Latest Updates
-
జిమ్ చేసేవారికి పర్ఫెక్ట్ స్వీట్.. పంచదార లేని హై ప్రోటీన్ పీనట్ బటర్ లడ్డూ..ఎలా చేసుకోవాలంటే.. -
ఈ సొసైటీ మిమ్మల్ని చిన్న చూపు చూస్తుందా.. మీ గౌరవం పెరగాలంటే ఈ 3 విషయాలు గుర్తుంచుకోండి.! -
మీ పిల్లల్లో ఒబెసిటీ వేగంగా పెరుగుతుందా.. తల్లిదండ్రులు చేసే ఈ ఐదు పొరపాట్లే కారణం.! -
మటన్ పాయను కూడా మరిపించే వెజ్ పాయ.. ఒక్కసారి రుచి చూస్తే జన్మలో వదిలిపెట్టరు.! -
బాబా వంగా అంచనా: 2026 సెప్టెంబర్లో ఈ 4 రాశులపై కనకవర్షం ఖాయం! -
రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఎంత తిన్నా ఈజీగా బరువు తగ్గించే సొరకాయ చపాతీ.! -
అద్భుతం,అమోఘం..గోధుమపిండి లడ్డు ఇలా చేశారంటే తిరుగులేని బలం! -
భార్య తన భర్తకు రాఖీ కట్టవచ్చా? అసలు విషయం ఇదండీ.. -
ప్రోటీన్ రిచ్ బ్రేక్ ఫాస్ట్: బయట స్పాంజ్, లోపల ఘాటు..నోరూరించే పనీర్ చిల్లీ ఇడ్లీ ఎలా చేసుకోవాలంటే.. -
డెంగ్యూకి బొప్పాయి ఆకు రసం బ్రహ్మాస్త్రమా? ఇది తాగితే ప్లేట్ లెట్స్ పెరుగుతాయా?
తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి తొలిదర్శనం ఎవరికీ...? వారికే ఎందుకంత ప్రాధాన్యత..?
తిరుమలలో శ్రీవారి దర్శనమంటే ఎవరికైనా చాలా ఆసక్తి ఉంటుంది. మరి తొలి దర్శనం చేసుకునే భాగ్యం ఎవరికి కలుగుతుంది. అది ఒకటి, రెండు సార్లు కాదు. జీవితాంతం వారే తొలిదర్శనం చేసుకుంటారు. వారే ఎందుకు తొలి దర్శనం చేసుకుంటారు. ఎవరు వారు ఆ చరిత్ర ఏమిటి?
సూర్యోత్పూర్వానికి ముందే పూజారులు శుభ్రంగా నదీస్నానం చేసి ఆలయ తలుపులు తెరిచి స్వామివారికి నమస్కరించి ఆలయాన్ని తెరుస్తారు. అంటే పూజారులే తొలి దర్శనం చేసుకుంటారు. ఇది సాధారణ ఆలయాల్లో... మరి తిరుమలలో ఏం జరుగుతుంది. వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఎలా ఉంటుంది. శ్రీవారి ఆలయానికి పెద్ద వ్యవస్థ ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానమే ఉంది.
అయితే ఎవరు తలుపులు తెరుస్తారు.? తొలిదర్శనం ఎవరు చేసుకుంటారు. ప్రతీ రోజూ ఒకే ఒకాయన తలుపు తెరుస్తారు. ఆయనే తొలిదర్శనం చేసుకుంటారు. ఎవరాయన అంటే సన్నిధి గొల్ల వారే తొలి దర్శనం చేసుకుంటారు. ఎందుకలా..? అంటే మనం చరిత్రలోకి తొంగి చూడాల్సిందే.

శ్రీవెంకటేశ్వర స్వామి తొలిదర్శనం ఎవరికీ...?
ఎప్పటి నుంచో స్వామి వారికి ఓ వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థ ప్రకారం స్వామి పరకామణిని కొందరు చూస్తే.. ఆలయాన్ని కొందరు చూసేవారు. పూజాధి కార్యక్రమాలు అర్చకులు చేస్తారు.

శ్రీవెంకటేశ్వర స్వామి తొలిదర్శనం ఎవరికీ...?
ఇందులో భాగంగా స్వామి వారి ఆలయ భద్రత వంటి వాటిని గొల్లలు చూసేవారు. ఉదయం ఆలయం తెరచి రాత్రి మళ్ళీ మూసుకుని వెళ్ళేవారు. తిరిగి వారే ఆలయాన్ని తెరుస్తారు. ఆ బాధ్యతను నేటికి వారే నిర్వహిస్తున్నారు.

శ్రీవెంకటేశ్వర స్వామి తొలిదర్శనం ఎవరికీ.?
అందుకే వీరిని సన్నిధి గొల్ల అంటారు. సాంప్రదాయబద్ధంగా ఆ కుటుంబమే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

శ్రీవెంకటేశ్వర స్వామి తొలిదర్శనం ఎవరికీ.?
ఆనవాయితీగా ప్రతిరోజు తెల్లవారుజామున సన్నిధి గొల్ల శుచిగా స్నానం చేసి దివిటీ చేపట్టుకుని 3 గంటల సమయంలో కుంచెకోల(తాళాలు ఉండేది) తీసుకుని ఆలయానికి బయలుదేరుతారు. అంతకు మునుపు అర్చకులు ఆయన ఇంటి వెళ్ళి ఆయనను ఆలయం తెరవడానికి ఆహ్వానిస్తారు.

శ్రీవెంకటేశ్వర స్వామి తొలిదర్శనం ఎవరికీ.?
అందరు కలసి ఆలయం వద్దకు వెళ్ళతారు. అందరూ బయట నిలబడి ఉండగా గొల్లసన్నిధి తాళాలతో తలుపులు తెరుస్తారు. అనంతరం బంగారు వాకిలి వద్దకు వెళ్ళి జీయంగార్ స్వాములు వేదపండితులు సుప్రభాతం పఠనం మొదలు పెడుతుండగా సన్నిధి గొల్ల ఆ తలుపులు తెరుస్తారు.

శ్రీవెంకటేశ్వర స్వామి తొలిదర్శనం ఎవరికీ.?
దీంతో ఆయనకు వేంకటేశ్వర స్వామి తొలిదర్శనం లభిస్తుంది. ఆ తరువాత అర్చకులు తమతో తెచ్చుకున్న పూజా సామాగ్రితో లోనికి ప్రవేశించి రాత్రి పవళింప చేసిన భోగశ్రీనివాస మూర్తి విగ్రహాన్ని గర్భగుడిలోకి తీసుకెళ్ళతారు.

శ్రీవెంకటేశ్వర స్వామి తొలిదర్శనం ఎవరికీ.?
తరువాత అన్ని రకాల కైంకర్యాలు జరుగుతాయి. ఇలా తొలిదర్శనం సన్నిధి గొల్లకు దక్కుతుంది. తిరిగి రాత్రి తుది దర్శనాన్ని చేసుకుని తలుపులు వేసి సన్నిధి గొల్ల తాళాలను తను నివాసం ఉంటున్న ఇంటికి తీసుకెళ్ళతారు.



Click it and Unblock the Notifications