Latest Updates
-
పెళ్లిళ్లలో వడ్డించే పూరీ మసాలా.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా ఇలా ఈజీగా చేసుకోండి..వేళ్లు నాకుతూ తినేస్తారు! -
కలియుగం ముగిసేది ఎప్పుడు? మనిషి ఆయుష్షు కేవలం 20 ఏళ్లేనా? -
పెళ్లిళ్లలో వడ్డించే కరకరలాడే చిల్లీ గోబీ.. అచ్చం అదే రుచితో ఇంట్లోనే ఈజీగా చేసేయండిలా.. -
కొల్హాపురి స్టైల్ కోడిగుడ్డు పులుసు..అన్నం, జొన్న రొట్టెలోకి అదిరిపోతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో పాము కాటుకి గురైతే ఏం చేయాలి? ఏం చేయకూడదు? -
ఈ వీకెండ్ కి నాన్వెజ్ వద్దా? నాన్ వెజ్ ను మించే రుచితో కాజు మసాలా ఈజీగా చేసుకోండిలా.. -
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.!
అక్షయ తృతీయ 2025.. రాశి ప్రకారం మీ అదృఫ్టాన్ని పెంచే రత్నాలు, దానాలు ఇవే
హిందువులు, జైనులు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో అక్షయ తృతీయ ఒకటి. ఈ రోజున త్రేతాయుగం ప్రారంభమైందని నమ్ముతారు. మహాభారతం ప్రకారం పాండవులు ఈ రోజునే అక్షయ పాత్రను పొందారు.. భగీరధుడు గంగా నదిని భూమికి తెచ్చిందిన రోజు కూడా ఇదేనని చెబుతారు. విష్ణువు ఆరవ అవతారమైన పరశురాముడు జన్మించింది కూడా ఈ రోజునేనంట. ప్రతి ఏటా వైశాఖ మాసంలోని శుక్ల పక్ష తృతీయ రోజున ఈ పండుగ వస్తుంది. ఈ ఏడాది ఏప్రిల్ 30వ తేదీన బుధవారం నాడు అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటారు. ఈ రోజు చాలా శుభప్రదమైన రోజుగా పరిగణి్ంచబడుతుంది.
అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవి, విష్ణువును ఈ రోజున పూజిస్తారు. ఈ పవిత్రమైన రోజున బంగారం కొనడం లేదా పెట్టుబడులు పెట్టడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఈ రోజున చేసే దాన ధర్మాలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అక్షయ తృతీయ తిథి ఏప్రిల్ 29,2025 సాయంత్రం 5: 31 గంటలకు ప్రారంభమై..ఏప్రిల్ 30, 2025 మధ్యాహ్నాం 2: 12 వరకు ఉంటుంది. బంగారం కొనుగోలు చేసేందుకు శుభసమయం..ఏప్రిల్ 30 ఉదయం 5: 51 నుండి మధ్యాహ్నాం 2: 12 వరకు. ఈ సమయంలో బంగారం కొనడం శుభప్రదంగా ఉంటుందని పండితులు తెలిపారు. అయితే మీ రాశి ప్రకారం అక్షయ తృతీయ రోజున ఏం కొనుగోలు చేయాలి, ఏం దానం చేయాలో పండితులు సూచించారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

మేష రాశి
కొనుగోలు చేయవలసిన రత్నం: కెంపు లేదా రూబీ. ఇది ధైర్యం, పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది.
ఏమేం దానం చేయాలి: ఎరుపు రంగు కందిపప్పు. ఇది ఆర్థిక స్థిరత్వాన్ని తెస్తుంది
వృషభ రాశి
కొనుగోలు చేయవలసిన రత్నం: ఎమరాల్డ్ లేదా పచ్చ. ఇది అదృష్టం, మానిసిక సృష్టతను ఇస్తుంది.
దానం చేయవలసినవి: పాలు, తెల్ల బియ్యం. ఇది ఆరోగ్యం, సంపదను కలిగిస్తుంది.
మిథున రాశి
కొనుగోలు చేయవలసిన రత్నం: పచ్చ. ఇది తెలివితేటలను పెంచుతుంది, కమ్యూనికేషన్ నైపుణ్యాలను మెరుగుపరుస్తుంది
దానం చేయవలసినవి: పెసరపప్పు. ఇది ఆర్థిక లాభాలను తెస్తుంది.
కర్కాటక రాశి
కొనుగోలు చేయవలసిన రత్నం: ముత్యం. ఇది మనశ్శాంతిని కలిగిస్తుంది. భావోద్వేగాలను అదుపులో ఉంచుతుంది
దానం చేయవలసినవి: బియ్యం. ఇది ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది.
సింహ రాశి
కొనుగోలు చేయవలసిన రత్నం: కెంపు. ఇది శక్తిని, నాయకత్వ లక్షణాలను పెంచుతుంది
దానం చేయవలసినవి: గోధుమలు. ఇది ఆరోగ్యం,శరేయస్సుని కలిగిస్తుంది.
కన్య రాశి
కొనుగోలు చేయవలసిన రత్నం: పచ్చ లేదా నీలం. ఇవి విశ్లేషణాత్మక నైపుణ్యాలను మెరుగుపరుస్తాయి. అదృష్టాన్ని కలిగిస్తాయి.
దానం చేయవలసినవి: ఆకు పచ్చ కూరగాయలు. ఇది మంచి ఆరోగ్యాన్నిస్తుంది.
తుల రాశి
కొనుగోలు చేయవలసిన రత్నం: వజ్రం లేదా తెల్లని నీలం. ఇవి సంబంధాలను మెరుగుపరుస్తాయి.
దానం చేయవలసినవి: చక్కెర, తెల్లని వస్త్రాలు. ఇది సామరస్యాన్ని కలిగిస్తుంది.
వృశ్చిక రాశి
కొనుగోలు చేయవలసిన రత్నం: ఎరుపు పగడం. ఇది ధైర్యాన్నిస్తుంది. నెగిటివ్ ఎనర్జీస్ లేదా ప్రతికూల శక్తుల నుంచి రక్షిస్తుంది.
దానం చేయవలసినవి: ఎర్రటి పండ్లు. ఇది శక్తినిస్తుంది.
ధనస్సు రాశి
కొనుగోలు చేయవలసిన రత్నం: పసుపు పుష్యరాగం. ఇది జ్ణానం, అదృష్టం, శ్రేయస్సుని కలిగిస్తుంది.
దానం చేయవలసినవి: శనగలు లేదా పసుపు రంగు వస్త్రాలు. ఇది జ్ణానాన్ని పెంచుతుంది.
మకర రాశి
కొనుగోలు చేయవలసిన రత్నం: నీలం. ఇది క్రమశిక్షణను,కష్టపతే తత్వాన్ని పెంచుతుంది.
దానం చేయవలసినవి: నల్ల నువ్వులు. ఇది అడ్డంకులను తొలగిస్తుంది.
కుంభ రాశి
కొనుగోలు చేయవలసిన రత్నం: నీలం లేదా అమెథిస్ట్. ఇవి మానసిక సృష్టతనిస్తాయి, కొత్త ాలోచనలు ప్రోత్సహిస్తాయి.
దానం చేయవలసినవి: నూనె. ఇది కష్టాలను తగ్గిస్తుంది.
మీనం
కొనుగోలు చేయవలసిన రత్నం: పసుపు పుష్కరాగం లేదా కనక పుష్యరాగం. ఇవి ఆధ్యాత్మికను పెంచుతాయి,అదృష్టాన్ని కలిగిస్తాయి.
దానం చేయవలసినవి: పసుపు రంగు ఆహార పదార్థాలు. ఇది శుభప్రదమైన ఫలితాలను ఇస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications