Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
ఏ కన్ను అదిరితే అదృష్టం ..? ఏ కన్ను అదిరితే అనర్థం..?
ఆడవాళ్లకి కుడికన్ను అదిరితే కీడు సంభవిస్తుందని, మగవారికి ఎడమకన్ను అదిరితే కష్టాలు తప్పవని విశ్లేషిస్తుంటారు జ్యోతిషవేత్తలు. ఈ నమ్మకం తాము సృష్టించింది కాదని, రామాయణ కాలంలోనే ఇది ప్రాచుర్యంలో ఉందని చెబుతారు వారు.
ఆడవారికి కుడికన్ను, మగవారికి ఎడమకన్ను అదరడం వల్ల అనార్థాలు జరుగుతాయని చాలా మంది నమ్మకం. మన సంప్రదాయ శకున శాస్త్రంలో కూడా ఈ విషయం తెలుపబడినది. సీతాదేవిని రావణాసురుడు అపహరించే ముందు ఆమెకు కుడికన్ను , లక్ష్మణుడికి ఎడమకన్ను అదిరాయట. రావణ సంహారానికి ముందు రాముడు లంకలోకి ప్రవేశించగానే రావణుడికి కుడి కన్ను, సీతకు ఎడమకన్ను అదిరాయట. రామదండు లంక మీద దాడి చేయబోయే ముందు రావణుడికి, మండోదరికి కూడా కన్ను అదరిందట. ఆ కాలం నుండే కన్ను అదరడం వల్ల జరిగే శుభ, అశుభ శకునాలను అంచనావేసేవారు..
కళ్ళు అదరడం వెనకు ఆరోగ్యకరమైన కారణాలు: కళ్ళు అదరడం శకునంగా అయితే ఒక లిప్త కాలంగా జరుగుతుంది. కానీ గంటల తరబడి కన్ను అదరడం అనారోగ్యానికి సూచన. నిద్ర సరిపోకపోయినా, కళ్లు ఎక్కువగా అలసిపోయినా, నరాల బలహీనత, విటమిన్ల లోపం, కొన్ని రకాల కంటి సంబందమైన రోగాల వల్ల కూడా కన్ను అదరడం జరుగుతుందని వైద్యులు సూచిస్తున్నారు. అయితే కుడి ఎడమ కన్నులు అదరడం వల్ల మన వాళ్ళలో ఉండే కొన్ని మూడనమ్మకాలు ఈ క్రింది విధంగా...

హవాయిలో ఎడమకన్ను కొట్టుకుంటే
హవాయిలో ఎడమకన్ను కొట్టుకుంటే ఓ అపరిచితుడు జీవితంలోకి వస్తాడని, కుడి కన్ను అదిరితే... తమ ఇంట్లో కానీ, బంధువుల ఇళ్లలోగానీ పసిబిడ్డ జన్మిస్తుందని విశ్వసిస్తారు.

కన్ను పై రెప్ప కొట్టుకుంటే
ఆఫ్రికాలో కన్ను పై రెప్ప కొట్టుకుంటే బంధువుల రాక అని, కిందిరెప్ప కొట్టుకుంటే కన్నీళ్ల కుండపోత తప్పదని అంటారు.

నైజీరియాలో ఏ కన్ను కొట్టుకున్నా
నైజీరియాలో ఏ కన్ను కొట్టుకున్నా చెడే జరుగుతుందంటారు.

మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల మధ్య అయితే కష్టాలు వస్తాయట.
మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల మధ్య అయితే కష్టాలు వస్తాయట. 3 నుంచి 5 మధ్య అయితే విదేశాల నుంచి అతిథులు వస్తారట. ఇలా చాలా లెక్కలున్నాయి వారికి!

కళ్ళతో పాటు ఇతర అవయవాలు కూడా అదురుతాయి.
మానవ శరీరంలో కళ్ళతో పాటు ఇతర అవయవాలు కూడా అదురుతాయి. కాబట్టి, అలా కళ్ళు అదరడం మాత్రమే కాదు, ఇతర అవయవాలు అదరడం వల్ల వేటివేటికి సూచనలో తెలుసుకుందాం..

నడి నెత్తిమీద అదిరితే
ఆడవారికి నడి నెత్తిమీద అదిరితే బ్రుష్టాన్న భోజనం

ఆడవాల్లకి ఎడమ కన్ను అదిరితే
ఆడవాల్లకి ఎడమ కన్ను అదిరితే ---అనుకోని చాలా మంచి పనులు జరుగుతాయి.

ముక్కు ఎడమవైపు అదిరితే
ముక్కు ఎడమవైపు అదిరితే --అనారోగ్య పాలవుతారు.

ముక్కు కుడివైపు అదిరితే
ముక్కు కుడివైపు అదిరితే --సుభకరం, సంతోషవిషయాలను వింటారు

కుడి చెంప వైపు అదిరితే
కుడి చెంప వైపు అదిరితే ---వివిధ రకాలుగా విజయాలు పొందుతారు.

ఎడమ చెపం వైపు అదిరితే :
ఎడమ చెపం వైపు అదిరితే : శత్రు భయం, శత్రువుల వల్ల నష్టం వస్తుంది.

పురుషులకి - పెదవి ఎడమైపు అదిరితే
పురుషులకి - పెదవి ఎడమైపు అదిరితే ---ఆరోజు బారికి ఆహారం ఉండదు

పెదవి కుడి వైపు అదిరితే
పెదవి కుడి వైపు అదిరితే ---ఆ రోజు మంచి బోజనం చేస్తారు

పురుషులకి కుడి చేయి అదిరితే
పురుషులకి కుడి చేయి అదిరితే ---మంచి ఉద్యోగం ప్రాప్తిస్తుంది . ఆ చేయితో చేసే పనులు మంచిగా జరుగుతాయి.

పురుషులకు ఎడమ చెయ్యి అదిరితే
పురుషులకు ఎడమ చెయ్యి అదిరితే ---ఉద్యోగస్తుల్లో వారి పై అధికారులతో ఇబ్బంది కలుగుతుంది .

పురుషుల ఎడమ తొడ అదిరితే
పురుషుల ఎడమ తొడ అదిరితే ---స్థాన బ్రంసం(స్థల మార్పిడి)ఉద్యోగంలో ఇబ్బందులు ఎందుర్కుంటారు- అంత మంచిది కాదు.

ఆడవారికి ఎడమ భాగం మేలు చేస్తుంది
ఆడవారికి ఎడమ భాగం మేలు చేస్తుంది. కుడి భాగం అంత మంచిది కాదు (కీడును సూచిస్తుంది).

పురుషులకి కుడిభాగం మేలు చేస్తుంది.
పురుషులకి కుడిభాగం మేలు చేస్తుంది. ఎడమభాగం అంత మంచిది కాదు (కీడును సూచిస్తుంది).

నుదురు అదిరితే
నుదురు అదిరితే --ఊహించని ధన ప్రాప్తి పొందుతారు

కనుబొమ్మ అదిరితే
కనుబొమ్మ అదిరితే మిత్ర లాభం.

కంటికింద బాగం అదిరితే
కంటికింద బాగం అదిరితే విజయం జయిస్తారు .

చెవులు భాగం అదిరితే
చెవులు భాగం అదిరితే మంచి విషయాలను వింటారు

వీపు అదిరితే
వీపు అదిరితే పరాజయం పాలవుతారు

రొమ్మ అదిరితే
రొమ్మ అదిరితే విజయం పొందుతారు.



Click it and Unblock the Notifications