Latest Updates
-
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.! -
శరీరానికి చలవ చేసే కమ్మని కీరదోసకాయ దోశ..పిల్లల ఈవెనింగ్ స్నాక్ గా సూపర్! -
అల్సర్ తగ్గించి ఆకలిని పెంచే అద్భుతమైన తమిళనాడు వంటకం.. ఒక్కసారి తింటే జన్మలో వదిలిపెట్టరు.! -
గణేష్ నిమజ్జనం 2026: అనంత చతుర్దశి నాడు 4 మహా యోగాలు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే! -
పెర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.! -
ముంబై రోడ్ సైడ్ తవా పులావ్..మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
గొంతు నొప్పిని ఒక్క ముద్దతో తరిమేసే వెల్లుల్లి కారం పచ్చడి.. అసలు సిసలైన పద్ధతి ఇదే.! -
చిన్న వయసులోనే మెటబాలిక్ సిండ్రోమ్.. ఇది వ్యాధి కాదు.. కానీ ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
సోమవారం రోజు శివారాధన.. ఇలా పూజిస్తే ఏలినాటి శని ప్రభావం తొలగిపోతుంది
సోమవారాల్లో శివుడిని పూజించడం వల్ల అదృష్టాలు, శుభాలు కలుగుతాయి. ఈ రోజున శివుడిని పూజించడం వల్ల సకల పాపాలు తొగలిపోతాయని కూడా నమ్ముతారు. సోమవారం రోజు చేసే ఉపవాసాలు.. అపారమైన శక్తికారుడు అయిన శివుడుకి, పార్వతీ దేవికి అంకితం చేయబడతాయి అని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే సోమవారాల్లో శివుడిని పూజించడం వల్ల మంచి జరుగుతుందని చెబుతారు.

సోమవారం శివారాధన వల్ల ప్రయోజనాలు:
శివుడికి సోమవారం అత్యంత ప్రీతికరమైన రోజుగా చెబుతారు. ఆ రోజు శివారాధన చేయడం వల్ల మనిషి జీవితంలో మనశ్శాంతి, శ్రేయస్సు, వ్యాపారంలో విజయం, మంచి ఆరోగ్యం, ఆనందం లభిస్తాయి భక్తుల విశ్వాసం. ఒత్తిడి, ఆందోళన తగ్గించడానికి కూడా శివ పూజ సహాయపడుతుందని నమ్మకం. జీవితంలో ఆనందం, శ్రేయస్సు కోసం సోమవారాల్లో శివుడిని పూజించాలని శాస్త్రాలు కూడా చెబుతున్నాయి.
శివుడిని ఎలా పూజించాలంటే:
సోమవారం రోజు తెల్లవారుజామున సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. కాలకృత్యాలు తీర్చుకున్న అనంతరం స్నానాది కార్యక్రమాలు పూర్తి అయిన తర్వాత శుభ్రమైన, ఉతికిన బట్టలు ధరించాలి. తర్వాత శివ పూజకు ఉపక్రమించాలి. ముందు రోజు లేదా అదే రోజు ఉదయం నేల రాలని పూలను సేకరించాలి. వాటితో పాటు పండ్లు ఫలాలు సమర్పించాలి. వీలైతే శివుడికి ఇష్టమైన నైవేద్యం సిద్ధం చేసుకోవాలి. అగరుబత్తిలీ అన్నీ ఒకదగ్గర పెట్టుకుని పూజా గదిలో లేదా శివుడి చిత్రపటం ముందు కూర్చోవాలి.
తర్వాత శివుడి చిత్రపటానికి, లింగానికి పసుపు, కుంకుమతో బొట్టు పెట్టుకోవాలి. తర్వాత పూలు చల్లి పూజ ప్రారంభించాలి. మొదట వినాయక స్తోత్రం పఠించి ఆయనను కొలిచిన తర్వాతే శివారాధన మొదలు పెట్టాలి. మంత్రాలు, శ్లోకాలు పఠించాలి. ప్రార్థనలు చేయాలి. తర్వాత ధూపదీపాలు వెలిగించి శివయ్యకు సమర్పించాలి. పండ్లు ఫలాలు, కొబ్బరికాయ, నైవేద్యం సమర్పించి హారతు అందజేయాలి. తర్వాత మనస్ఫూర్తిగా శివుడిని మొక్కుకోవాలి. ఏవైనా కోరికలు ఉంటే ఇప్పుడే కోరుకోవాలి. ఇలా చేయడం వల్ల శివుడి కృప కలుగుతుంది. తలపెట్టిన పనులు విజయవంతం అవుతాయి.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications
