Latest Updates
-
చాలా ఏళ్ల తర్వాత ఒకే రాశిలో సూర్య కేతులు.. రాజయోగం పట్టనున్న రాశులివే.! -
చికెన్ లివర్ vs మటన్ లివర్..రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిది? -
పెళ్లిళ్లలో వడ్డించే పూరీ మసాలా.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా ఇలా ఈజీగా చేసుకోండి..వేళ్లు నాకుతూ తినేస్తారు! -
కలియుగం ముగిసేది ఎప్పుడు? మనిషి ఆయుష్షు కేవలం 20 ఏళ్లేనా? -
పెళ్లిళ్లలో వడ్డించే కరకరలాడే చిల్లీ గోబీ.. అచ్చం అదే రుచితో ఇంట్లోనే ఈజీగా చేసేయండిలా.. -
కొల్హాపురి స్టైల్ కోడిగుడ్డు పులుసు..అన్నం, జొన్న రొట్టెలోకి అదిరిపోతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో పాము కాటుకి గురైతే ఏం చేయాలి? ఏం చేయకూడదు? -
ఈ వీకెండ్ కి నాన్వెజ్ వద్దా? నాన్ వెజ్ ను మించే రుచితో కాజు మసాలా ఈజీగా చేసుకోండిలా.. -
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.!
తొలి ఏకాదశి రోజు విష్ణు పూజ ఇలా చేశారంటే.. మీ దశ తిరిగినట్లే, ఈ ఐదు తప్పులు మాత్రం అస్సలే చేయద్దు!
తొలి ఏకాదశి. ఈ పండుగకు చాలా ప్రాధాన్యత ఉంది. ఈరోజు స్వామి వారిని పూజిస్తే మీరు కోరుకున్న కోరికలు కచ్చితంగా నెరవేరుతాయి. ముఖ్యంగా ఈ ఏకాదశిని దేవశయని ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఆషాఢ మాసంలోని శుక్ల పంలోని 11వ రోజున తొలి ఏకాదశిని జరుపుకుంటారు. ఈరోజు విష్ణువును పూజించడం ఆనవాయితీగా వస్తోంది. హిందూ గ్రంథాల ప్రకారం విష్ణువు క్షీర సాగరంలో విశ్రాంతి తీసుకోవడానికి వెళ్లే నాలుగు నెలల కాలాన్ని చాతుర్మాసం అంటారు. ఈ సమయంలో ఎలాంటి శుభకార్యాలు చేయరు.

దృక్ పంచాంగం ప్రకారం దేవశయాని ఏకాదశి వ్రతాన్ని జూన్ 29వ తేదీ గురువారం రోజు ఆచరిస్తారు. దేవశయని ఏకాదశి రోజున మనం కొన్ని పనులు చేయకూడదని అంటారు. అయితే ఈ రోజు స్వామి వారిని ఎలా పూజించాలి, ఆ పూజా విధానం ఏంటనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
విష్ణుపూజలో తులసీ దళం వాడాల్సిందే:
దేవశయని ఏకాదశి రోజున భక్తులు ఉపవాసం పాటించాలి. విష్ణువుకు ప్రార్థనలు చేయాలి. ఇలా చేయడం వల్ల మీకు విష్ణుమూర్తి అనుగ్రహమే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. విష్ణుమూర్తికి ఇష్టమైన వాటిల్లో తులసీ ఆకులు ఒకటి. తులసీ దళం సమర్పించకుండా విష్ణుపూజ అసంపూర్ణం అని నమ్ముతారు. కాబట్టి శ్రీమహా విష్ణు దర్శనానికి వెళ్లినా, పూజ చేసిన కచ్చితంగా తులసీ ఆకులు వాడాల్సిందే.
సాత్విక ఆహారానికి దూరంగా ఉండాలి:
తొలి ఏకాదశి రోజు సాత్విక ఆహారం అస్సలే తీసుకోవద్దు. మాంసం, ఉల్లి, వెల్లుల్లి వంటి వాటిని ముట్టుకోకూడదు. ఎందుకంటే ఈ విషయాలు మనసులో ప్రతికూల ఆలోచనలకు దారి తీస్తాయి. అలాంచి ఆలోచనలతో మనం ఆరాధనపై దృష్టి పెట్ట లేకపోవచ్చు.
దానం చేయడం మంచిది:
తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉన్నా లేకున్నా, పూజ చేసినా చేయకపోయినా... దానం మాత్రం చేయాల్సిందే. బియ్యం, బట్టలు, డబ్బులు, నీళ్లు ఇలా ఏదైనా దానం చేయవచ్చు. ఎందుకంటే దేవశయని ఏకాదశి రోజున ఇలాంటి పనులు చేస్తే గొప్పు పుణ్యఫలం లభిస్తుందని నమ్ముతారు.
బ్రహ్మచర్యం పాటించాలి:
తొలి ఏకాదశి వ్రతం రోజున ఓ వ్యక్తి బ్రహ్మచర్యం పాటించాలి. భక్తులు తమ శరీరం, మనస్సుపై నియంత్రణ ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఈరోజును మీరు విష్ణు మంత్రాలను పటిస్తూ.. రోజంతా గడవడం వల్ల చాలా మంచి జరుగుతుంది.
ఉపవాసం ఉంటే మరింత మంచిది:
తొలి ఏకాదశి రోజున భక్తులు అన్న తినకూడదు. అంటే ఉపవాసం ఉండాలని అర్థం. పండ్లు, ఫలాలు, తాగితే ఏం కాదు. కాబట్టి ఆహారానికి మాత్రమే దూరంగా ఉండండి.
విష్ణు మంత్రాలు పఠించాలి:
దేవశయని ఏకాదశి రోజున విష్ణు మంత్రాలను పఠించడానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈరోజు మీరు పఠించే విష్ణు మంత్రం మీకు ఏకాదశి ఫలాలను అనుగ్రహిస్తుంది. తొలి ఏకాదశి నాడు మీరు.. ఓం నమో భగవతే వాసుదేవయే అనే మంత్రాన్ని పఠించాలి. ఇలా చేయడం వల్ల మంచి జరుగుతుంది.
పైన చెప్పినవన్నీ ఫాలో అవుతూ.. పూజ చేస్తే కచ్చితంగా మంచి ఫలితాలు పలభిస్తాయి. ఇంట్లోనే ఉండి విష్ణు ఆరాధన చేసుకొని పుణ్యంతో పాటు మోక్షం పొందండి.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications