Latest Updates
-
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.! -
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ! -
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.! -
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎన్ని అద్దాలు అమర్చాలి, ఏ దిశలో ఉంచాలో తెలుసా.! -
రసం, సాంబార్లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. మిరియాల ఘాటుతో స్సైసీగా కాలీఫ్లవర్ ఫ్రై
మీకు కలలో శివలింగం లేదా శివుడు కనిపిస్తున్నాడా..? అయితే ఈ విషయాన్ని వెంటనే తెలుసుకోవాలి..!
కలలను తేలికగా తీసిపారేయవద్దు. నిద్రపోయినప్పుడు వచ్చే కలలకు ఎన్నో అర్థాలు వుంటాయని శాస్త్రం చెబుతోంది. కలలను బట్టి భవిష్యత్తులో ఏమి జరగబోతోందో తెలుసుకోవచ్చని పండితులు చెబుతున్నారు. కలల ఎన్నో విషయాలను సూచిస్తాయ్. అయితే కొందరి కలలో శివలింగం, లేదా శివుడు కనిపించడం జరుగుతుంది. శివుడంటే దేవుళ్లల్లో చాలా శక్తివంతుడు, ప్రత్యేకమైన వాడు. అలాంటి శివుడు కనిపిస్తే ఏమి జరుగుతుందోనని కొందరు ఆందోళన చెందుతారు. శివుడు కనిపిస్తే త్వరలో మరణించబోతున్నామోమోనని కూడా కొందరు భావిస్తారు. అసలు శివుడు, లేదంటే శివలింగం కలలో కనిపిస్తే ఏమవుతుందో తెలుసుకుందాం.
1. శివుడు, లేదా శివ లింగం కలలోకి రావడం మామూలు విషయం కాదు. ఎంతో అదృష్టం వుంటే గానీ శివుడు కలలోకి రాడని చెబుతున్నారు. శివుడని నిత్యం పూజించే వారికి ఈ భాగ్యం కలుగుతుందని అంటున్నారు. పూర్వ జన్మ సుక్రుతం వల్ల కూడా శివుడు కలలో కనిపిస్తాడని అంటారు. శివుడు కలలో కనిపిస్తే భయపడాల్సిన అవసరం లేదు. శివుడి ఆశీస్సులు మీపై ఉన్నాయ్ గనుకనే శివుడు మీకు కలలో కనిపిస్తున్నాడు. కొందరు మొక్కులను మొక్కుకొని మర్చిపోతూ వుంటారు. ఇలాంటి సందర్భంలో కూడా ఆ మొక్కులను గుర్తుచేయడానికి శివుడు కలలోకి వస్తాడని అంటున్నారు.

2. శివలింగం కలలో కనిపిస్తే మోక్షాన్ని పొందుతారని సంకేతంగా పండితులు చెబుతున్నారు. శివుడిని దర్శించడానికి ఎన్నో కిలోమీటర్ల ప్రయాణిస్తామ్. అలాంటిది శివుడే నేరుగా కలలోకి వచ్చి దర్శనమిచ్చాడంటే దానిేనిే అదృష్టంగా భావించాలని అంటున్నారు.
3. శివుడు కలలో కనబడితే ఐశ్వర్యవంతులవుతారని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. అది శుభానికి సంకేతంగా భావిస్తున్నారు. ఆరోగ్యవంతులై, సంపూర్ణ ఆయుష్షు కూడా లభించిన వారవుతారు. పడుకునే ముందు ఒం నమ:శివాయ అని జపించి పడుకుంటే ఎలాంటి భయంకరమైన కలలు రావని, మంచి కలలు వస్తాయని చెబుతున్నారు.
4. శివలింగాన్ని కలలో అలాగే చూసినట్టయితే రాబోయే మీ జీవితంలో సుఖసంతోషాలు కలుగుతున్నాయని అర్థం. మీకు ఏ సమస్యలు వున్నా రాబోయే రోజుల్లో అవి తీరిపోతాయ్. మీ జీవితంలో ఏదైనా నెగటివ్ ఎనర్జీ వుంటే అది కూడా తొలగిపోతుందని అంటున్నారు.

5. శివలింగాన్ని అభిషేకం చేస్తున్నట్టు గనుక కలగంటే మీరు పోయిన జన్మలో చేసిన పాపాలు, లేదంటే ఈ జన్మలో చేసిన పాపాలు తీరిపోవడానికి సంకేతాలుగా భావించాలని పండితులు చెబుతున్నారు.
6. గర్భిణులు తమ కలలో శివలింగాన్ని గనుక చూసినట్లయితే వారికి ఇష్టమైన సంతానం కలగబోతోందని అర్థం. కలలో బిల్వపత్రంతో, లేదంటే లింగానికి అభిషేకం చేస్తున్నట్టు కలవస్తే మీ ఆరోగ్యం చాలా బాగుండబోతోందని సంకేతం.
7. పాడైపోయిన నీరుతో శివలింగానికి అభిషేకం చేస్తున్నట్టు కలలో వచ్చినా లేదా శివలింగం పగిలిపోయినట్టు కల వచ్చినా..అది మంచి కల కాదని చెబుతున్నారు. ఇలా కలవస్తే రాబోయే రోజుల్లో డబ్బు ఖర్చయిపోయ్, ఆరోగ్యం పాడయ్యే అవకాశాలు వున్నాయ్.
8. కలలో శివలింగంపై నాగుపాము వున్నట్లు కనబడితే మంచి జరుగుతుంది. రాబోయే రోజుల్లో మంచి ధనప్రాప్తి కలుగుతుందని సంకేతం. డబ్బుకు సంబంధించిన అన్ని సమస్యలూ తీరిపోతాయని అంటున్నారు.
9. కలలో తెల్లరంగులో వున్న శివలింగ కనిపిస్తే రాబోయే రోజుల్లో మీ పేరు ప్రతిష్టలు బాగాపెరిగే అవకాశం వుంది. కలలో శివలింగంతో పాటు త్రిశూలాన్ని గనక చూసినట్లయితే రాబోయే రోజుల్లో మీ శత్రువుల మీద మీరు విజయాన్ని సాధిస్తారని సంకేతం.



Click it and Unblock the Notifications