Latest Updates
-
2027లో బంగారం ధర ఎంత ఉంటదో తెలుసా? బాబా వంగా సంచలన జోస్యం! -
ముంబై ఫేమస్ బాంబే ఐస్ హల్వా.. ఇంట్లోనే ఈజీగా ఇలా తయారు చేసుకోండి -
జామ ఆకుల టీని రోజుకు ఒక్క కప్పు తాగితే చాలు.. ఈ 4 భయంకరమైన ఆరోగ్య సమస్యలు మాయం! -
అన్నం, చపాతీల్లోకి పర్ఫెక్ట్.. సొరకాయ కోఫ్తా కర్రీ ఇలా చేశారంటే కేక టేస్ట్! -
చలికాలంలో రోగనిరోధక శక్తిని పెంచే ఉసిరి జామ్..మీ ఇంట్లోనే సింపుల్ గా చేసుకోండిలా.. -
హెల్తీగా ఉంటాం, బరువు తగ్గొచ్చని ఓట్స్ తింటున్నారా? ఈ విషయం తెలియకుంటే డేంజర్ లో పడతారు! -
ఐరన్, విటమిన్స్ నిండిన మునగాకు గోధుమ దోసె..బరువు తగ్గాలనుకునేటోళ్లకి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్ -
ఫోన్ పగలగొట్టాడని తండ్రిని దారుణంగా చంపిన కూతురు! -
కాలిఫ్లవర్ తో ఇలా చేస్తే పకోడీ కూడా పనికిరాదు.. టేస్ట్ అదుర్స్! -
నడుము నొప్పితో విసిగిపోయారా? మీ వెన్నెముకను ఉక్కులా మార్చేసే చిట్కా ఇదే!
ఈ దీపావళికి ఇడ్లీలతో స్పైసీ బోటి పులుసు.. ఇలా చేస్తే రుచి అద్భుతం
పండుగ రోజున నాన్ వెజ్ తినని వాళ్లు కొందరు అయితే కొన్ని ప్రాంతాల్లో పండుగ సమయంలో నాన్ వెజ్ తినే అలవాటు ఉంటుంది. అయితే పండుగను బట్టి ఉంటుంది. దసరా, దీపావళి వంటి పండుగల సమయంలో ఆంధ్రాలోని చాలా ప్రాంతాల్లో నాన్ వెజ్ తినరు..అయితే అదే సమయంలో తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో నాన్ వెజ్ తింటారు.
ఈ ఏడాది నవంబర్ 8న దీపావళి పండుగ జరుపుకుంటున్నారు. దీపావళి పండుగ ఉదయం పూట వేడి వేడి మృదువైన ఇడ్లీలు లేదా కరకరలాడే దోశలతో పాటు ఘుమఘుమలాడే బోటి పలుసు ఉంటే ఆ మజాయే వేరు. ఇంట్లోనే తాజాగా వేయించిన మసాలా దినుసులు, కమ్మటి కొబ్బరి కలగలిపి రుబ్బిన మసాలా పేస్ట్ తో చేసే ఈ వంటకం అద్భుతమైన రుచిని సొంతం చేసుకుంటుంది. నోరూరించే బోటి పులుసు ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
మసాలా పేస్ట్ కోసం:
ధనియాలు - 4 టేబుల్ స్పూన్లు
సోంపు - 2 టీస్పూన్లు
జీలకర్ర - 2 టీస్పూన్లు
మిరియాలు - 2 టీస్పూన్లు
పచ్చి శనగపప్పు - 1 టేబుల్ స్పూన్
గరం మసాలా (చెక్క, లవంగాలు, యాలకులు)
జీడిపప్పు - 1 టేబుల్ స్పూన్
కరివేపాకు - కొద్దిగా
ఉల్లిపాయ - 1
టమాటా - 1
తురిమిన పచ్చి కొబ్బరి - ఒక గుప్పెడు
నూనె - వేయించడానికి సరిపడా
బోటి పులుసు కోసం:
శుభ్రం చేసిన బోటి - తగినంత
కొబ్బరి నూనె - తగినంత
హోల్ గరం మసాలా దినుసులు
ఉల్లిపాయ - 1
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1-2 టేబుల్ స్పూన్లు
కరివేపాకు - కొద్దిగా
పచ్చిమిర్చి - రుచికి సరిపడా
టమాటాలు - తగినన్ని
పసుపు - చిటికెడు
కాశ్మీరీ ఎర్ర కారం - తగినంత
కారం పొడి - తగినంత
ఉప్పు - రుచికి సరిపడా
కొత్తిమీర - కొద్దిగా
చలికాలంలో రోగనిరోధక శక్తిని పెంచే ఉసిరి జామ్..మీ ఇంట్లోనే సింపుల్ గా చేసుకోండిలా..
తయారీ విధానం
-ఒక పాన్ లో కొద్దిగా నూనె వేడి చేసి.. ధనియాలు, సోంపు, జీలకర్ర, మిరియాలు, శనగపప్పు, గరం మసాలా దినుసులు, జీడిపప్పు, కరివేపాకు, ఉల్లిపాయ, టమాటా ముక్కలు,తురిమిన కొబ్బరి వేసి పచ్చివాసన పోయేలా దోరగా వేయించాలి. ఇవి చల్లారాక మిక్సీ పట్టి మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి.
-బోటిని చాలా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. మరుగుతున్న నీళ్లలో కొద్దిగా పసుపు, ఉప్పు వేసి బోటిని సుమారు 15 నిమిషాల పాటు ఉడికించాలి. ఆ తర్వాత నీటిని వంపేసి, చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
-ప్రెషర్ కుక్కర్ లో కొద్దిగా కొబ్బరి నూనె వేడి చేయాలి. అందులో గరం మసాలా దినుసులు, తరిగిన ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి బాగా వేయించాలి. ఇప్పుడు తరిగిన టమాటా ముక్కలు, పసుపు, కాశ్మీరీ కారం, కారం పొడి వేసి అన్నీ కలిసేలా బాగా మగ్గనివ్వాలి. తర్వాత ఈ మిశ్రమంలో సగం ఉడికించిన బోటి ముక్కలను వేసి, మసాలా బాగా పట్టేలా 5 నిమిషాల పాటు వేయించాలి.
-ఆ తర్వాత ముందుగా రుబ్బి పెట్టుకున్న మసాలా పేస్ట్, గ్రేవీకి సరిపడా నీళ్లు పోసి బాగా కలపాలి. కుక్కర్ మూత పెట్టి సుమారు 15 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.
-ప్రెషర్ అంతా పోయాక మూత తీసి, సన్నగా తరిగిన కొత్తిమీర, కరివేపాకు చల్లుకోవాలి.
-దీపావళి ఉదయం వేడి వేడి ఇడ్లీలు లేదా కరకరలాడే దోశలతో ఈ బోటీ పులుసు కలిపి తింటే కేక అనాల్సిందే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
