Latest Updates
-
పక్క రాష్ట్రంలో భర్త జాబ్..మరిది ప్రైవేట్ పార్ట్ కొరికిన వదిన..55 కుట్లు పడ్డాయ్ -
ఫైబర్ ఎక్కువ, ఆయిల్ తక్కువ.. కడుపుకు హాయినిచ్చే చౌ చౌ క్యారెట్ కూటు..చపాతీ,పూరీల్లోకి కిర్రాక్ టేస్ట్ -
సెర్బియా ఎన్నికల్లో జెన్ జీ సంచలనం..విద్యార్థుల ఆందోళన దెబ్బకి కుప్పకూలిన ప్రభుత్వం.. -
మాంసాహారాన్ని మించే రుచితో స్పైసీ సోయా చుక్కా..రైస్, చపాతీ, దోశలోకి బెస్ట్ సైడ్ డిష్ -
మీకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముప్పు ఉందో లేదో..ఇలా తెలుసుకోండి -
జస్ట్ 5 నిమిషాల్లో టేస్టీ ఎగ్ పరోటా..ఈజీగా చేసుకోండిలా -
ఇట్ట తయారయ్యారేందే: ప్రియుడితో సుఖం కావాలని భర్తను దారుణంగా.. -
ప్రేమించిన పాపానికి ఇంత ఘోరమా? తండ్రీకొడుకులను నగ్నంగా నడిపించిన యువతి కుటుంబం! -
పంజాబీ జీరా ఆలూ ఫ్రై.. అన్నం, పూరీ, చపాతీల్లోకి అదిరిపోయే సైడ్ డిష్! -
బీహారీ స్పెషల్ దాల్ పిఠీ..ఇది తింటే పిజ్జా, బర్గర్లు కూడా మర్చిపోతారు!
పొట్ట కొవ్వును కొవ్వొత్తిలా కరిగించే డ్రింక్స్ ఇవే!
ఆడ, మగ తేడా లేకుండా ఈ రోజుల్లో కోట్ల మందిని వేధిస్తున్న అతిపెద్ద సమస్య పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోడం. దీనికి అనేక కారణాలు ఉంటాయి. ఎక్కువ సమయం ఒక ప్లేస్ లో కూర్చొని పని చేయడం, శరీరానికి తగినంత వ్యాయామం లేకపోవడం, బయటి ఫుడ్ ఎక్కువగా తినడం, నిద్రలేమి ఇలా అనేక రకాల కారణాలు దీని వెనుక ఉంటాయి. పొట్ట పెరగడం వల్ల అందం తగ్గిపోడమే కాకుండా షుగర్ వంటి అనేక రకాల వ్యాధులు వచ్చే ఛాన్స్ కూడా ఉంటది. ఈ మధ్యకాలంలో చాలామంది అబ్బాయిలకు పొట్ట ఉందనే కారణంతో పెళ్లిళ్లు కూడా అవ్వడం లేదు.
అయితే అధిక బరువుని తగ్గించడానికి కొందరు కఠిన డైట్ లు, మెడిసిన్స్ అనీ ఇలా రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే కేవలం ఏదో ఒక పానీయం తాగడం వల్ల రాత్రికి రాత్రే పొట్ట కరిగిపోదని గుర్తుంచుకోవాలి. కానీ సరైన ఆహార నియమాలు, ఎక్సర్ సైజ్ కి తోడుగా కొన్ని ప్రత్యేకమైన డ్రింక్స్ తీసుకుంటే, శరీర జీవక్రియ (మెటబాలిజం) వేగవంతం అవుతుంది. తద్వారా పొట్ట కొవ్వును సులభంగా కరిగించవచ్చు.

ఈ డ్రింక్స్ తాగితే ఈజీగా బరువు తగ్గొచ్చు
జీలకర్ర నీరు
రాత్రి నిద్రకు బెడ్ ఎక్కే ముందు ఒక గ్లాసు నీటిలో చెంచా జీలకర్ర నానబెట్టండి. ఉదయాన్నే ఆ నీటిని బాగా మరిగించి, వడకట్టి పరగడుపున తాగాలి. ఇది మీ జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా, అనవసరమైన ఆకలిని చంపి, బ్లడ్ షుగర్ కంట్రోల్ లో ఉంచుతుంది.
అల్లం-నిమ్మ నీరు
మరిగే నీళ్లలో కొంచెం సన్నగా తరిగిన అల్లం వేసి నాననివ్వాలి. తర్వాత వడకట్టి, దానికి కొద్దిగా నిమ్మరసం కలిపి పొద్దున్నే పరగడుపున తాగాలి. ఇది గ్యాస్, ఉబ్బరం తగ్గించి శరీర మెటబాలిజంను అమాంతం పెంచుతుంది.
గ్రీన్ టీ
గ్రీన్ టీ లో ఉండే కాటెచిన్స్ అనే సమ్మేళనాలు శరీరంలో పేరుకుపోయిన మొండి కొవ్వును కరిగించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. ఉదయం పూట పాలతో చేసే టీ లేదా కాఫీకి బదులుగా గ్రీన్ టీ తాగడం అలవాటు చేసుకోండి.

సోంపు నీరు
ఒక గ్లాసు వేడి నీటిలో సోంపు గింజలను కాసేపు నానబెట్టి ఆ నీటిని వడకట్టి ఉదయాన్నే తాగాలి. ఇది జీర్ణవ్యవస్థను శుభ్రపరుస్తుంది. ముఖ్యంగా శరీరంలో అదనంగా నిలిచిపోయిన నీటిని బయటకు పంపి బరువును నియంత్రిస్తుంది.
పసుపు పాలు
పసుపులో ఉండే కర్కుమిన్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ శరీరంలో వాపులను తగ్గిస్తుంది. రాత్రి నిద్రపోయే ముందు గోరువెచ్చని పసుపు పాలు తాగడం వల్ల శరీరంలో కొత్తగా కొవ్వు చేరకుండా నిరోధించవచ్చు. అలాగే ఇది మంచి నిద్రకు, శరీరాన్ని డిటాక్స్ చేయడానికి కూడా సహాయపడుతుంది.
మజ్జిగ
ఎప్పుడైనా మజ్జిగ అమృతంతో సమానం. మధ్యాహ్నం భోజనం తర్వాత లేదా సాయంత్రం స్నాక్స్ తినాలనిపించినప్పుడు జంక్ ఫుడ్ వైపు వెళ్లకుండా ఒక గ్లాసు చల్లటి మజ్జిగ తాగండి. ఇది జీర్ణక్రియకు మేలు చేయడంతో పాటు, కడుపు నిండిన భావనను కలిగించి క్యాలరీలను అదుపులో ఉంచుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
