Latest Updates
-
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.!
హిందు సంప్రదాయంలో పంచ మహా పాతకాలు అంటే ఏమిటి?
బుద్ది పూర్వకంగా చేసిన పుణ్యపాపముల ఫలితాన్ని అనుభవించి తీరాలిజ అలా కాకుండా తెలియక ప్రమాద వశాత్తు చేసిన పాపములకు ప్రాయశ్చిత్తంగా విముక్తి సాధానాలున్నాయి. శాస్త్రపకారంగా, భక్తిపూర్వకంగా ప్రాయశ్చిత్తం చ
పంచమహా పాతకాలు అంటే బ్రహ్మపురాణంలో వ్యాసుడిలా చెప్పాడు. పాతకాలలో ఐదింటిని ''మహాపాతకాలు'' అని అంటారు . ఈ పంచ మహా పాతకములకు నిష్క్రుతి లేదు. వాటి ఫలితాలను అనుభవించే తీరాలి. ఆ మహాపాతకాలు ఏవంటే..?

స్త్రీ హత్య
శిశు హత్య
గో హత్య
బ్రహ్మ హత్య
స్వర్ణస్తేయము

ఇక బుద్ది పూర్వకంగా చేసిన పుణ్యపాపముల ఫలితాన్ని అనుభవించి తీరాలిజ అలా కాకుండా తెలియక ప్రమాద వశాత్తు చేసిన పాపములకు ప్రాయశ్చిత్తంగా విముక్తి సాధానాలున్నాయి. శాస్త్రపకారంగా, భక్తిపూర్వకంగా ప్రాయశ్చిత్తం చేసుకుంటే ఆ పాపాలు క్రమంగా హిరిస్తాయి. అందుకు ఉదాహరణగా కోసల దేశపు రాజు గోహాత్యాపాతంలో ఇరుకొన్న వైనం చెప్పాడు వ్యాసుడు.
ఒకప్పుడు కోసలదేశంలో క్షామం సంభవించిన్పుడు, రాజు బీమసేనుడు నగరం వెలుపల ఒక బావి త్రవ్వించాడు. కానీ ఆ నూతి చుట్టూ గోడ కట్టించలేదు .

దాహం గొని ఉన్న ఒక ఆవు దూడ ఆ నూతిలో పడి మరణించింది. బావి చుట్టూ తిరుగుతూ ఆవు అరుస్తున్నది. ప్రోగైన జనులు దూడ కళేబరాన్ని బయటకు తీశారు.
ఈ పాపం ఎవరిదనే చర్చసాగింది. అజాగ్రత్తగా ఉన్న పసుశులకాపరిధి తప్పన్నారు కొందరు. దూడ యజమాని తప్పు అని కొందరన్నారు. బావికి గోడ కట్టించని వారిది తప్పని మరికొందరన్నారు .

ఈ సంగతి తెలిసిన రాజు పండితులను సంప్రదించాడు. వారు రాజుకు చెప్పిన విషయం ఏమంటే-రాజా బావి త్రవ్వించి అనేకుల ప్రాణాలను రక్షించిన పుణ్యం నీకు దక్కుతుంది.
అలాగే గోడ కట్టించాలని తెలియక ఒక ఆవుదూడ మరణానికి కారణమైన పాపం కూడా నీకు చెందుతుందిజ . కానీ ఇది తెలియక చేసిన తప్పు కనుక ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చును.

పది రోజులు దీక్షతో ఉండి, పుణ్య క్షేత్రాలు దర్శంచి, ఉత్తమ దానములు చేయమని చెప్పారు . రాజు అలాగే చేశాడు.



Click it and Unblock the Notifications