Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
తథాస్తు దేవతలు అంటే ఎవరో తెలుసా!..వాళ్లు తిరిగే టైం అదేనంట
సాధారణంగా మనం చాలాసందర్భాలలో ముఖ్యంగా సాయంత్ర వేళల్లో మాట్లాడే సమయంలో ఏవైనా అమంగళకరమైన మాటలు అంటుంటే మన పెద్దలు పైన తథాస్తు దేవలు ఉంటారు,వారు తథాస్తు అంటే మనకు అంతా చెడే జరుగుతుందని మనల్ని హెచ్చరించడం చాలా సందర్భాలలో చూసి ఉంటాం. ఇలా ఎందుకు అంటారో చాలామందికి తెలియకపోవచ్చు. మన నోటి గుండా వచ్చే మాటలకు తథాస్తు అని దేవతలు అంటే ఆ విషయం అలాగే జరగుతుందని.. ఆమోద ముద్ర వేయడం ఈ దేవతలు చేసే పని అని చెప్తుంటారు. తథ అంటే అప్రకారంగా.. అస్తు అంటే జరగాల్సిందే అని అర్థం.
మనిషి ఏదైనా అనరాని మాటను పదే పదే అంటే తథాస్తు దేవతలు వెంటనే తథాస్తు అంటారు. ఇలా తథాస్తు అనే వారినే తథాస్తు దేవతలు అని అంటారు. అందుకే మన నోటినుంచి వచ్చే వాక్కు సత్యవాక్కుగానే వుండాలని శాస్త్రాలు చెప్తున్నాయి. అయితే ఇంతకీ తథాస్తు దేవతలు ఎవరు? ఏ సమయంలో తథాస్తు దేవతలు తిరుగుతారు అనే వివరాలను ఇప్పుడు చూద్దాం.

వీరు ప్రయాణించే మార్గంలో తథాస్తు అనుకుంటూ, వేద మంత్రాలను జపిస్తూ ఉంటారు. యజ్ఞాలు, యాగాలు జరిగే చోట వీరు ఎక్కువగా సంచరిస్తూ ఉంటారు. అశ్వినీ కుమారులు ఒక చేత్తో ఆయుర్వేద గ్రంథాన్ని మరో చేత్తో అభయ హస్తాన్ని చూపిస్తూ తిరుగుతూ ఉంటారని పండితులు చెబుతున్నారు. అశ్వినీ కుమారులు ఎక్కువగా సాయంత్రం సమయంలో తిరుగుతూ ఉంటారని నమ్ముతుంటారు. సాయంత్రం 4 నుంచి రాత్రి 8 వరకు వీరు తిరుగుతూ ఉంటారని పురాణాలు కూడా చెబుతున్నాయి.
సంధ్యా సమయంలో స్వవిషయాలను పలుమార్లు అంటే ఆ దృశ్యాన్ని చూసిన దేవతలు తథాస్తు అంటూ ఉంటారు. మన దగ్గర ఎంత ధనం ఉన్నా తరచూ డబ్బు లేదు లేదు అని పలుమార్లు అంటే నిజంగా లేకుండానే పోతుంది. ఆరోగ్యంగా ఉండి అనారోగ్యంతో ఉన్నామని తరచూ అంటే నిజంగానే అనారోగ్యం ప్రాప్తిస్తుందట. ఇతరులకు హాని చేయకుండా నిస్వార్థంగా కోరుకుంటేనే అలాంటి పనులకు మాత్రమే దేవతలు తథాస్తు అంటారట. ఎవరైనా మనకు అన్యాయం చేసినప్పుడు మనం పదే పదే వారి గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. తథాస్తు దేవతలు ఈ మాటలను విని తథాస్తు అంటారట. దీంతో మనకు అన్యాయం చేసిన వారి పతనం ప్రారంభమవుతుంది. కాబట్టి ఇతరుల గురించైనా లేదా మన గురించైనా మనం చెడుగా మాట్లాడుకోకూడదని పండితులు చెబుతున్నారు.



Click it and Unblock the Notifications