Latest Updates
-
దగ్గు తగ్గట్లేదా? మీ ఊపిరితిత్తుల్లో బూజు ఉండొచ్చు? ఆస్తమా పేషెంట్లకు డాక్టర్ బిగ్ అలర్ట్ -
ఎండలు మండిపోతున్నాయి.. పెళ్లిళ్లపై ఎఫెక్ట్! వేడుకలను మార్చుకోకపోతే కష్టమేనా? -
ఇంట్లో కొబ్బరి లేదా? అయితే ఇడ్లీ, దోసెల్లోకి ఈ కొబ్బరి లేని కొబ్బరి చట్నీ చేసేయండి! -
వడగాల్పుల ఎండలు భయపెడుతున్నాయా? ఈ చిన్న చిట్కాలతో ప్రాణాలు కాపాడుకోండి -
చీఫ్ గెస్ట్ గా పిలవలేదని.. క్రికెట్ పిచ్ ను ట్రాక్టర్‌తో దున్నేసిన పొలిటికల్ లీడర్..వీడియో చూడండి -
JEE మెయిన్ రిజల్ట్ టెన్షన్ ఉందా? చాణక్యుడి ఈ సూత్రాలు పాటిస్తే విజయం మీదే -
జంక్ ఫుడ్ వద్దు.. కుర్ కురేకి బదులు ఇంట్లోనే క్రిస్పీ బెండకాయ పకోడీ చేసుకోండిలా! -
పదే పదే నీళ్లు తాగుతున్నారా? సద్గురు చెబుతున్న ఈ షాకింగ్ నిజాలు తెలుసుకోండి! -
బరువు తగ్గాలా? జిమ్ తర్వాత ప్రొటీన్ కావాలా? అయితే ఈ నల్ల శెనగల సలాడ్ మీ కోసమే! -
ఎండల తీవ్రతతో సతమతమవుతున్నారా? ఈ చిట్కాలతో శరీరాన్ని చల్లబరుచుకోండి!
అధిక శ్రావణం అంటే ఏంటి? అధికమాసం ఎందుకొస్తుంది?
తెలుగు పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం అధిక శ్రావణం వస్తోంది. మాములుగా అయితే శ్రావణం నెల రోజుల పాటు ఉంటుంది. అధిక మాసం వచ్చినప్పుడు శ్రావణం రెండు నెలల పాటు ఉంటుంది. తెలుగు పంచాంగం ప్రకారం జులై 17తో ఆషాఢమాసం పూర్తవుతుంది. జులై 18, 2023 నుంచి అధిక శ్రావణ మాసం మొదలవుతుంది. ఈ అధిక మాసం ఆగస్టు 16వ తేదీ వరకు ఉంటుంది. ఆగస్టు 17 నుంచి నిజ శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. ఇది సెప్టెంబర్ 15వ తేదీ వరకు ఉంటుంది.

అధికమాసం ఎందుకు వస్తుంది?
తెలుగు సంవత్సరాలు, తెలుగు నెలలు, రుతువులు, పంచాంగ గణన ప్రకారం సౌరమాన సంవత్సరానికీ, చాంద్రమాన సంవత్సరానికీ పదకొండుంపావు రోజులు వ్యత్యాసం ఉంటుంది. చాంద్రమాన సంవత్సరం, సౌరమాన సంవత్సరం కన్నా చిన్నది. చాంద్రమాన మాసం సౌరమాన మాసం కన్నా చిన్నది. ఇలా ఒక్కొక్కప్పుడు ఒక చాంద్రమాన మాసంలో సౌరమాసం ఆరంభం అవదు. చాంద్రమానంలో సూర్య సంక్రాంతి లేని మాసాన్ని అధికమాసం అంటారు. చాంద్రమాన సంవత్సరానికి, సౌరమాన సంవత్సరానికీ ఉన్న తేడాను సరిచేసేందుకు చాంద్రమాన సంవత్సరంలో ఒక నెలను అధికంగా జోడించడాన్ని అధిక మాసం అని పిలుస్తారు.
సూర్య సంక్రాంతి అంటే ఏంటి?
సూర్యుడు ప్రతి నెలా ఓ రాశిలో సంచరిస్తాడు. సూర్యుడు రాశి మారిన ప్రతి సారి సంక్రమణం అని పిలుస్తారు. మేష సంక్రాంతి, వృషభ సంక్రాంతి, కర్కాటక సంక్రాంతి, మకర సంక్రాంతి అని ఏడాదికి 12 సంక్రాంతులు వస్తాయి. ఇందులో కర్కాటక సంక్రమణం, మకర సంక్రమణం.. చాలా ముఖ్యమైనవి. ఇలా 12 12 నెలల్లో 12 రాశులు మారతాడు సూర్యుడు. అయితే ఒక్కోసారి ఓ నెలలో ఏ రాశిలోని ప్రవేశించకుండా ఉండిపోతాడు. అలా సూర్యుడు ఏ ఇతర రాశిలోకి ప్రవేశించకుండా ఉండిపోవడాన్నే అధిక మాసంగా పిలుస్తారు. ఈ మాసంలో శుభకార్యాలు, ముఖ్యమైన దైవకార్యాలు చేయడం నిషిద్ధం. ఈ అధిక మాసంలో ఏ శుభకార్యాలు జరగవు. ఇలా సూర్యుడు 12 రాశుల్లో సంచరించడంతో సౌరమాసం పూర్తవుతుంది. అంటే సంవత్సరం గడుస్తుంది. అలా సూర్యుడి సంక్రమణం జరగని నెలను అధికమాసంగా, శూన్యమాసంగా పిలుస్తారు.
చంద్రమాసం వల్లే అధికమాసం:
అధిక మాసం చాంద్రమానం వల్లే వస్తుంది. చాంద్రమానం అంటే చంద్రకళలను (తిథుల) ఆధారంగా నెల రోజులను లెక్కిస్తారు. సూర్యుడు ఏడాదిలో 12 రాశుల్లో సంక్రమించి ఏడాది పూర్తి చేస్తాడు. చంద్రుడు మాత్రం ఒక నక్షత్రం చొప్పున నెలకు 27 నక్షత్రాల దగ్గరే ఉంటాడు. అంటే మొత్తం 324 రోజులు. సూర్యుడి చుట్టు భూమి తిరగడానికి 365 రోజుల 6 గంటల 11 నిమిషాల 31 సెకండ్లు పడుతుంది. చంద్రునికైతే 324 రోజులే పడుతుంది. అంటే దాదాపు 41 రోజుల తేడా ఉంటుంది. అలా ప్రతి 32.5 సౌరమాసాలకు ఒక చంద్రమాసం అధికంగా వస్తుంది.
అలాగే అధికమాసం కేవలం వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం మాసాలకు మాత్రమే వస్తుంది. మిగతా మాసాలకు ఎప్పుడూ అధికమాసం రాదు. ముందు అధిక మాసం వచ్చి తర్వాత నిజ మాసం వస్తుంది. అధిక మాసాన్నే శూన్య మాసమని, మైల మాసమని అంటారు. ఈ సమయంలో ఎలాంటి శుభకార్యాలు చేయరు.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications











