Latest Updates
-
బంగాళాదుంప, పెరుగు ఈ రెండూ ఉంటే చాలు.. భోజనంలో ఎవర్ గ్రీన్ సైడ్ డిష్ రెడీ.! -
సన్నగా ఉన్నంతమాత్రాన ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉన్నట్లా.. ఫిట్‌నెస్‌పై అపోహలు, వాస్తవాలివే.! -
పిజ్జాను మించిన డబుల్ రుచితో చికెన్ పాన్ కేక్.. మైక్రోవేవ్ ఓవెన్‌తో పని లేదు.! -
రేపే నాగుల పంచమి.. ఈ రాశుల వారి జాతకంలో ఊహించని మార్పులు.! -
హోటల్ ఫుడ్ బాగాలేదని ఎలా తెలుసుకోవాలి.. రెస్టారెంట్‌కి వెళ్లినప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.! -
నోట్లో వేస్తే కరిగిపోయేలా ఎగ్ సలాడ్ శాండ్విచ్.. ఇలా చేశారంటే ఒక్కటి కూడా వదలరు.! -
కడుపు నిండా తిన్నా లైట్‌గా అనిపించే హెల్తీ వంకాయ పెరుగు పచ్చడి.. సింపుల్‌గా ఇలా చేసేయండి.! -
డ్రగ్స్‌కి బానిస అవుతున్న యువత.. మాదకద్రవ్య రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోదీ పిలుపు.! -
రాయల్ వీకెండ్.. ఈ స్పెషల్ మసాలాతో మొఘల్ కిచెన్ రెసిపీ మహారాణి చికెన్ కర్రీ.! -
పంద్రాగస్టు స్పెషల్ స్వీట్..చల్లారినా గట్టిపడని వెడ్డింగ్ స్టైల్ రవ్వ కేసరి మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..
Srivari Salakattu Brahmotsavam 2023: మీన లగ్నంలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభం
Srivari Salakattu Brahmotsavam: ధ్వజారోహణంతో వైభవంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయ్యాయి. తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సోమవారం సాయంత్రం 6.15 నుండి 6. 30 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణ ఘట్టంతో వైభవంగా ప్రారంభం అయ్యాయి.
శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారి సమక్షంలో వేదగానాల మధ్య మంగళవాద్యాలు మోగుతుండగా అర్చకస్వాములు బంగారు ధ్వజస్తంభంపై గరుడధ్వజాన్ని ఎగురవేశారు.

శ్రీ రామకృష్ణ దీక్షితులు కంకణభట్టర్‌గా వ్యవహరించారు. సకల దేవతలను, అష్టదిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తారని ప్రాశస్త్యం.
ముందుగా బంగారు తిరుచ్చిపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని, పరివార దేవతలైన శ్రీ అనంత, గరుడ, చక్రత్తాళ్వార్, సేనాధిపతి వారిని, ధ్వజపటాన్ని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు.
తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు కళ్లారా చూడాలని శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు తిరుమలకు క్యూ కడుతున్నారు. ఏడుకొండల స్వామి బ్రహ్మోత్సవాలు చూడటానికి వెలుతున్న భక్తుల రద్దీతో తిరుమల కొండలు కిటకిటలాడుతున్నాయి. తిరుమలలో భక్తులకు ఎలాంటి సమస్యలు ఎదురుకాకుండా టీటీడీ అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు.
తిరుమలలోని శ్రీవారి వైకుంఠం క్యూకాంప్లెక్స్ లో శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్న భక్తులకు ఎప్పటికప్పుడు అన్నప్రసాదాలు, తాగునీరు అందిస్తున్నారు. టీటీడీ ఉద్యోగులతో పాటు శ్రీవారికి స్వచ్చందంగా సేవ చేస్తున్న వారు తిరుమలలో ప్రతిరోజు 24 గంటల పాటు విదులు నిర్వహిస్తున్నారు. తిరుమలలోని అన్ని రహదారులు నిత్యం శుభ్రం చేస్తున్నారు.
ఎండా, వాన, చలిని లెక్కచెయ్యకుండా శ్రీవారి భక్తులు సాలకట్టు బ్రహ్మోత్సవాలు చూడటానికి తిరుమలకు లక్షల మంది వెలుతున్నారు. వినాయక చవితి పండుగ అయినా సోమవారం తిరుమలలో భక్లుల సంఖ్య ఎక్కువగానే ఉందని ప్రత్యక్ష సాక్షులు అంటున్నారు. మీన లగ్నంలో ధ్వజారోహణ ఘట్టంతో వైభవంగా ప్రారంభం అయిన సాలకట్టు బ్రహ్మోత్సవాలను ఎస్ వీబీసీలో ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు.



Click it and Unblock the Notifications