Latest Updates
-
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు! -
ఐఫోన్ 18పై మోజు.. భార్యను సర్ప్రైజ్ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.!
అరుణాచలం గిరి ప్రదక్షిణం చేస్తే ఎటువంటి లాభాలు కలుగుతాయో మీకు తెలుసా..?
అరుణాచల గిరి ప్రదక్షణకు చాలా ప్రాముఖ్యత వున్నాది. అరుణాచలం వెళ్లిన వారు తప్పకుండా గిరిప్రదక్షిన చేస్తారు. అరుణాచలేశ్వరుడికి కూడా గిరిప్రదక్షిణ అంటే చాలా ఇష్టమని శాస్త్రం చెబుతోంది. అందుకే పరమశివుడు కూడా పార్వతీ దేవితో కలిసి సంవత్సరానికి రెండు సార్లు గిరి ప్రదక్షిణ చేస్తాడని పండితులు చెబుతన్నారు. గిరి ప్రదక్షిణ చేసే వారిని చూసి ఆ దేవదేవుడు చాలా సంతోషిస్తాడు. వారి కోరకలను నెరవేరుస్తాడు. గిరి ప్రదక్షిణ అంటే కొండ చుట్టూ తిరగడం. ఈ కొండ చుట్టూ దూరం సుమారుగా 14 కిలోమీటర్లు వుంటుంది.

గిరి ప్రదక్షిణ గరించి ఒక సారి గౌరీదేవి గౌతమ మహర్శిని ఇలా అడుగుతుంది. ఈ అరుణాచలంలో గిరి ప్రదక్షిణ ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి అని అడిగింది. దీనికి గౌతమ మహర్షి సంతోషించి శివుడి కోసం ధ్యానించాడు. శివుడు ప్రత్యక్షమై గౌతమ మహర్శితో ఇలా అంటాడు. భూలోకంలో నేను అరుఛాలేశ్వర రూపంలో వున్నాను. అందుకే దేవతలు, మునులు అక్కడకు వచ్చి నాకు ప్రదక్షిణ చేస్తారు.
నా చుట్టూ చేసే ప్రదక్షిణకు ప్రతీ అడుగుకు వారి జన్మజన్మల పాపాలు నశిస్తాయ్. పుణ్య తీర్ధాల నుంచి వచ్చే ఎంతో పుణ్యము ఈ గిరిప్రదక్షిణతో వస్తుంది. కొంచెం కూడా పుణ్యం చేయని పాపాత్ముడు నా చుట్టూ తిరగడం వల్ల చాలా శక్తులను పొందగలుగుతాడు.
ఒక అడుగుతో భూలోకప్రాప్తి, రెండవ అడుగుతో మధ్యలోక ప్రాప్తి, మూడవ అడుగుతో దేవలోక ప్రాప్తి కలుగుతుంది. మొదటి అడుగులో మానసిక పాపాలు తొలగిపోతాయ్. రెండవ అడుగులో వాచిక పాపములు తొలగిపోతాయ్, మూడవ అడుగులో శారీరక పాపాలు నశిస్తాయ్. ఈ అరుణాచలం చుట్టూ మునులూ, సిద్ధ పురుషుల ఆశ్రమాలు వేలసంఖ్యలో వున్నాయ్. నేను సిద్ధ స్వరూపముతో ఈ అరుణాచలంలో వుంటూ వారిని చూస్తున్నాను. ఈ అరుణాచలం తేజో స్థంభం. ఈ తేజో లింగాన్ని మనసున ధ్యానిస్తూ నెమ్మదిగా ప్రదక్షిణ చేయాలి. ఈ విధంగా ప్రదక్షిణ చేస్తే వారి జన్మ జన్మల పాపాలు నశిస్తాయ్.

నిండుచూలాలు ఎలాగైతే నడుస్తుందో గిరిప్రదక్షిణ అలా చేయాలి. గిరిప్రదక్షిణకు ముందు స్నానం చేయాలి, శుభ్రమైన వస్త్రాలని ధరించాలి, నుదుటన విభూది పెట్టుకోవాలి, రుద్రాక్ష మాలలు వేసుకోవాలి, అరుణాచల శివ అంటూ గిరిప్రదక్షిణ చేయాలి. ఇలా ప్రదక్షిణ చేసిన వారికి కనిపించని సిద్ధ పురుషులు వస్తుంటారు. మనసులో మరేమీ తలచకుండా కేవలం అరుణాచలుడిని మాత్రమే తలచుకొని ప్రదక్షిణ చేయాలి.
దారి మధ్యలో దానధర్మాలు చేయడం చాలా మంచిది. గిరిప్రదక్షిణ చేసిన వాళ్లు దైవశక్తిని పొందుతారు. శరీరం బలంగా మారుతుంది. దేవతలు కూడా ఈ గిరిప్రదక్షిణ చేస్తారు. సోమవారం ప్రదక్షిణ చేస్తే జననమరణ బాధల నుంచి తప్పించుకోవచ్చు. మంగళవారం ప్రదక్షిణ చేస్తే అప్పుల బాధలు తొలగిపోతాయ్. బుధవారం ప్రదక్షిణ చేస్తే మహాపండితుడు అవుతాడు. గురువారం ప్రదక్షిణ చేస్తే కారణజన్ముడు అవుతాడు. శుక్రవారం ప్రదక్షిణ చేస్తే సకల సంపదలు లభిస్తాయ్. శనివారం ప్రదక్షిణ చేస్తే ప్రాపంచిక విజయాలు లభిస్తాయ్.శారీరక బాధలు వున్న వారు ప్రదక్షిన చేస్తే వారి బాధలన్నీ తొలగిపోతాయ్.
పై విధంగా ఆ పరమేశ్వరుడు గురిప్రదక్షిణ చేయడం ద్వారా కలిగే ఫలితాన్ని గౌతమ మహర్శికి వివరించాడు. అరుణాచలం వెళ్లినప్పుడు సమయం బాగా కేటాయించుకొని 14 కిలోమీటర్లైన గిరిప్రదక్షిణను తప్పకుండా పూర్తిచేయండి. తొందర పడకుండా నెమ్మదిగా శివనామస్మరణ చేసుకుంటూ గిరిప్రదక్షిణను పూర్తి చేయండి.
గమనిక : పైన ఇచ్చిన వివరాలన్నీ ప్రముఖ జ్యోతిష్యుల నుంచి సేకరించింది. వీటిని మేము ఎట్టి పరిస్థితిలో దృవీకరించము.



Click it and Unblock the Notifications
