Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
ఆషాఢమాసంలో నవదంపతులను ఎందుకు దూరం చేస్తారు, కలిస్తే ఏమవుతుంది?
హిందూ సంప్రదాయం ప్రకారం మనకు ఎన్నెన్నో పద్ధతులు ఉన్నాయి. పుట్టినప్పటి నుంచి మనిషి చనిపోయినంత వరకు అనేక సంస్కృతీ, సంప్రదాయాలను ఫాలో అవుతుంటారు. ముఖ్యంగా ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు.. కొత్తగా పెళ్లైన అమ్మాయి అత్తగారి ఇంట్లో ఉండకూడదని, అత్త మొహం చూడకూడదని అంటారు.

ఇప్పటికీ ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు కొత్త కోడలిని పుట్టింటికి పంపించేస్తుంటారు. అయితే ఇలా ఎందుకు చేస్తారు, దీని వెనుక ఉన్న కారణం ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఎడబాటు ఏర్పడటం కోసమే..:
కొత్తగా పెళ్లయిన జంటను వారి మొహం ప్రపంచం నుంచి కాస్త బయటకు తీసుకు రావడానికి ఆషాఢం మాసం పేరుతో కొంత గ్యాప్ ఇస్తారు. దీని ద్వారా ఇద్దరి మధ్య కాస్త ఎడబాటు ఏర్పడి మరింత విరహ వేదన ఏర్పడుతుంది. అది ఇద్దరి మధ్య బలమైన సంబంధానికి, దాంపత్యానికి దారి తీస్తుందని పెద్దల నమ్మకం. అయితే ఇదే కాకుండా మరికొన్ని కధనాలు కూడా అందుబాటులో ఉన్నాయి.
ఏరువాక పనులు కోసం కూడా..:
ఆషాఢ మాసం అనేది వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యే సమయం. ఇది వరకు చాలా కుటుంబాలు వ్యవసాయంపై ఆధారపడి బతికేవి. ఇక ఆషాఢమాసం పక్షం రోజులల ముందే జ్యేష్ఠ్య పౌర్ణమిని ఏరువాక పున్నమిగా పిలుస్తారు. వర్షాకాలం ప్రారంభం అయ్యే సమయం కాబట్టి.. అప్పుడే దుక్కి దున్నడం మొదలవుతుంది.
ధ్యాస మళ్లించడానికి..:
కాబట్టి కొత్తగా పెళ్లైన పురుషుడు భార్య పక్కనే ఉంటే ఇతర పనులపై శ్రద్ధ పెట్టలేడు. కాబట్టి వైవాహిక జీవితం నుంచి అతని ధ్యాస మళ్లించేందుకు భార్యను పుట్టింటికి పంపించేవారు. ఇందుకోసమే అత్త మొహం చూడకూడదనే నియమాన్ని పెట్టారు.
ఎండాకాలంలో ప్రసవం కావొద్దని..:
ఇవే కాదండోయ్ మరో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. అషాఢంలో భార్యాభర్తల కలయిక వల్ల గర్భం దాల్చితే వేసవిలో ప్రసవం జరిగే అవకాశం ఉంటుంది. గతంలో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు లేక వేసవిలో నానా అవస్థలు పడేవారు. పుట్టిన పిల్లలు, బాలింతలు అయితే మరింత అవస్థ పడేవారు. అందుకే వారు కలవకుండా ఉండేందుకు అమ్మాయిని పుట్టింటికి పంపేవారు. ఆషాఢ మాసంలో కొత్త కోడలు అత్త మొహం చూడకూడదు అన్న దాని వెనుక ఇన్ని కథలు ఉన్నాయి. ఒక్కొక్కరూ ఒక్కో దాన్ని నమ్ముతుంటారు.



Click it and Unblock the Notifications
