Latest Updates
-
కర్కాటకంలో గురుడి సంచారం: ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, అదృష్టం, సంపద వెల్లువ! -
ధనుస్సు, మీన రాశుల వారికి అద్భుత యోగం.. మీ రాశి ఉందా? - బుధవారం, 03 జూన్ 2026 -
ఇతరుల ప్రేమను చూసి మొదలైన పోలికలు.. చివరకు బంధాలను ఎలా కూల్చేస్తున్నాయి -
గోంగూర రొయ్యల కూరను ఇంట్లోనే అచ్చం హోటల్ రుచితో ఇలా చేసుకోండి.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ అడుగుతారు! -
పెళ్లై ఏళ్లు గడిచినా పాత ప్రేమ మర్చిపోలేకపోతున్నారా? ఇందులో తప్పేం లేదు కానీ జాగ్రత్త -
పిజ్జా, బర్గర్లు దీని ముందు పరార్.. నోట్లో ఇట్టే కరిగిపోయేలా ఆలూతో ఎగ్ బజ్జీ.! -
కర్మ సిద్ధాంతం అంటే ఏమిటి? మీ జీవితంలో జరిగేదంతా దీనివల్లేనని శాస్త్రాలు చెబుతున్నాయా? -
వెజ్ లవర్స్ కోసం సోయాతో టిక్కా మసాలా.. వీటిని యాడ్ చేస్తే వేరే లెవెల్ టేస్ట్.! -
ఈ ట్రెడిషనల్ ఫ్యామిలీ రెసిపీతో పనీర్ పరాఠా ఇలా చేస్తే.. ఇంట్లో వాళ్లు లొట్టలేసుకుంటూ తింటారు! -
జూన్ 2, 2026: ఈ రాశుల వారికి ధన యోగం.. అదృష్టం తలుపు తడుతోంది, సిద్ధంగా ఉండండి!
ఒక దురదృష్ట దేవత: తులసి కథ
తులసి మొక్క ప్రతి హిందువు ఇంట్లో తప్పనిసరిగా ఉండేది. ప్రతిరోజూ పొద్దున స్త్రీలు ఆ మొక్కకి నీరు, అగరొత్తులు, పువ్వులు వేసి పూజిస్తారు. ప్రతి సాయంత్రం దీపం వెలిగించి ఆ మొక్క ముందు ఉంచుతారు. మీరెప్పుడైనా
తులసి మొక్క ప్రతి హిందువు ఇంట్లో తప్పనిసరిగా ఉండేది. ప్రతిరోజూ పొద్దున స్త్రీలు ఆ మొక్కకి నీరు, అగరొత్తులు, పువ్వులు వేసి పూజిస్తారు. ప్రతి సాయంత్రం దీపం వెలిగించి ఆ మొక్క ముందు ఉంచుతారు. మీరెప్పుడైనా కేవలం ఈ మొక్కనే ఎందుకు ఇంత ప్రత్యేకంగా పూజిస్తారో అని అనుకున్నారా?
ఎందుకంటే, హిందువులు తులసి మొక్కను దేవతగా భావిస్తారు. విష్ణుమూర్తికి ఆమె చాలా సన్నిహితం మరియు ఏ పూజా తులసి ఆకులు లేకుండా పూర్తవ్వదు. తులసి మొక్కకి అనేక వైద్య,ఆరోగ్యలాభాలు కూడా ఉన్నాయి. జలుబు,దగ్గు వంటి వాటిని నయం చేయడానికి ఆయుర్వేద చికిత్సలో తులసి ముఖ్యమైన మొక్క. ఇది వాతావరణాన్ని కూడా శుద్ధిచేసి, దోమలకు వ్యతిరేకంగా కూడా పనిచేస్తుంది.
మీకు ఇంకా ఈ అద్భుతమొక్క గూర్చి తెలుసుకోవాలని ఉందా? అయితే, చదవండి.

తులసి ; అంకితభావం కల భార్య
హిందూ పురాణాలలో తులసిని వృందగా పిలుస్తారు. ఈమె కాలనేమి అనే రాక్షసుడి అందమైన కూతురు, యువరాణి. పరమశివుని ముఖ్యభాగం జలంధర్ ను ఆమె పెళ్ళాడుతుంది. శివుని మూడోకన్ను లోంచి పుట్టిన అగ్నిలోంచి పుట్టడం వలన జలంధర్ కి అపారశక్తి ఉన్నది. జలంధర్ ఎంతో పవిత్రం, భక్తురాలైన స్త్రీ అయిన యువరాణి వృందను ప్రేమిస్తాడు.

తులసి ; అంకితభావం కల భార్య
వృంద మహావిష్ణువు పరమభక్తురాలు, జలంధర్ ఏమో అందరు దేవుళ్ళను అసహ్యించుకునేవాడు. కానీ విధి వల్ల ఇద్దరూ పెళ్ళాడతారు. నిజానికి ఆమెతో పెళ్ళయ్యాక ఆమె భక్తి, పవిత్రత వల్ల అతని శక్తి మరింత పెరిగిపోయింది. పరమశివుడు కూడా జలంధర్ ను ఓడించలేకపోతాడు. అతని మూర్ఖత్వం పెరిగిపోయి పరమశివునే ఓడించి విశ్వానికి అధిపతి కావాలనుకుంటాడు.

ఒక దురదృష్ట దేవత
దేవతలు జలంధర్ శక్తులను చూసి భయపడతారు. వారు విష్ణుమూర్తి వద్దకు సాయం కోసం వెళ్తారు. విష్ణుమూర్తి, వృంద తన భక్తురాలు కావటంతో, ఆమెకు జరగబోయే అన్యాయం వల్ల సందిగ్థంలో పడతాడు. కానీ జలంధర్ వల్ల జరిగే నష్టం వల్ల మహావిష్ణువు ఒక మాయ చేయాలని నిర్ణయించుకుంటాడు.

ఒక దురదృష్ట దేవత
జలంధర్ పరమశివునితో యుద్ధంలో ఉండగా, విష్ణువు వృంద వద్దకు జలంధర్ రూపంలో వస్తాడు. వృంద అతన్ని గుర్తుపట్టలేక అతన్ని జలంధర్ అనే భావిస్తుంది. మహావిష్ణువు తాకగానే ఆమె తన భర్త కాదని గ్రహిస్తుంది. ఆమె పతివ్రత నిష్ట భగ్నం అయి, జలంధర్ బలహీనుడవుతాడు. తన తప్పు తెలుసుకుని, వృంద మహావిష్ణువు నిజరూపాన్ని కోరుతుంది. ఆమె తను పూజించిన దేవుడే తనని మాయ చేసాడని తెలిసి బాధపడుతుంది.

వృంద శాపం
మహావిష్ణువు మారురూపం తెలుసుకుని, తన పవిత్రతపై జరిగిన మోసానికి వృంద మహావిష్ణువుని శపిస్తుంది. అతన్ని రాయికమ్మని శపిస్తుంది. విష్ణువు ఆమె శాపాన్ని అంగీకరించి గండక నది వద్ద సాలిగ్రామ శిలగా మారతాడు. దీని తర్వాత, జలంధర్ పరమశివుని చేతిలో హతుడవుతాడు. వృంద కృంగిపోయి, తన జీవితాన్ని కూడా ముగించాలనుకుంటుంది.

విష్ణుమూర్తి వరం
వృంద చనిపోయే ముందు, విష్ణుమూర్తి ఆమె తులసిగా పిలవబడి, తనతో పాటు పూజించబడుతుందని వరం ఇస్తాడు. ఆయనను తులసి ఆకు లేకుండా చేసే పూజ ఎప్పటికీ పూర్తవ్వదు. అందుకే హిందూ ఆచారాలలో తులసి విడదీయలేని భాగం అయిపోయింది. ఈ దురదృష్ట దేవత ఆఖరికి వరంగా మారి ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటూ అందరినీ మంచి ఆరోగ్యం ఇచ్చి దీవెనలందిస్తుంది.



Click it and Unblock the Notifications