Latest Updates
-
నోటికి కమ్మగా, కడుపులో చల్లగా.. కీరదోసకాయతో విలేజ్ స్టైల్ మజ్జిగ పులుసు.! -
సూర్యుడు, శని ఎదురెదురుగా.. ఈ 5 రాశులకు అక్టోబర్ 17 వరకు తీవ్ర నష్టం! -
ట్రైనర్ లేకుండా మొదటిసారి యోగాసనాలు వేస్తున్నారా.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
సర్వ రోగాలకు మూలం కడుపే..పేగుల్లో పేరుకుపోయిన చెత్తను బయటకు పంపే 10 ఫుడ్స్ -
మన పూర్వీకుల ఆరోగ్య రహస్యం గుమ్మడికాయ దప్పళం.. వారానికోసారి తింటే సర్వరోగాలు మాయం.! -
కేవలం 10 నిమిషాల్లో స్వర్గాన్ని చూపించే వెల్లుల్లి కారం ఆమ్లెట్..ఎలా చేసుకోవాలంటే.. -
బీహారీ స్పెషల్ చోఖా..పొలం గట్టు మీద కూర్చొని ఈ పచ్చడి కలిపి అన్నం తింటుంటే స్వర్గమే! -
నిమజ్జనం రోజు గణేశుడి చెవిలో ఈ 3 పదాలను చెప్పండి.. మీ తీరని కోరిక నెరవేరడం పక్కా.! -
రాత్రి మిగిలిన చపాతీలతో అదిరిపోయే బ్రేక్‌ఫాస్ట్.. పదే నిమిషాల్లో ఇలా చేసుకుంటే సూపర్ టేస్ట్.! -
సమసప్తక యోగం.. నెల రోజుల పాటు వీరిపై తీవ్రంగా శని ప్రభావం, ఈ పరిహారాలు తప్పనిసరి.!
నవరాత్రులు 2021 : ఈ పనులు చేస్తే దుర్గాదేవి ఆగ్రహిస్తుందంట...!
నవరాత్రుల్లో ఈ పనులు చేయకండి, దుర్గాదేవి ఆగ్రహిస్తుంది.!
ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా దసరా నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. నవరాత్రులు పూర్తయిన వెంటనే అంటే విజయదశమి రోజున దసరా పండుగను హిందువులు అత్యంత ఘనంగా జరుపుకుంటారు. అయితే ఈ తొమ్మిది రోజుల పాటు జరగనున్న ఉత్సవాల్లో భాగంగా కొందరు దుర్గామాత విగ్రహాలను కూడా పెట్టేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
అయితే మీకు తెలుసా..? ఈ తొమ్మిది రోజుల పాటు..అంటే నవరాత్రులు జరిగినన్ని రోజులు మనం కొన్ని సూచనలు పాటించాల్సి ఉంటుంది. అవేమిటో, వాటి వల్ల ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు కిందికి స్క్రోల్ చేయండి. పూర్తి వివరాలు తెలుసుకోండి.

1. హెయిర్ కట్
నవరాత్రుల్లో ఎవరూ హెయిర్ కట్ చేయించుకోకూడదట. అలాగే గుండు చేయించుకోవడం వంటి కార్యక్రమాలను కూడా పెట్టుకోకూడదట. ఎందుకంటే అలా చేస్తే దుర్గా దేవి ఆగ్రహిస్తుందట. దీంతో భక్తులకు కష్టాలు ఎదురవుతాయి.

2. కలశం
ఇంట్లో దుర్గాదేవికి పూజ చేసేటప్పుడు దేవి ఎదుట కలశం ఉంచాలి. అలాగే దేవి ఎదుట అఖండ జ్యోతి వెలిగించాలి. అది 9 రోజుల పాటు ఆరిపోకుండా చూడాలి. ఇక ఇంట్లో 9 రోజుల పాటు కచ్చితంగా ఎవరో ఒకరు ఉండాలి. అంతేకానీ ఎవరూ లేకుండా ఇంటికి తాళం పెట్టరాదు. అలా చేయడం వల్ల దేవి అనుగ్రహం లభిస్తుందట.

3. మాంసాహారం తినకూడదు
నవరాత్రుల్లో మాంసాహారం, మద్యం అస్సలు ముట్టుకోకూడదు, కొంత మంది నవరాత్రి సమయంలో ఉల్లి, వెల్లుల్లి, అల్లం వంటి మసాలా దినుసులను కూడా వాడరు.
నవరాత్రులు జరిగినన్ని రోజులు ఇంట్లో నిమ్మకాయను కోయరాదట. అలా చేస్తే అరిష్టం కలుగుతుందట. కానీ మరి నిమ్మరసం లేకపోతే ఎలా.. అంటే అందుకు పరిష్కారం ఉంది. మార్కెట్‌లో దొరికే నిమ్మరసం బాటిల్స్‌ను వాడవచ్చు.

4. నిద్ర
నవరాత్రుల పాటు రోజూ ఉపవాసం ఉండే వారు మధ్యాహ్నం పూట అస్సలు నిద్రపోరాదు. పోతే పూజలు చేసినా ఫలితం ఉండదు.

5. ఉపవాసం
నవరాత్రుల్లో రోజూ ఉపవాసం చేసే వారు కొద్ది మొత్తంలో పండ్లను ఆకలి అనిపించినప్పుడు తినవచ్చు.

6. ద్రవాలు ఎక్కువ తీసుకోవాలి
నవరాత్రి రోజుల్లో నీటిని బాగా తాగాలి. దీంతో పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది. ఉపవాసం ఉన్నా ఆకలి అనిపించదు. శరీరం హైడ్రేషన్ లో ఉంటుంది. ఆరోగ్యానికి ఎలాంటి హాని ఉండదు.

7. ఉపవాసం చేసేటప్పుడు ఆలుగడ్డలు
ఉపవాసం చేసేటప్పుడు ఆలుగడ్డలు తప్ప ఇతర ఏ కూరగాయలను తినరాదు. వాటిని కూడా ఉడకబెట్టుకుని అలాగే తినవచ్చు. కానీ కూరలా చేసి తినరాదు.

8. ఉపవాసం చేయని వారు పాలను
ఉపవాసం చేయని వారు పాలను కూరగాయలతో కలిపి వండి తింటే చాలా మేలు జరుగుతుంది.

9.నవరాత్రుల్లో ఉపవాసం చేయని వారి తిను బండారాలు
నవరాత్రుల్లో ఉపవాసం చేయని వారు రోటీ, పూరీ, పకోడీ తినాలి.

10. నవరాత్రుల్లో సామ అన్నం
సామలు అని పిలవబడే ఓ రకమైన తృణధాన్యం మనకు మార్కెట్‌లో దొరుకుతుంది. దాంతో అన్నం వండి తినాలి.

11. నట్స్
ఫాక్స్ నట్స్ అని పిలవబడే నట్స్‌ను రోస్ట్ చేయాలి. అందులో నెయ్యి వేసుకుని తినవచ్చు.

12. చక్కెర
ఉపవాసాల్లో పంచదార వాడటం వల్ల బరువు పెరగడం, నీరసంగా కనబడుతారు. నవరాత్రి వంటకాల్లో చక్కెరను వాడరాదు. బెల్లం లేదా తేనె వాడవచ్చు.
2021 సంవత్సరంలో అక్టోబర్ ఏడో తేదీ నుండి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. 15వ తేదీన ముగుస్తాయి.



Click it and Unblock the Notifications
