Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.!
5 రోజుల్లో మూడు అరుదైన యోగాలు.. ఈ రాశుల వారు అదృష్టానికే బ్రాండ్ అంబాసిడర్లు అవుతారు!
చంద్రుడు ఏ రాశిలోకి ప్రవేశిస్తే ఆ రాశుల వారికి శుభయోగాలు పట్టుకుంటాయని జోతిష్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఈనెల 15వ తేదీ నుంచి 19వ తేదీ వరకు చంద్రుడు తన రాశిని మార్చుకోనున్నాడు. దీని కారణంగా అయిదు అదృష్ట యోగాలు ఒకేసారి ఏర్పడనున్నాయి. ఈ యోగాల కారణంగా ఆరు రాశులకు చెందిన వ్యక్తులు అనూహ్యమైన ఆకస్మిక ధన లాభాన్ని పొందుతారు.
మనసులోని కోరికలు నెరవేరతాయి. ఈ అయిదు రోజులు చేపట్టబోయే పనులన్నీ విజయవంతమవుతాయి. జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. ఇంతకీ ఆ ఆరు రాశులు ఏంటి? వారికి ఏ విధమైన ఫలితాలు అందనున్నాయి అనే ఈ స్టోరీలో తెలుసుకుందాం.

వృషభం
ఈ రాశి వారికి చంద్ర సంచారం పూర్తిగా అనుకూలంగా మారనుంది. దీని కారణంగా ఈ రాశికి చెందిన వ్యక్తులకు అనూహ్యంగా ఆదాయం వృద్ధి చెందుతుంది. భారీగా ఆదాయం వచ్చి పడుతుంది. మాతృ సౌఖ్యం, మాతృ సంపద కలుగుతుంది. మనసులోని కోరికలు నెరవేరతాయి. ఆస్తి, ఆర్ధిక, వ్యక్తిగత సమస్యలన్నీ దూరమై మనశ్శాంతి దొరుకుతుంది. ఆదాయ ప్రయత్నాలన్నీ కలిసి వస్తాయి. ప్రయాణాలు లాభదాయకంగా మారుతాయి. ముఖ్యమైన శుభవార్తలు వింటారు.
మిథునం
ఈ రాశివారికి గజకేసరి యోగం, చంద్రమంగళ యోగం, పౌర్ణమి యోగం వర్తించనుంది. దీని కారణంగా ఈ రాశి వారి ఆదాయం అనేక మార్గాల్లో విస్తరించనుంది. రావాల్సిన డబ్బు చేతికి వస్తుంది. ఆస్తి వివాదాలు పరిష్కారమవడంతో పాటు ఆస్తి విలువలు పెరుగుతాయి. ఉద్యోగులకు జీతాలు పెరగడంతో పాటు ప్రమోషన్స్ కూడా లభించే అవకాశం ఉంది.
కర్కాటకం
ఈ రాశికి అధిపతి చంద్రుడు. అలాంటి చంద్రుడు మరింత బలంగా మారుతుండడంతో ఈ రాశి వారికి అన్నీ శుభాలే జరగనున్నాయి. చేపట్టబోయే పనులన్నీ విజయవంతం అవుతాయి. మనసులోని కోరికలు తప్పకుండా నెరవేరతాయి. సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తే కార్యసిద్ధి జరుగుతుంది. ఆరోగ్యం కుదుట పడడంతో పాటు ఆదాయ ప్రయత్నాలన్నీ రెట్టింపు ఫలితాలను అందిస్తాయి. ఆకస్మిక ధనలాభం కూడా చేకూరే అవకాశం ఉంటుంది. ప్రయాణాలు లాభదాయకంగా మారుతాయి.
కన్య
ఈ రాశి వారికి గజకేసరి యోగం, చంద్రమంగళ యోగం, పౌర్ణమి యోగాల ఫలాలు ఈ అయిదు రోజుల పాటు బాగా కలిసి రానుంది. ఈ యోగాలన్నీ రాశి వారిపై అనుకూలమైన పరిణామాలను చూపిస్తుండడంతో ఈ రాశికి చెందిన వారి ఆదాయం డబల్ అవుతుంది. ఆస్తుల విలువ పెరుగుతుంది. లాభదాయకమైన ఒప్పందాలు, లావాదేవీలు జరుగుతాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. అనారోగ్యం నుంచి ఉపశమనం పొందడంతో పాటు రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది.
తుల
ఈ రాశి వారికి అనుకూలమైన స్థానంలో ఈ మూడు యోగాలు ఏర్పడతాయి. దీని కారణంగా ఈ రాశి వారి ఆదాయం భారీగా వృద్ధి చెందుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా అది విజయవంతమై తీరుతుంది. ఉద్యోగుల జీతాలు భారీగా పెరిగే అవకాశం ఉంటుంది. ఉద్యోగం పరంగా రావాల్సిన డబ్బు చేతికి అంది వస్తుంది. వ్యాపారంలో పెట్టిన పెట్టుబడులు కూడా కలిసి వస్తాయి. దీని కారణంగా ఆడ్యామ్ రెండింతలు అవుతుంది. శుభవార్తలు భారీగా వింటారు.
మకరం
ఆర్ధిక లాభాలను ఇచ్చే ఈ మూడు యోగాలు ఈ రాశుల వారికి శుభ పరిణామాలను అందించనున్నాయి. ఆర్ధిక పరిస్థితి మెరుగవుతుంది. అన్ని విధాలుగా ఆదాయం వచ్చి చేరుతుంది. ఉద్యోగులకు జీతం పెరగడంతో పాటు ప్రమోషన్స్ లభించనున్నాయి. ఆస్తి లాభం కలుగుతుంది. అలాగే మంచి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. ఇప్పటి వరకు ఉన్న ఆరోగ్య సమస్యలన్నీ దూరమవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో భారీగా డబ్బులు సంపాదిస్తారు. అన్ని విధాలుగా ఈ రాశివారికి అనుకూలంగా ఉంటుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications
