Latest Updates
-
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు! -
ఐఫోన్ 18పై మోజు.. భార్యను సర్ప్రైజ్ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.! -
రాయలసీమ కారం చికెన్: ఈ ఒక్క సీక్రెట్ మసాలాతో చేస్తే టేస్ట్ జబర్దస్త్
వివాహమైనా కూడా హనుమంతుడు బ్రహ్మచారే..దానికి కారణం ఇదే..!
హనుమంతుడు బ్రహ్మచారి అన్న విషయం మనకు తెలిసిందే. కానీ చాలా మందికి తెలియని విషయం హనుమంతుడికి పెళ్లై భార్యకూడా ఉంది. అయితే భార్య ఉన్నా కూడా హనుమంతుడిని ఆజన్మ బ్రహ్మచారిగానే ఇప్పటికీ చూస్తున్నాం. దానికి గల కారణాలు ఉన్నాయ్. శ్రీహనుమాన్ జయంతి సందర్భంగా హనుమంతుడి వైవాహిక జీవితం, చరిత్రకు సంబంధించిన ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం.
హనుమంతుడి వివాహం
వాల్మీకి రామాయణం, ఇతర పురాణ గ్రంధాలు హనుమంతుని వివాహం గురించి వివరించాయ్. సూర్యదేవుని కుమార్తె సువర్చలాదేవిని హనుమంతుడు పెళ్లాడాడు. సుర్యదేవుని కుమార్తెనే వివాహం ఎందుకు చేసుకోవలసి వచ్చిందనే దానికి చిన్న కథ కూడా ఉంది. చిన్న వయసు నుంచే హనుమంతుడికి సూర్య భగవానుడికి మంచి స్నేహబంధం, గురుశిష్య బంధం ఏర్పడ్డాయ్. సూర్యదేవుడిని హనుమంతుడు పండులా మింగేయడం లాంటి ఘట్టాలు మనకు తెలిసినవే.
సూర్యుడే స్నేహితుడు, గురువు, మామ
సూర్యుడి నుంచి హనుమంతుడు తొమ్మిది విద్యలను నేర్చుకున్నాడు. ఐదు విద్యలు నేర్చుకున్న తరువాత, హనుమంతుడిని వివాహం చేసుకోమని సలహా ఇస్తాడు. సూర్యుడు చెప్పిన బోధనలు, సూచనల ఆధారంగా పెళ్లి చేసుకుందామని హనుమంతుడు నిశ్చయించుకున్నాడు. కానీ అలాంటి అమ్మాయి దొరకదు. దీంతో సూర్యుడు తన కుమార్తె సువర్చలా దేవినే వివాహం చేసుకోమని సూర్యుడు చెప్పడంతో ఆంజనేయుడు అంగీకరించి సువర్చలను పెళ్లి చేసుకుంటాడు.

భార్య సువర్చలా దేవి
సువర్చలాదేవి చాలా చురుకైన తెలివిగల అమ్మాయి. వివాహం తరువాత కూడా సువర్చల సన్యాసంలోనే ఉంటుంది. కొంతకాలం తరువాత సువర్చల తీవ్రమైన తపస్సులో మునిగిపోతుంది. దీంతో హనుమాన్ సువర్చలను పెళ్లి చేసుకుంటాడు కానీ వారి ఇరువురికి సంతానం కలగడం, అందరు భార్యాభర్తల్లా వారి వైవాహిక జీవితం కొనసాగలేదు.
హనుమాన్ సువర్చలాదేవి ఆలయం
హనుమంతుడు, హనుమంతుడి భార్య సువర్చలాదేవికి సంబంధించిన ఆలయం ఖమ్మంలో ఉంది. అక్కడ మనకు హనుమంతుడి సంసారిగా కనబడతాడు. హనుమంతుడి విగ్రమం పక్కన భార్య సువర్చలాదేవి విగ్రహం కూడా ఉంటుంది.
ఇద్దరూ ఒక్కటే
ఇక్కడ కొసమెరుపు ఏంటి అంటే వివాహం సమయంలో సూర్యదేవునితో హనుమంతుడు ఇలా అంటాడు. "మీరు చెప్పినట్లు నేను వివాహం చేసుకుంటాను గానీ ఈ సంసాద బంధాల్లో ఇరుక్కోవడం నావల్ల కాదు. కేవలం పెళ్లి మాత్రమే చేసుకుంటాను గానీ సువర్చలతో నాకు ఎటువంటి సంబంధం ఉండదు. దానికి అంగీకరిస్తేనే పెళ్లి చేసుకుంటాను" అని హనుమంతుడు షరతు పెడతాడు. దానికి సూర్యభగవానుడు, దేవతలందరూ అంగీకరించి సరే అంటారు. చివరికి సువర్చల కూడా సన్యసిగా ఉండాలని అనుకొని ఇద్దరూ సన్యాసుల్లా వారి వైవాహిక జీవితం కొనసాగింది.



Click it and Unblock the Notifications
