Latest Updates
-
మీరు ఏ వంట నూనె వాడతారు.. ఆరోగ్యానికి ఎక్కువ ఏది మేలు చేస్తుందో తెలుసా.? -
ఆన్లైన్లో విపరీతంగా ఆభరణాలు కొంటున్నారా.. 'మెరిసే' నగలతో మోయలేని ఆరోగ్య సమస్యలు.! -
మీ భాగస్వామి ఈ విషయాల్లో మీకు దూరంగా ఉంటున్నారా.. ఈ సంకేతాలతో చాలా డేంజర్.! -
ఆలూ పరోటాకి మించిన రుచితో ఉల్లి పరోటా.. బరువు తగ్గాలనుకునేవారికి బెస్ట్ డైట్ ఫుడ్ ! -
భోజనం చేసిన వెంటనే కడుపు నొప్పిగా ఉంటుందా.?.. ఈ వ్యాధులకు సంకేతం కావచ్చు.! -
ఆషాఢం బల్కంపేటలో వైభవం.. నేడు ఘనంగా ఎల్లమ్మ తల్లి కళ్యాణం.. ‘జలదుర్గ’ విశేషాలివే.! -
వక్ర గతిలోకి శని గ్రహం.. ఈ నెల 28 వరకు ఈ 3 రాశుల వారికి కష్టాలు తప్పవు.! -
అద్భుతమైన విందు భోజనం కావాలా? అయితే ఈ కోకనట్ మిల్క్ మటన్ పులావ్ ట్రై చేయాల్సిందే -
ప్రోటీన్ రిచ్ రాగి పనీర్ పరాఠా..షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో,బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..ఈజీగా చేసుకోండిల -
పని వేళలు కాదు.. పని పూర్తయ్యేవరకు ఉండాల్సిందే.. బ్యాంకు గేటుకు తాళం వేసిన మేనేజర్.. వైరల్ వీడియో.!
అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. వారం ముందే చెప్పిన జ్యోతిష్కురాలు..దాని వల్లనే ఇదంతా!
గురువారం గుజరాత్ రాష్ట్రంలో అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ సమీపంలో ఎయిర్ ఇండియా విమానం కూలిపోయిన ఘటన యావత్ దేశాన్ని షాక్ కు, దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ విమానంలో సిబ్బంది,ప్రయాణికులతో కలిపి మొత్తం 242 మంది ఉండగా..విశ్వాస్ కుమార్ రమేష్ అనే ఒకే ఒక్క బ్రిటీష్ పౌరుడు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ విమాన ప్రమాదంలో మరణించిన వారిలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా ఉన్నారు. అయితే విమానంలో ఉన్నోళ్లు మరణించడమే కాకుండా ఈ విమానం ఓ మెడికల్ కాలేజీ హాస్టల్ లోకి దూసుకెళ్లడంతో ఆ హాస్టల్ మెస్ లో మధ్యాహ్నాం పూట భోజనం చేస్తున్న 35మందికి పైగా మెడికల్ విద్యార్థులు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఈ విమాన ప్రమాదం వల్ల ఇంకెంతమంది ప్రాణాలు కోల్పోయారో ఇంకా తెలియాల్సి ఉంది. శిథిలాల కింద నుంచి మృతదేహాల వెలికితీత కొనసాగుతుంది.
ఒక జ్యోతిష్కురాలు ఈ సంఘటనను ముందే ఊహించారని మీకు తెలుసా? ఆమె జోస్యం నిజమవడం అందరినీ షాక్ కు గురిచేసింది. @AstroSharmistha అనే ట్విట్టర్ అకౌంట్ లో శర్మిష్ఠ అనే జ్యోతిష్కురాలు..ఎయిరిండియా విమాన ప్రమాదాన్ని ముందే ఊహించింది. జూన్ 5,2025నే ఆమె దీనికి సంబంధించి ఓ హెచ్చరిక ట్వీట్ కూడా ఆమె చేసింది. ఇప్పుడు ఆమె పోస్ట్ వైరల్ గా మారింది.

వాస్తవానికి శర్మిష్ఠ 2024 డిసెంబర్ 29నే విమాన ప్రమాదానికి సంబంధించి ఎక్స్ లో ఓ ట్వీట్ చేసింది. 2025 విమానయాన రంగానికి మంచిదే కానీ విమాన ప్రమాద వార్తలు దిగ్భ్రాంతికి గురి చేస్తాయని చెప్పిన ఆమె ఈ నెల 5వ తేదీన మళ్లీ దీని గురించి హెచ్చరించారు. మృగశిర నక్షత్రం, ఆర్ధ్ర నక్షత్రాల్లో బృహస్పతి సంచారం వల్ల ఇది జరుగుతుందని ఆమె ఊహించారు. అయితే విమాన ప్రమాదం గురించి ఆమె వేసిన అంచనా నిజమవడంతో ఆమె పోస్టులు వైరల్ అవుతున్నాయి.
అంగారక యోగం: ప్రమాదాలకు కారణమా?
అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదం ప్రమాదం కేవలం సాంకేతిక లోపాలనే కాకుండా జ్యోతిష్య అంచనాలను కూడా నిజం చేసిందని జ్యోతిష్యుడు దీపక్ దూబే తెలిపారు. జ్యోతిష్యుడు దీపక్ దూబే ప్రకారం.. కుజుడు, కేతువు ఒకే రాశిలో కలిసినప్పుడు అంగారక యోగం ఏర్పడుతుంది. ఈ యోగం అగ్ని ప్రమాదాలు, పేలుళ్లు, మెరుపులు, భయంకరమైన విమాన ప్రమాదాలకు దారితీస్తుందని ఆయన చెప్పారు. అంగారకః అనే పదం అగ్నిని సూచిస్తుంది. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో భారీ మంటలు చెలరేగి పెద్ద ఎత్తున ప్రాణనష్టం సంభవించడం ఈ యోగానికి సరిగ్గా సరిపోతుంది.
సింహరాశిలో అంగారక యోగం మరింత వినాశకరం
అంగారక యోగం సింహరాశిలో ఉన్నప్పుడు అది అత్యంత ప్రమాదకరమని దీపక్ దూబే అంటున్నారు.ప్రస్తుతం ఈ యోగం సింహరాశిలోనే ఉంది.. కుజుడు కేతువు నక్షత్రంలో కేతువుతో కలిసి ఉన్నాడు. ఇదే సమయంలో కుజుడు, శని మధ్య ఖడాష్టక యోగం ఏర్పడటం ఈ పరిస్థితిని మరింత క్లిష్టతరం చేస్తుంది. సింహరాశి సూర్యునికి చెందినది కావడం.. కుజుడు కూడా అగ్ని కారకుడు కావడంతో ఈ గ్రహ స్థితులు కలిసి వినాశకరమైన ఫలితాలను ఇస్తాయని ఆయన అంటున్నారు.

అంగారక యోగం ప్రభావం, భవిష్యత్తు హెచ్చరికలు
పండిట్ దీపక్ దూబే ప్రకారం అంగారక యోగం జూన్ 7, 2025 నుంచే అమలులో ఉంది. అంటే ఈ ప్రమాదం జరగడానికి దాదాపు వారం రోజుల ముందు నుంచే పెద్ద ప్రమాదం సంభవించే అవకాశం ఉందని అంచనా వేయబడింది. అంగారక యోగం ఉన్నప్పుడు పెద్ద పేలుళ్లు జరిగే అవకాశాలు ఎక్కువని ఆయన అన్నారు. సింహరాశిలో ఈ యోగం ఏర్పడితే భయంకరమైన ప్రమాదాలు ఖచ్చితంగా జరుగుతాయని స్పష్టం చేశారు. ఈ అంగారక యోగం జులై 28 వరకు ఉంటుందని కాబట్టి భవిష్యత్తులో కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని దీపక్ దూబే హెచ్చరించారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications