Latest Updates
-
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.! -
పరగడుపున తమలపాకు నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
సౌత్ ఇండియన్ స్టైల్ బాదం హల్వా..నాలుక మీద అమృతం పెట్టుకున్నట్లే ఉంటది! -
రెగ్యులర్ టిఫిన్స్‌తో బోర్ కొడుతుందా.. సిటీ కమ్యూనిటీ స్లైల్ దాల్ పక్వాన్ ట్రై చేయాల్సిందే.!
శ్రీశైలంలో శివలింగాన్ని చుట్టుకున్న పాము.. తొలిఏకాదశి ముందు రోజే అద్భుతం..!
శ్రీశైలంలో ఒక అద్భుతం జరిగింది. తొలి ఏకాదశి ముందే ఈ ఘటన చోటుచేసుోవడంతో భక్తులు తరించిపోతున్నారు. శ్రీశైలంలోని ఒక శివలింగాన్ని పాము చుట్టుకోవడంతో భక్తులు ఆ వీడియోను చూసి ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్‌గా మారుతోంది.
అయితే వర్షాకాలంలో నీళ్లు పుట్టలోకి కూడా వెళ్లడంతో పాములు బయటకు వస్తాయ్. ఎలుకలను వేటాడ్డానికి కూడా పాములు ఇంట్లోకి వస్తుంటాయ్. ఇక చెట్లమధ్యలో, అడవి ప్రాంతంలో ఇళ్లు వుండేవారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా వుండాల్సిన పరిస్థితి ఎదురౌతుంది. పాములకు సంబంధించిన ఎన్నో వీడియోలను ఈ వర్షాకాలంలో మనం చూస్తూ వుంటాం. స్నేక్ సొసైటీ వారి సహాయం తీసుకొని ఆ పాములను పట్టుకునే ప్రయత్నం చేస్తాం.
పాము గనుక కాటు వేస్తే ఏ మాత్రం ఆలోచించకుండా అప్పటికప్పుడు ఫస్ట్ ఏయిడ్ చేయాలి. రక్త ప్రసరణ జరగకుండా కాటువేసిన భాగానికి కొంచెం పైన గట్టగా బట్టతో చుట్టాలి. దీని వల్ల రక్తప్రసరణ జరగకుండా వుండి విషం శరీరానికి ఎక్కకుండా వుంటుంది.
పామును జంతువుగా కంటే కూడా దేవతగా చూసేవారే మన భారతీయుల్లో ఎక్కువ. అదే సాంప్రదాయం కూడా. అందుకే పాములు కనపడగానే వాటిని కొట్టి, చంపేవారు చాలా అరుదుగా వుంటారు. చాలా మంది పాముల్ని భక్తితో కొలుస్తారు. చాలా సార్లు పాములు గుళ్లోకి ప్రవేశిస్తుంటాయ్.

శ్రీశైలంలో తొలి ఏకాదశికి ముందు ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. శ్రీశైలంలోని శ్రీ శైలమల్లేశ్వరుడి దేవాలయం వద్ద ప్రాంగణంలో ఇక శివలింగం వుంది. ఇది చాలా పురాతనమైన శివలింగంగా అర్చకులు చెబుతున్నారు. శివుడి మెడకు ఎలాగైతే పాము చుట్టుకొని వుంటుందో అలాగే అలాగే పాము అక్కడి శివలింగానికి చుట్టుకొని వుంది. ఈ దృష్యాన్ని స్థానికి అక్కడ స్వయంగా చూసి పారవశ్యంలో మునిపోతున్నారు.
వెంటనే ఈ విషయం చుట్టుపక్కలతో పాటు రెండు తెలుగురాష్ట్రాల్లో వ్యాపించింది. శివలిగాన్ని చుట్టుకున్న పాము దృష్యాన్ని అక్కడి భక్తులు తమ సెల్‌ఫోనుల్లో బంధించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అయితే ఈ ఘటన ఆషాడమాసం ఏకాదశికి ఒక రోజు ముందు జరగడంతో ప్రస్తుతం ఇది మరింత హాట్ టాపిక్ అయింది. నెటిజెన్లు ఈ దృష్యాన్ని చూసి ఇదంతా పరమేశ్వరుడు మహిమ అని అంటున్నారు. తొలి ఏకాదశి రావడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని దేవాలయాలన్నీ ముస్తాబయ్యాయ్.



Click it and Unblock the Notifications
