Latest Updates
-
నడుము నొప్పితో విసిగిపోయారా? మీ వెన్నెముకను ఉక్కులా మార్చేసే చిట్కా ఇదే! -
కార్తీక మాసం స్పెషల్ ఉసిరికాయ పులిహోర..చాలా కమ్మని రుచిగా చేసుకోండిలా.. -
ఎముకలు బలంగా అవ్వడానికి,బాడీలో రక్తం పట్టాలంటే ఈ స్వీట్ తినండి..చేయడం చాలా సింపుల్.. -
నెయ్యి గురించి చాలామందికి తెలియని నిజం ఇదే.. -
బీహార్ స్పెషల్ దాల్ పూరీ.. శనగపప్పు స్టఫింగ్ తో పర్ఫెక్ట్ రెసిపీ -
జస్ట్ 20 నిమిషాల్లో ది బెస్ట్ సాంబార్ రైస్.. రెస్టారెంట్ ని మించిన రుచితో ఎలా చేసుకోవాలంటే.. -
మలబద్దకంతో బాధపడుతున్నారా? మోషన్ ఫ్రీగా అవ్వాలంటే ఈ ఫుడ్స్ తినండి -
అన్నం, కూర అక్కర్లేదు..ఇదొక్కటి ఉంటే చాలు పొట్టకి హాయిగా, లంచ్ బాక్స్ కి బెస్ట్..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ లడ్డు ఒక్కటి తింటే చాలు..శరీరానికి అవసరమయ్యే కాల్షియం, ప్రొటీన్, ఇంకా చాలా పోషకాలు -
వేడి చేసి మూత్రం సరిగ్గా రావట్లేదా? మన పూర్వీకుల ఈ పచ్చడి తింటే చాలు..చుక్క నూనె లేకుండానే క్షణాల్లో చేయండిలా
హిందూ సంప్రదాయంలో హారతికి ఎందుకంత ప్రాముఖ్యత ?
దేవాలయంలో అయినా, ఇంట్లో అయినా పూజ పూర్తయ్యాక హారతి ఇస్తాం. అలాగే కొత్త పెళ్లికూతురిని ఆహ్వానించడానికి హారతి ఇస్తాం. కొన్ని సందర్భాల్లో ప్రత్యేక అతిథులను, గొప్పవాళ్లను కూడా హారతి ఇచ్చి స్వాగతం పలుకుతాం. దేవాలయానికి వెళ్లినప్పుడు హారతి తప్పనిసరిగా కళ్లకు అద్దుకుంటాం. ఇంతటి ప్రాధాన్యత ఉన్న హారతి ఎందుకు ఇస్తారో ఒక్కసారైనా ఆలోచించారా ? హారతి ఇవ్వాల్సిన అవసరమేంటో తెలుసా ?

హారతి సమయంలో దేవుడి ప్రతి భాగము మీద మనసు పెట్టి ఆయన రూపాన్ని దీపపు వెలుగులో చూసే దివ్యమైన అవకాశం పొందడానికే ఈ హారతి ఇచ్చే సంప్రదాయం తీసుకొచ్చారు. అలాగే హారతి సమయంలో గంట కొట్టడం వల్ల చుట్టు పక్కల ఉన్నవాళ్లు ఆ శబ్ధం ద్వారా హారతి ఇస్తున్నారని గ్రహించి దేవుడి దర్శనానికి రావాల్సిందని ఆహ్వానించినట్టు. అలాగే హారతి ఇచ్చే సమయంలో మనకు తెలియకుండా.. మన మనసు ఆధ్యాత్మిక భావనలోకి వెళ్తుంది.
హారతి సమయంలో గంట ఎందుకు కొడతారు ?
కళ్లకు హారతి అద్దుకుంటూ అజ్ఞాన అంధకారాన్ని తొలగించి, జ్ఞాన ప్రకాశాన్ని కలిగించమని ఆ భగవంతుడిని ప్రార్థించాలి. సూర్యుడిలోని జ్యోతి, పరామాత్మలోని జ్యోతి, మన కళ్లలో ఉండే జ్యోతి ఒక్కటే అని ఈ హారతి వివరిస్తుంది. కర్పూర హారతి ఎలా కరిగిపోతుందో, మనం తెలిసీ తెలియక చేసిన తప్పులు అలాగే కరిగిపోవాలని వేడుకుంటూ హారతిని కళ్లకు అద్దుకోవడమే ఇందులోని అర్థం.. పరమార్థం.

ఆ దేవుడి దర్శన భాగ్యాన్ని కలిగించే హారతి చాలా పవిత్రమైనది. అలాగే హారతికి కర్పూరం ఉపయోగించడం వెనక కొన్ని ఆరోగ్యకరమైన కారణాలున్నాయి. కర్పూరం వెలిగించి హారతి ఇవ్వడం వల్ల సూక్ష్మక్రిములు నశిస్తాయి. శ్వాస సంబంధ వ్యాధులు, అంటు వ్యాధులు దూరంగా ఉంటాయి.



Click it and Unblock the Notifications
