Latest Updates
-
చపాతీలో ఫేవరెట్ పనీర్ మెంతి కర్రీ.. రెస్టారెంట్ స్టైల్లో ఇలా అదరగొట్టేయండి.! -
ఒకసారి స్టెంట్ వేశాక మరోసారి గుండెపోటు వస్తుందా.. చేదు నిజాలివే.! -
నోరూరించే కాజు చికెన్ పకోడీ.. ఇలా చేస్తే ఎంత తిన్నా తృప్తి తీరదు! -
ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ కోసం భార్యాభర్తలు ఎలా కలవాలి.? -
తల్లిపాల వారోత్సవాలు.. బిడ్డే కాదు బాలింత కోసం కుటుంబీకులు గుర్తుంచుకోవాల్సిన విషయాలు! -
పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా.. ఈ వడను తిన్నారంటే మినప గారెలను మరిచిపోతారు.! -
బుధాదిత్య యోగం.. ఈ నాలుగు రాశుల వారికి అదృష్టం ఇంటి ముంగిటే.! -
గంటల తరబడి ఫ్రిజ్‌లో పెట్టాల్సిన పనిలేదు.. అప్పటికప్పుడు చేసుకునే ఇన్స్టంట్ ఫిష్ ఫ్రై.! -
రెస్టారెంట్ స్టైల్ తవా చికెన్..వేళ్లు నాకుతూ తినడం గ్యారెంటీ..ఈజీగా చేసుకోండిలా.. -
35 ఏళ్లకే కోరికలు తగ్గిపోయాయా.. దాంపత్య సుఖం కోసం తప్పనిసరిగా ఫాలో అవ్వాల్సిన టిప్స్.!
ఉగాది 2024 సంవత్సరం సందర్భంగా మీ ప్రియమైన వారికి, కుటుంబ సభ్యులకు,స్నేహితులకు శుభాకాంక్షలను ఇలా చెప్పుకోవచ్చు
ఉగాది 2024 శుభాకాంక్షలు: ఉగాది అంటే తెలుగు వారికి తెలుగు నూతన సంవత్సరం ప్రారంభోత్సవ పండగ. తెలుగువారింట్లో అదో పెద్ద పండగ. తెలుగు దనం ఉట్టిపడే పండగ. ఉగాది నుంచి తెలుగు సంవత్సరం ప్రారంభమవుతుంది. చైత్ర మాస శుద్ధ పాడ్యమి రోజున ఉగాదిని జరుపుకుంటాం. పురాణాల్లో ఉగాది గురించి విశిష్టంగా చెప్పబడి ఉంది. ఉగాది రోజే బ్రహ్మ సమస్త సృష్టినీ ప్రారంభించాడంటారు. విష్ణుమూర్తి మత్య్సావతారాన్ని ధరించి, వేదాలను హరించిన సోమకుడిని సంహరించింది కూడా అదే రోజని పురుణాలు చెబుతున్నాయ్.
ఈ ఉగాది పండగను ఇతర రాష్ట్రాల్లో వేరే పేర్లతో జరుపుకుంటారు. పంజాబ్‌లో వైశాఖీ, కేరళలో విషు, మహారాష్ట్రలో గుడి పడ్వా, పశ్చిమ బెంగాల్‌లో పాయ్‌లా బైశాఖ్ అనే పేర్లతో ఈ పండగను జరుపుకుంటారు. ఉగాది పచ్చడి లేనిదే పండుగను సంపూర్ణంగా జరుపుకోలేము. ఉగాది పచ్చడి అన్ని రకాలు షడ్రుచులు ఉన్నట్లే జీవితంలో కూడా కష్టసుఖాలు అన్నీ ఉంటాయని ఈ పండగ మనకు గుర్తు చేస్తుంది.

ఉగాది పండగ రోజున మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు శుభాకాంక్షలు తెలపండి. మీ కోసం ప్రత్యేకంగా కొన్ని ఉగాది శుభాకాంక్షల సందేశాలను ఈ ఆర్టికల్‌లో అందిస్తున్నాము. మీకు నచ్చిన దానిని ఎంపిక చేసుకొని మీ శ్రేయోభిలాషులకు ఉగాది పండగ శుభాకాంక్షలు తెలపండి.
Ugadi Wishes in Telugu : తెలుగులో ఉగాది శుభాకాంక్షలు
- తెలుగింటి వారికి ఈ నూతన సంవత్సరంబాగా కలిసి రావాలని కోరుకుంటూ అందరికీ ఉగాది శుభాకాంక్షలు.
- మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీ క్రోధి నామ సంవత్సరంశుభాకాంక్షలు.
- అమెరికా అయినా రష్యా అయినా, హాంకాంగ్ అయినా బ్యాంకాక్ అయినా ఉగాది పండుగని ఆనందంగా జరుపుకో, మన సంప్రదాయాన్ని ఆర్గికా నిలుపుకో. అందరికీ ఉగాది శుభాకాంక్షలు.
- ఈ ఉగాది మీకు శాంతి, సుఖసంతోషాలతో ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ మీకు ఉగాది శుభాకాంక్షలు.
- ఉగాది అంటే అన్నీకొత్తవే, కొత్త జీవితం, కొత్త ఆశలు, కొత్త ఆకాంక్షలు. ఈ తెలుగు నూతన సంవత్సరం శాంతి, సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ ఉగాది శుభాకాంక్షలు
- మీరు అనుకున్నవన్నీ జరగాలని, మీ లక్ష్యాలను మీరు సాధించాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ మీకు ఉగాది శుభాకాంక్షలు !.
- లేత మామిడి ఆకుల తోరణాలు, శ్రావ్యమైన సన్నాయి రాగాలు, అందమైన ముగ్గులతో వీధి వాకిళ్లు, కొత్తబట్టలతో పిల్లాపాపలు, ఇవీ.. ఉగాది పండుగ సంబరాలు. అందరికీ ఉగాది శుభాకాంక్షలు.
- జీవితం సకల అనుభూతుల మిశ్రమంస్థిత ప్రజ్ఞత అలవరచుకోవడం వివేకి లక్షణంఅదే ఉగాది తెలిపే సందేశంమీకు, మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు
- మీ పిల్లలు విద్యలో, మీరు ఉద్యోగంలో, మీ కుటుంబం అనుబంధంలో, జయకేతనం ఎగరవేయాలని కోరుతూ.. మీకు మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు



Click it and Unblock the Notifications