Latest Updates
-
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
తొలి ఏకాదశి పర్వదినం.. విష్ణుమూర్తికి ప్రీతికరమైన తులసీ పూజ ఇలా చేస్తే కష్టాలు తొలగిపోతాయి.!
జులై 25న శనివారం తొలి ఏకాదశి పర్వదినం. ఆషాఢ మాసంలో వచ్చే మొదటి ఏకాదశి హిందూ సంప్రదాయంలో ఎంతో ప్రత్యేకం. ఆ రోజు శ్రీ విష్ణుమూర్తి క్షీర సాగరంలో యోగ నిద్రలోకి వెళ్లి నాలుగు నెలల తర్వాత మేల్కొంటారు. అందుకే తొలి ఏకాదశి నాడు విష్ణుమూర్తిని ఆరాధించి, స్వామి వారికి ఇష్టమైన నైవేద్యం సమర్పిస్తారు. లక్ష్మీదేవితో పాటు తులసీ దేవి పూజ కూడా ప్రత్యేకం. మరి ఆ రోజు పూజ ఎలా చేసుకోవాలి, ఏ నైవేద్యం పెట్టుకోవాలి, తులసి పూజ ఎలా చేసుకోవాలి.. నియమాలు చూద్దాం..

పేలాల లడ్డూ ప్రసాదం
తొలి ఏకాదశి నాడు శ్రీమహా విష్ణుమూర్తిని పూజించిన అనంతరం స్వామి వారికి ఇష్టమైన లడ్డూలను నైవేద్యంగా సమర్పిస్తారు. జొన్న, మొక్కజొన్న పేలాల పిండి లడ్డూలు, రవ్వ లడ్డూలు, బియ్యపు పిండి లడ్డూలను బెల్లంతో తయారుచేసి నివేదిస్తారు. వీటిని విష్ణుమూర్తికి ఇష్టమైనవిగా పరిగణిస్తారు.
తులసీ పూజ
తొలి ఏకాదశి రోజు లక్ష్మీదేవి స్వరూపమైన తులసీ పూజకు ప్రత్యేకత ఉంది. ఈ రోజు తులసీ దేవిని ఆరాధిస్తే విష్ణుమూర్తి, లక్ష్మీదేవి ఇద్దరి అనుగ్రహం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తుంటారు. తొలి ఏకాదశి రోజు ఉదయాన్నే తలంటు స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించిన ముందుగా శ్రీ మహా విష్ణువుని పూజించాలి. అనంతరం తులసి మొక్క చుట్టూ ప్రదేశాన్ని శుభ్రం చేసి నీటితో అభిషేకించిన అనంతరం నువ్వుల నూనె లేదా నెయ్యితో దీపం వెలిగించి పూలు, నైవేద్యం సమర్పించాలి.

పూజలో ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ వంటి విష్ణు మంత్రాలను జపిస్తూ పూజించాలి. అనంతరం శ్రీ మహా విష్ణువుకి తులసీ దళాలను సమర్పించాలి. ఇలా చేయడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు. నిస్వార్థం లేని కోరికలను మీ మనసులో స్వామి వారికి విన్నవించుకోవాలి. సాయంత్రం సమయంలోనూ ఇలా దీపం వెలిగించడం ద్వారా ఇంట్లో ప్రతికూల శక్తులు తొలగిపోయి సానుకూల శక్తి, ధైర్యం లభిస్తుంది. లక్ష్మీ కటాక్షం సిద్ధించి, కుటుంబంలో సుఖ శాంతులు, సంతోషం వర్ధిల్లుతాయని పండితులు సూచిస్తున్నారు.
ఉపవాస విరమణ
తొలి ఏకాదశి రోజు ఉపవాసం చేసే వారు మరుసటి రోజు ఉపవాస దీక్ష విరమించాలి. ఆ రోజు అవసరంలో ఉన్న వారికి దానం చేయడం పుణ్యఫలాలను ఇస్తుంది. గోధుమలు, బియ్యం, పప్పు ధాన్యాల వంటి ఆహార పదార్థాలను దానం చేయడం ద్వారా విష్ణుమూర్తి ఆశీస్సులు లభిస్తాయి. పండ్లు, వస్త్రాలను దానం చేయండి. అవసరంలో ఉన్న వారికి పసుపు రంగు వస్తువులు దానం చేయడం శుభప్రదంగా పండితులు చెబుతున్నారు. గోవులకు సేవ చేయడం, ఆధ్యాత్మిక భావనలో ఉండటం సుఖశాంతులను ఇస్తుంది.



Click it and Unblock the Notifications
