Latest Updates
-
వర్షాకాలంలో పాము కాటుకి గురైతే ఏం చేయాలి? ఏం చేయకూడదు? -
ఈ వీకెండ్ కి నాన్వెజ్ వద్దా? నాన్ వెజ్ ను మించే రుచితో కాజు మసాలా ఈజీగా చేసుకోండిలా.. -
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.! -
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ!
మీ బంధుమిత్రులతో వరలక్ష్మీ వ్రతం విషెస్ , వాట్సాస్ మెసెజెస్ లను షేర్ చేసుకోండి...
వరలక్ష్మీ వ్రతం సందర్భంగా మీ బంధు మిత్రులకు వాట్సాప్, ఫేస్ బుక్ ద్వారా విషేస్ చెప్పండిలా.
హిందూ క్యాలెండర్ ప్రకారం శ్రావణ మాసంలో వచ్చే తొలి శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం పండుగను ఎంతో వైభవంగా జరుపుకుంటారు. ఆధ్యాత్మికంగా ఎంతో పవిత్రమైన ఈ మాసంలో ప్రతి రోజూ పండుగలాంటిదే.

ఈ మాసంలో ఎన్ని పవిత్రమైన రోజులున్నప్పటికీ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు అందులోనూ వరలక్ష్మీ వ్రతం యొక్క ప్రత్యేకతే వేరు. ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించే వారికి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కచ్చితంగా లభిస్తుందని చాలా మంది నమ్మకం.

వివాహిత మహిళలు ఈ వ్రతాన్ని చేస్తే.. తమ కుటుంబానికి ఆయురారోగ్యాలతో పాటు సకల సిరి సంపదలు లభిస్తాయని చాలా మంది భావిస్తారు. ముఖ్యంగా కొత్తగా ఎవరైతే పెళ్లి చేసుకుని ఉంటారో.. అలాంటి వారు ఇళ్లలో ఈ వ్రతాన్ని కచ్చితంగా చేయిస్తారు.

అష్టలక్ష్మీ రూపాలలో వరలక్ష్మీ లేకపోయినప్పటికీ, వరలక్ష్మీ మానవాళి కోరికలన్నింటినీ నెరవేరుస్తూ, ఎల్లవేళలా తమకు అండగా ఉంటుందని చాలా మంది నమ్ముతారు.

ఈ సందర్భంగా మీ కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు వరలక్ష్మీ వ్రతం యొక్క విషెస్ ను ఇలా తెలియజేయండి... వారి మన్ననలను పొందండి..
పవిత్రమైన శ్రావణ మాసంలో వరలక్ష్మీ వ్రతం జరుపుకుంటున్న మహిళలు, వారి కుటుంబ సభ్యులకు ఆ లక్ష్మీదేవి కరుణా, కటాక్షం ఎల్లప్పుడూ ఉండాలని ఆశిస్తూ..
వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు..

తెలుగు రాష్ట్రాల్లోని వివాహిత స్త్రీలందరికీ సౌభాగ్యాలను, ఐశ్వర్యాలను ఇచ్చే పండుగ వరలక్ష్మీ వ్రతం.
ఈ సందర్భంగా అందరికీ వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు..

కరోనా వంటి కష్ట కాలంలోనూ మీ అందరికీ అంతా మంచే జరగాలని, ఆ వరలక్ష్మీ దేవి ఆశీస్సులు మీకు తప్పక లభించాలని కోరుకుంటూ
శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు.
వరలక్ష్మీ దేవి మీకు, మీ కుటుంబ సభ్యులకూ, మీ బంధువులందరికీ
సకల సిరి సంపదలతో పాటు అష్ట ఐశ్వర్యాలను అందించాలని కోరుకుంటూ
వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు.

కరోనా మహమ్మారి కాలంలోనూ
మీ ఇంట్లో వరలక్ష్మీ వత్రం విజయవంతంగా
పూర్తి చేయాలని.. ఆ లక్ష్మీ దేవి ఆశీస్సులు, కరుణా, కటాక్షలు మీకు తప్పకుండా లభించాలని కోరుకుంటూ
అందరికీ వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు.



Click it and Unblock the Notifications