Latest Updates
-
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి?
Vivah panchami: భార్యాభర్తల మధ్య తరచూ గొడవలా? ఈ రోజు ఇలా చేస్తే జీవితమంతా ఆనందమం
హిందూమతంలో వివాహ పంచమికి పండుగకు విశేష ప్రాముఖ్యత ఉంది. దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో ఉండాలని దంపతులిద్దరూ కలిసి చేసుకునే పండుగే వివాహ పంచమి. ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలోని శుక్ల పక్షం ఐదవ రోజున వివాహ పంచమి జరుపుకుంటారు. ఈ ఏడాది మార్గశిర శుద్ధ పంచమి డిసెంబర్ 5 మధ్యాహ్నం 12:50 గంటల నుంచి డిసెంబర్ 6 మధ్యాహ్నం 12:08 గంటల వరకు ఉంది. సాధారణంగా పండుగలు సూర్యోదయం తిధి ఆధారంగా జరుపుకుంటారు. అందుకే డిసెంబర్ 6న అంటే ఈ రోజు వివాహ పంచమి జరుపుకుంటారు. వివాహ పంచమి సందర్భంగా దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది.
ఈ రోజు రాముడు, సీతా దేవికి అంకితం చేయబడింది. ఎందుకంటే ఈ రోజునే శ్రీరాముడు శివధనస్సు విరిచి సీతా దేవిని పెళ్లి చేసుకుంది. ఈ రోజు శివ్వాస్ యోగం(shiv vas)తో పాటు ధృవ యోగం కూడా ఏర్పడుతోంది. కాబట్టి ఈ రోజు రాముడు,సీతమ్మవారిని పూజించడం వల్ల వైవాహిక జీవితంలో అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయని..కోరికలన్నీ నెరవేరుతాయని.. ఇంట్లో ఆనందం,శ్రేయస్సు పెరుగుతుందని పండితులు చెబుతున్నారు. వివాహ పంచమి రోజున తీసుకునే ప్రత్యేక చర్యలు వైవాహిక జీవితంలో సంతోషాన్ని కలిగిస్తాయని.. అలాగే సంతానం పొందే ఆనందాన్ని పొందుతారని చెబుతున్నారు.

ఈ పని చేయండి
ఈ రోజున చేసే పూజలు భార్యభర్తల మధ్య ప్రేమ, సానుకూలత, సామరస్యాన్ని పెంచుతాయని భక్తులు విశ్వసిస్తారు. ఈ రోజు కొన్ని చోట్ల రామాలయాలలో సీతారాముల కల్యాణం వైభవంగా జరిపిస్తారు. ఈ సందర్భంగా దంపతులు ఆలయంలో రాముల వారి కల్యాణ వేడుకలు కనులారా వీక్షించి తలంబ్రాలు అక్షింతలుగా శిరస్సున ధరించాలి. వివాహ పంచమి రోజున అరటి చెట్టును పూజించాలి. ఇలా చేయడం వల్ల వివాహ సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. అంతే కాకుండా వైవాహిక జీవితంలో మధురానుభూతి మిగులుతుంది.
వివాహ పంచమి రోజున భార్యాభర్తలు ఇద్దరూ కలిసి దానధర్మాలు చేసిన సుఖసంతోషాలు లభిస్తాయి. వైవాహిక జీవితంలో సమస్యలు ఎదుర్కొంటున్న వారు ఈ రోజున దానం చేయడం వల్ల గొడవలన్నీ తొలగిపోయి వారి మధ్య ప్రేమ మరింత పెరిగి బంధం బలపడుతుంది. కుంకుమ,గాజులు మొదలైనవి వివాహ పంచమి పర్వదినాన దానం చేయడం వల్ల వివాహిత మహిళలు సంతోషకరమైన,సంతృప్తికరమైన వైవాహిక జీవితాన్ని పొందుతారు. అయితే మనసులో ఎటువంటి స్వార్థం లేకుండా నిస్వార్థ హృదయంతో లేని వారికి సహాయం చేయాలి. ఆర్భాటాలు,ప్రదర్శనల కోసం దానం చేయకూడదు.
వివాహ పంచమి రోజున అరటి చెట్టును పూజించాలి. ఇలా చేయడం వల్ల వివాహ సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. అంతే కాకుండా వైవాహిక జీవితంలో మధురానుభూతి మిగులుతుంది. అరటి చెట్టుకు పసుపు తాడు కట్టాలి. అరటి చెట్టుకు పసుపు, చందనం, పుష్పాలు సమర్పించిన తర్వాత ధూపం వేసి దీపం వెలిగించాలి. తమలపాకులు, అరటి పండ్లు, పువ్వులతో పూజ చేసి కొబ్బరి కాయను అరటి చెట్టుకు నైవేద్యంగా సమర్పించాలి. తర్వాత అరటి చెట్టుకు 21 ప్రదక్షిణలు చేయాలి.



Click it and Unblock the Notifications
