Latest Updates
-
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.! -
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.! -
ఎంతో ఇష్టంగా మటన్ తెచ్చుకుంటున్నారా.. ఈ పార్ట్స్ తిన్నారో ఇక అంతే సంగతులు.! -
అన్నం, రోటీల్లోకి బెస్ట్ ఎవర్ సైడ్ డిష్.. రాజస్థానీ ఫేమస్ పంచరత్న దాల్.! -
రోగులను పరామర్శించడానికి బ్రెడ్ మాత్రమే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.. చిన్న లాజిక్ ఇదే.! -
ఒక్క రూపాయి కట్నం వద్దు.. కానీ పెళ్లిలో ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే: వరుడి నయా కండిషన్స్ వైరల్.! -
బయట కొనే పనిలేకుండా.. ఇంట్లోనే ఈజీగా మరమరాలు చేసుకోండిలా! -
ఉలవలతో చారు, గుగ్గిళ్లేనా.. ఇలా హెల్తీగా దోశ ట్రై చేశారంటే ఈజీగా బరువు తగ్గేస్తారు.! -
భాద్రపద పౌర్ణమి: కర్కాటకంతో పాటు ఈ 4 రాశుల వారికి స్పెషల్.. ఇంత మంచి టైం మళ్లీ రాదు.! -
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే..
ముక్కోటి ఏకాదశి రోజున దేవాలయాల్లో ఉత్తర ద్వార దర్శనం ప్రత్యేకతలేంటో తెలుసా...
వైకుంఠ ఏకాదశి యొక్క ప్రాధాన్యత మరియు విశిష్టత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
హిందూ పంచాంగం ప్రకారం మార్గశిర మాసానికి ఎంతో విశిష్టత ఉంది. ఈ మాసమంటే శ్రీమహా విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైనది ఈ మాసం మధ్యలోనే ధనుర్మాసం ప్రారంభమవుతుంది.

ఈ నెలలో మరో విశేషం కూడా ఉంది. అదే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి. ఈ ఏకాదశి ఈ ఏడాది డిసెంబర్ 25వ తేదీన వచ్చింది. ఈ పవిత్రమైన రోజున ఉత్తర ద్వారంలో శ్రీమన్నారాయణుని దర్శించుకోవాలని భక్తులు ఎంతగానో ఆరాటపడతారు.

ఈ నేపథ్యంలో ముక్కోటి ఏకాదశికి ఎందుకంత ప్రాధాన్యత ఏర్పడింది.. అసలు దీని వెనుక ఉన్న పురాణాల కథలేంటి.. ఈరోజున వైష్ణవ ఆలయాల్లో స్వామి దర్శనం చేసుకుంటే ఎలాంటి ఫలితాలొస్తాయనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

వైకుంఠ ఏకాదశి..
హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం ఇరవై నాలుగు ఏకాదశుల్లో ప్రతి ఒక్కటీ పవిత్రమైనదే. కానీ వీటిలో వైకుంఠ ఏకాదశి మాత్రం ఉండదు. ఎందుకంటే అన్నీ ఏకాదశులు చంద్రమానం ప్రకారం లెక్కిస్తే.. దీనిని మాత్రం అన్నింటికంటే భిన్నంగా సౌరమానం ప్రకారం లెక్కిస్తారు. అందుకే సూర్యుడు ఉత్తరాయాణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి, స్వర్గద్వార ఏకాదశి అని అంటారు.

పురాణాల ప్రకారం..
ఈ ఏకాదశుల వెనుక వేర్వేరు కథలు పురాణాల్లో పేర్కొనబడ్డాయి. వీటి ప్రకారం.. శ్రీమహావిష్ణువుకు నెలవైన వైకుంఠంలోని ద్వారాలు ఆ పవిత్రమైన రోజునే తెరచుకుంటాయి. కాబట్టి దీన్ని వైకుంఠ ఏకాదశిగా భావిస్తారు. దక్షిణాయానం ప్రారంభంలో ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు పాల సముద్రంలో యోగనిద్రకు ఉపక్రమించిన నారాయణుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మేల్కొంటారు.

ఈ స్వామిని దర్శించుకోవడానికి..
ఇలా మేల్కొన్న స్వామివారిని దర్శించుకోవడానికి పుష్యమాస శుక్లపక్ష ఏకాదశి రోజున ముక్కోటి దేవతలు వైకుంఠానికి చేరుకుంటారు. అందుకే దీనిని ముక్కోటి ఏకాదశి అంటారు. దక్షిణాయణంలో చనిపోయిన పుణ్యాత్ములకు ఈరోజునే స్వర్గంలోకి ప్రవేశం కల్పిస్తారు కాబట్టి దీన్ని స్వర్గద్వార ఏకాదశి అని కూడా అంటారు.

రాక్షస సంహారం..
క్రుత యుగంలో ముర అనే ఒక రాక్షసుడు దేవతలను, రుషులను, ప్రజలను నిత్యం పట్టిపీడించేవాడు. తన ఆగడాలను, దోపిడీలను, హింసను తట్టుకోలేని వారు శ్రీవిష్ణుమూర్తికి తమ గోడు చెప్పుకున్నారు. దీంతో మురాసురుడిని సంహరించేందుకు స్వయంగా విష్ణుమూర్తే బయలుదేరతారు.

సాగర గర్భంలో..
ఈ విషయం తెలుసుకున్న మురాసురుడు సముద్ర గర్భంలోకి వెళ్లి దాక్కుంటాడు. దీంతో తనని బయటకు రప్పించేందుకు ఓ ఆలోచన చేసిన విష్ణుమూర్తి ఓ గుహలోకి వెళ్లి నిద్రపోతున్నట్లు నటిస్తాడు.

గుహలోకి ప్రవేశం..
ఇదే మంచి సమయం అని భావించిన మురాసురుడు గుహలోకి ప్రవేశించి నారాయణుడిని వధించాలని బయటకు వస్తాడు. అనుకున్నదే తడవుగా గుహలోకి ప్రవేశించి కత్తి దూసేందుకు ప్రయత్నించేలోపే ఓ శక్తి అకస్మాత్తుగా వచ్చి మురాసురుడిని సంహరిస్తుంది. ఇలా దేవతలను సంరక్షించిన శక్తికే ఏకాదశి అని నామకరణం చేశారు.

శివైక్యం..
వైష్ణవ ఆళ్వారులలో ప్రసిద్ధి చెందిన శ్రీనమ్మాళ్వారు కూడా ముక్కోటి ఏకాదశి నాడే శివైక్యం చెందాడని విశేషంగా చెప్పుకుంటారు. శ్రీ నమ్మాళ్వారులకు ఈరోజునే విష్ణులోకం ప్రాప్తించడంతో శ్రీవైష్ణవులు అత్యంత భక్తిశ్రద్ధలతో ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు.

ఉత్తర ద్వార ప్రవేశం..
ఈ సమయంలోనే ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రాలతో పాటు తిరుమల శ్రీవారి ఆలయంలోనూ ప్రాతఃకాలం నుంచే ప్రత్యేక ఉత్తర ద్వారం తెరచుకుంటుంది. దీనినే వైకుంఠ ద్వారమని అంటారు. సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశానికి ఉత్తర ద్వారం శుభ సంకేతంగా భావిస్తారు.

ముక్కోటి తీర్థాలు..
వైకుంఠ ద్వారాలు తెరచుకునే పర్వదినాన సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి గరుడ వాహనంపై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడని చాలా మంది నమ్మకం.

తిరుమలలో ఉత్సవాలు..
అందుకే కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే తిరుమలలో శ్రీవారి గర్భాలయాన్ని ఆనుకున్న ఉన్న వైకుంఠ ప్రదక్షిణ మార్గం ద్వారా భక్తులు నడిచే భాగ్యం లభిస్తుంది. ఏకాదశి నాడు తిరుమలలో జరిగే మలయప్ప స్వామి వారి ఊరేగింపు, ద్వాదశినాడు స్వామివారి పుష్కరిణిలో జరిగే చక్రస్నానాలను దర్శించిన భక్తులు పునీతులవుతారు. వైకుంఠ ద్వాదశి నాడు ముక్కోటి తీర్థాలు స్వామి పుష్కరిణిలోకి ప్రవహిస్తాయని భక్తులు నమ్ముతారు.



Click it and Unblock the Notifications
