి కోరిక మేరకు ఆలయం కోసం స్థలం వెతుకుతుండగా మళ్లీ వారాహి దేవి అమ్మవారి కలలో కనిపించి భూగర్భంలో ఆలయాన్ని నిర్మించాలని చెప్పారట. అలా వారాహి అమ్మవారి అక్కడ వెలిసిందని చరిత్ర చెబుతోంది. ఇక్కడ అమ్మవారితో పాటు శక్తి గణపతి, కాల భైరవుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలతో పాటు పలు ఆలయాలు కొలువై ఉన్నాయి.

మృత్తికా పూజ
తిరుమలకి వెళ్లే భక్తులతో పాటు స్థానిక ప్రాంతాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచే కాకుండా దేశవిదేశాల నుంచి భక్తులు అమ్మవారి ఆలయానికి వస్తుంటారు. ప్రతి నెలా పంచమి రోజు మృత్తికా పూజ వైభవంగా జరుగుతుంది. ఇందులో భాగంగా పవిత్రమైన మట్టిని సేకరించి పూజలో ఉంచుతారు. ఆ మట్టిని పొలాల్లో చల్లితే పంటలు బాగా పండుతాయని, దిగుబడి భారీగా వస్తుందని రైతుల విశ్వసిస్తుంటారు.
కొంగు బంగారం
వారాహి శక్తి పీఠం ఆలయ ప్రాంగణంలో ఉండే శూలబంధంలో ముడుపు కట్టడం ఏళ్ల తరబడి కొనసాగుతుంది. ఇలా చేయడం ద్వారా నిస్వార్థమైన కోర్కెలు నెరవేరుతాయి. నవరాత్రి ఉత్సవాల సమయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు నిర్వహిస్తారు. ప్రత్యేక రోజుల్లో అమ్మవారి అలంకరణ చూస్తే చూపు తిప్పుకోలేరు. తిరుపతి నుంచి రాయలచెరువు మార్గంలో వారాహి అమ్మవారి ఆలయానికి చేరుకోవచ్చు.



Click it and Unblock the Notifications