Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
తులసి చెట్టు ఎండిపోతే ఏమవుతుందో తెలుసా..?
మన ఇళ్లల్లో కొన్ని అరిష్టాలు అప్పుడప్పుడూ జరుగుతుంటాయ్. వీటి అర్థాలు మనకు తెలియదు. కానీ శాస్త్రం వీటికి అర్థాలను చెప్పింది. ఎన్నో యేళ్ల క్రితమే పండితులు అలాంటి అరిష్టాలు జరిగితే ఏమవుతుంది, పరిహారం ఏంటి లాంటి విషయాలను చెప్పారు. వెలిగించిన దీపం ఉన్నట్టుండి గాలి రాకున్నా ఆరిపోతుంది, దేవుడి ముందు కొట్టిన కొబ్బరి కాయ కుళ్లిపోతుంది, ఇవన్నీ అరిష్టాల కిందకే వస్తాయ్. వీటి గురించి ప్రముఖ జ్యోతిష్యులు ఏమంటున్నారు, ఆ అరిష్టాలకు ఏం అర్థం చెబుతున్నారో తెలుసుకుందాం.
చాలా మంది ఇంటి ముందు తులసి చెట్టు వుంటుంది. అది ఒక్కోసారి ఎండిపోతుంది. ఇలా ఎండిపోయినప్పుడు తులసి చెట్టు ఎండిపోయింది అని అనకుండా తులసి చెట్టు నిద్రపోయింది అని అనాలి. ఇలా ఎండిపోవడం కూడా అరిష్టమే. ఇలా తులసి చెట్టు ఎండిపోతే ఆ తులసి మొక్కను తీసి ఎక్కడైనా చిన్న గోతి తవ్వి అందులో పాతివేయాలి. ఇంటి ఆవరణలో ఒక్క తులసి చెట్టు కాకుండా రెండు తులసి చెట్లను పెంచుకోవాలని పండితులు సూచిస్తున్నారు. ఒకటి లక్ష్మీ తులసి, మరొకటి విష్ణూ తులసి. లక్ష్మీ తులసీలో ఆకులు పచ్చగా వుంటాయ్, విష్ణూ తులసిలో ఆకులు నీలి రంగులో వుంటాయ్. ఈ రెండు తులసీలు పెట్టుకోవడం చాలా శుభప్రదం.

తులసి చెట్టును ఎప్పుడూ పవిత్రంగా పూజించాలి. ఎందుకంటే తులసి చెట్టులో ముక్కోటి దేవతలు వుంటారు. తులసి చెట్టు కింది భాగంలో గంగా, యమునా, కావేరి, నర్మదా, నదీ దేవతలు వుంటారు. తులసి చెట్టు మధ్యలో సకల దేవతలు వుంటారు. స్త్రీలు ఒక్క తులసి చెట్టును పూజిస్తే ముక్కోటి దేవతలను పూజించినట్టి ఫలితం లభిస్తుంది. తులసి చెట్టు కింద వున్న మట్టిని నీళ్లల్లో వేసుకొని స్నానం చేస్తే అన్ని నదుల్లో స్నానం చేసిన పుణ్యం లభిస్తుందని దేవీ భాగవతంలో చెప్పారు.
స్త్రీలు రజస్వలా దోషం వున్నప్పుడు 5 రోజులు తులసి చెట్టుకు నీళ్లు పోయవకూడదు, తులసి ఆకులను తెంపకూడదు. తులసి ఆకులకు ఎప్పుడు పడితే అప్పుడు కోయవద్దు. ఆకులు ఎప్పుడైనా బాగా పండిపోయినప్పుడు మాత్రమే తులసి ఆకులను కోసి దేవుడికి సమర్పించాలి.

ఆదివారం, మంగళవారం, శుక్రవారం, ఈ మూడు రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో తులసి ఆకులను కోయరాదు. పూర్ణిమ, అమావాస్య, ఏకాదశి రోజున కూడా తులసి ఆకులను కోయవద్దని శాస్త్రం చెబుతోంది. సాయంత్రం 6 గంటల తరువాత కూడా తులసి ఆకులను కోయవద్దు.
కొబ్బరికాయ కుళ్లిపోతే
దేవుడి ముందు కొట్టిన కొబ్బరికాయ కుళ్లిపోతే భయపడాల్సిన అవసరం లేదని పండితులు చెబుతున్నారు. కొబ్బరికాయ దేవుడుకి కొట్టడానికి ప్రత్యేకమైన కారణం వుంది. ఏ చెట్టుకూ లేనటువంటి ప్రత్యేకత కొబ్బరి చెట్టుకు వుంటుంది. కొబ్బరి నీళ్లను దేవగంగా అంటారు. ఇది దేవతలకు చాలా ఇష్టమైనదని పండితులు అంటున్నారు. కొబ్బరి నీళ్లతో దేవతలకు అభిషేకం చేసినా, కొబ్బరి నీళ్లను సమర్పించినా దేవుళ్లు తొందరగా తృప్తిపొందుతారని శాస్త్రం చెబుతోంది. కొబ్బరి కాయ కొట్టిన తరువాత కొబ్బరికి పసుపు కుంకుమ పూయవద్దు.
గమనిక : పైన చెప్పిన విషయాలన్నీ ప్రముఖ జ్యోతిష్యులు, పండితుల నుంచి సేకరించినవి మాత్రమే వీటిని మేము పూర్తిగా దృవీకరించమని తెలియజేస్తున్నాం.



Click it and Unblock the Notifications
