Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
శివుడి మూడో కన్ను రహస్యాలు తెలుసా..? మనకి కూడా మూడో కన్ను వుంటుందా..?
శివుడకి సంబంధించి ఎన్నో మిస్టరీలు ఇంకా కొనసాగుతూనే వున్నాయ్. శివుడు మూడో కన్ను తెరిస్తే సృష్టి మొత్తం అంతమవుతుందని అంటారు. ఈ మూడో కన్నుకు యోగ శాస్త్రంలో చాలా ప్రాముఖ్యత వుంది. యోగ, ద్యానం చేయడం వల్ల మూడో కన్నును యాక్సెస్ చేయగలరని కూడ శాస్త్రం చెబుతోంది. మూడో కన్ను గురించి సాధ్యమైనన్ని విషయాలను మీకు అందిస్తున్నాం. శివుడి మూడో కన్ను అసలు ఎందుకు తెరుస్తాడో తెలుసుకుందాం. శివుపురాణంలో, రుద్ర సంహితలో ఇలా వుంది. శివుడు పార్వతిని పెళ్లి చేసుకున్న తరువాత గృహస్థుడిగా కాకుండా ఒక సన్యాసిగా జీవించాడు. ఈ విషయాన్ని తారకాసురుడు తెలుసుకున్నాడు. బ్రహ్మదేవుడికి తపస్సు చేసి తన అంతం శివుడికి పుట్టే వాడితోనే కావలని వరం కోరుకుంటాడు. ఆసమయానికి శివుడికి సంతానం వుండదు. సన్యాసికగా బ్రతికేవారికి సంతానం రాదని తారకాసురుడు ఈ పధకం వేశాడు.

తారకాసురుడు, ముల్లోకాలను తన గుప్పెట్లోకి తీసుకోవాలని అనుకున్నాడు. శివుడిని ఏదో ఒకటి చేసి బ్రహ్మర్యం నుంచి బయటకు తీసుకొని రావాలని అనుకున్నాడు. దానికి మన్మధుడి సాయాన్ని అడుగుతాడు. మన్మధుడు కైలాసానికి వెళ్లి అక్కడి వాతావరణాన్ని మొత్తం మార్చేశాడు. మన్మధుడు తన మన్మద బాణాన్ని శివుడి యదపై గురిపెట్టి వదిలాడు. శివుడి యదకు బాణం తాకి ధ్యానంలోంచి బయటకు వస్తాడు. తన ఏకాగ్రతకు భంగం కలిగించాడని తన మూడోకంటిని తెరిచి మన్మధుడిని భస్మం చేస్తాడు. ఆ తరువాత శివపార్వతులు ఏకమై కార్తికేయుడికి జన్మనిచ్చారు.
మన్మధుడు కామానికి ప్రతీక, కోరిక అంటే లైంగిక కోరిక మాత్రమే కాకుండా డబ్బు, డ్రగ్స్ ఇలా ఏదైనా కావచ్చు. ఇలాంటి కోరికలను ఘ్నానోదయం మాత్రమే దహించి వేస్తుంది. శివుడు తన ఘ్నాననేత్రంతో మన్మధుడిని అలాగే భస్మం చేస్తాడు.

మనిషి తనని తనను అర్థం చేసుకుంటే సంపూర్ణత వుంటుంది. దీనినే నిర్వణ అని కూడా అంటారు. శివుడు ధ్యానం చేస్తుంటే మధ్యలో మన్మధుడు వచ్చాడు, అప్పుడ మూడో కన్నుతో భస్మం అయ్యాడు. ఈ సృష్టిలో కూడా ఎన్నో మనల్ని ఆకర్శిస్తాయ్. వాటిని మన మూడో కన్ను నుంచి కూడా చూడాలి. అలా చూసినప్పుడు మాత్రమే మనము అసలు విషయాన్ని తెలుసుకోగలుగుతాము.
హిందూ శాస్త్రం గ్రంధాల్లో ఈ సృష్టి మొత్తం ఒక మాయగా చెప్పబడింది. ఈ మాయను గ్రహించి ఇంకా ముందుకు వెళ్తే ఇదంతా పరమాత్మ సృష్టి అని అర్థం చేసుకోగలుగుతాం. శివుడు మూడో కన్ను విధ్వం సం చేస్తుందని అంటారు, కానీ ఇక్కడ విధ్యంసమంటే మాయను చీల్చి అసలు దానిని చూపెట్టడమని గ్రహించాలి.
ఒకసారి పార్వతి నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి శివుడి రెండు కళ్లను తన చేతులతో మూస్తుంది. ఆ రెండు కళ్లూ సూర్య చంద్రులకు ప్రతిరూపాలు. దీంతో మూడో కన్నును తెరుస్తాడు. ఆ మూడోకన్నులోంచి అగ్ని ద్వారా చూపులేని బాలుడు ఉద్భవించాడు. అతడిపేరే అంధకాసురుడు. ఈ అంధకాసురుడు శివుడి చేతుల్లోనే అంతమయ్యారు.
శివుడి నుదిటిపైనే మూడోకన్ను వుండటానికి ఒక శాస్త్రీయ కారణం వుంది. ఏది మంచి ఏది చెడు తెలుసుకొనే సామర్ధ్యం, నుదుటి వెనకున్న మెదడుకి మాత్రమే వుంటుంది. అందుకే శివుడి మూడో కన్నను ఘ్నాన నేత్రమని కూడా అంటాం.



Click it and Unblock the Notifications