రఫ్‌ క్యారెక్టర్‌లో తగ్గేదే లే.. ఈ రాశుల వారు తప్పున్నా సారీ కూడా చెప్పరట.!

ప్రతి మనిషికీ ఒక్కో నైజం ఉంటుంది. కొందరికి సున్నిత మనస్తత్వం ఉంటే.. మరికొందరు చాలా కఠినంగా ఉంటారు. ఇంకొందరు సందర్భానుసారం ప్రవర్తిసారు. మనుషుల్లో ఇలాంటి ప్రవర్తనకు వారి వారి రాశి చక్రాలతో సంబంధం ఉంటుందని మీకు తెలుసా. మన జాతకం, గ్రహాల సంచారం, స్థాన చలనం క్యారెక్టర్స్‌ను డిసైడ్‌ చేస్తాయని జ్యోతిష్య పండితులు అంటున్నారు. ముఖ్యంగా ఈ రాశుల కోవకి చెందిన వారు చాలా రఫ్‌గా ఉంటారట. తమ తప్పు ఉన్నా సారీ కూడా చెప్పరట. మరి అలాంటి గుణం ఉన్న వారు ఏ రాశి చక్రంలో ఉన్నారు తెలుసుకుందాం.. అలాంటి వారు మీ సర్కిల్‌లో ఉంటే వారితో జాగ్రత్తగా ఉండటం చాలా అవసరమని తెలుసుకోండి.

According to astrology these zodiac signs people should never apologize even there is fault

ధనుస్సు రాశి

ధనుస్సు రాశిలో పుట్టిన వారు నలుగురితో సరదాగా ఉండటానికి చాలా ఇష్టపడతారు. కొత్త, పాత తేడా లేకుండా అందరితో ఆప్యాయంగా ఉంటారు. కానీ క్యారెక్టర్‌ పరంగా మాత్రం తేడా వస్తే రఫ్‌ అండ్‌ టఫ్‌గా బిహేవ్‌ చేస్తారు. వారు ఏ పనిచేసినా కరెక్టే అనే కాన్ఫిడెంట్‌తో ఉంటారు. ఒకసారి నిర్ణయం తీసుకున్నాక, ఏదైనా పని చేశాక మళ్లీ దాని గురించి ఆలోచించరు. అయినపోయిన దాని గురించి ఆలోచించడం వ్యర్థమని భావిస్తారు. అందుకే తమ తప్పు ఉన్నా సరే సారీ చెప్పడానికి ఇష్టపడరట. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ తాము తీసుకునే నిర్ణయంలో, పనిలో తప్పు లేకుండా చూసుకుంటారు. అందుకే వారికి ఆ పరిస్థితి రాదు.

ఎన్నడూ లేని విధంగా ప్రధాన గ్రహాల సంచారం, అదృష్ట యోగాలు.. ఈ రాశుల వారికి సిరిసంపదల వరాలు.!ఎన్నడూ లేని విధంగా ప్రధాన గ్రహాల సంచారం, అదృష్ట యోగాలు.. ఈ రాశుల వారికి సిరిసంపదల వరాలు.!

వృశ్చిక రాశి (Scorpio)

వృశ్చిక రాశికి చెందిన వారు ఇతరుల మనోభావాలను అస్సలు పట్టించుకోరు. సందర్భంతో సంబంధం లేకుండా ఇతరులతో రఫ్‌గా ప్రవర్తిస్తారు. నలుగురిలో ఉన్నప్పుడు ఇతరులు ఏమనుకుంటారనే ఆలోచన లేకుండా తమ మనసులోని మాటను బహిరంగంగా చెప్పేస్తారు. వీరి మాట, ప్రవర్తన కుండ బద్ధలు కొట్టినట్లుగా ఉంటుంది. అయితే ఈ ప్రవర్తన మంచిదే అయినా సందర్భాన్ని బట్టి తమ గుణాన్ని మార్చుకోవాల్సిందే. లేదంటే ఇతరుల బాధకి కారణమవుతారు.

According to astrology these zodiac signs people should never apologize even there is fault

మిథున రాశి

మిథున రాశిలో పుట్టిన వారు మానసికంగా అంత స్ట్రాంగ్‌గా ఉండరు. ఇమ్‌మెచ్చూర్‌గా ప్రవర్తిస్తారు. కొన్ని సందర్భాల్లో తమ ఫీలింగ్స్‌ను కంట్రోల్‌ చేసుకోలేకుండా ప్రవర్తిస్తారు. గందరగోళంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేరు. లోలోపల కన్‌ఫ్యూజన్‌గా నలుగురిలో వింతగా ప్రవర్తిస్తారు. అలాంటి గుణం మీలో ఉంటే పబ్లిక్‌లో ఉన్నప్పుడు త్వరితగతిన స్పష్టంగా నిర్ణయాలు తీసుకోవడం చాలా అవసరం. లేదంటే ఆలస్యం అమృతం విషయం అవుతుంది. నిగ్రహం కోల్పోతే నలుగురిలో నవ్వులపాలు అవుతారు. అందుకే నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవాలి.

జూన్ 6న పంచగ్రహ కూటమి 100 సం.తర్వాత 5 గ్రహాల కలయిక ఈ 3 రాశుల తిరుగులేదు..రాజయోగం పట్టబోతుందిజూన్ 6న పంచగ్రహ కూటమి 100 సం.తర్వాత 5 గ్రహాల కలయిక ఈ 3 రాశుల తిరుగులేదు..రాజయోగం పట్టబోతుంది

మేష రాశి

మేష రాశి తాము అనుకున్నది జరగకపోతే సహించలేరు. లేదంటే ఓపిక కోల్పోయి దురుసుగా ప్రవర్తిస్తారు. ఈ దురుసు ప్రవర్తన నలుగురిలో మిమ్మల్ని మాట పడేలా చేస్తుంది. అన్నీ మనకు అనుకూలంగా ఉండవని గుర్తుంచుకోవాలి. చెడు ప్రవర్తనను దూరం చేసుకోవడం మంచిది.

వృషభ రాశి

వృషభ రాశి వారు చాలా రిజర్వ్‌డ్‌గా ఉంటారు. కానీ ఎవరైనా రెచ్చగొడితే తమను తాము కంట్రోల్‌ చేసుకోలేరు. కానీ మీరు ఇలా ప్రవర్తించేముందు అవతలి వ్యక్తులు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారో, దాని వెనుక కుట్ర ఏంటో తెలుసుకోవడం ముఖ్యం. నిజానిజాలను తెలుసుకుని ప్రవర్తించాలి. ఎదుటివారి గుణాన్ని బట్టి బిహేవ్‌ చేయడం అవసరం. లేదంటే నోటి దురుసుతనంతో అయినవారిని దూరం చేసుకునే ప్రమాదం ఉంది.

Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.

Story first published: Saturday, September 19, 2026, 13:08 [IST]
Desktop Bottom Promotion