Latest Updates
-
ప్రోటీన్ రిచ్ రాగి పనీర్ పరాఠా..షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో,బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..ఈజీగా చేసుకోండిల -
పని వేళలు కాదు.. పని పూర్తయ్యేవరకు ఉండాల్సిందే.. బ్యాంకు గేటుకు తాళం వేసిన మేనేజర్.. వైరల్ వీడియో.! -
స్నానం చేసేటప్పుడు మొదట ఏ భాగంపై నీళ్లు పోయాలి.?.. ఆయుర్వేదం ప్రకారం సరైన పద్ధతి ఏంటో తెలుసా.? -
తెలంగాణలో ఘనంగా బోనాల వేడుకలు.. ఆధ్యాత్మిక రహస్యం, చరిత్ర ఇదే.! -
మదురై స్పెషల్ మటన్ దోశ.. ఇలా చేస్తే జన్మలో ఆ రుచిని మర్చిపోలేరు! -
సూర్యగ్రహణం 2026..గ్రహణానికి ముందు, తర్వాత చేయాల్సిన పనులివే! -
డ్రై ఫ్రూట్స్ రోజుకు ఎన్ని తినాలో తెలుసా? ఆ తప్పు చేస్తే ప్రమాదమే! -
డెలులు డేటింగ్.. మీరూ ఇలాంటి భ్రమల్లో బతుకుతున్నారా.? -
పెనంపైనే రెస్టారెంట్ స్టైల్ లో.. దూదిలాంటి మెత్తని గార్లిక్ నాన్ చేసేయండిలా! -
మీ కళ్ల ముందే ఎవరైనా కుప్పకూలిపోతే వెంటనే ఏం చేయాలి?
ఏపీ ఎన్నికలపై జ్యోతిష్యులు ఏమంటున్నారు..? రాశి చక్రాన్ని బట్టి ఎవరు గెలుస్తారు..?
జ్యోతిష్యులు వ్యక్తుల జాతకాలు మాత్రమే కాదు రాష్ట్రాల రాజకీయ భవిష్యత్తును అంచనా వేయగలరు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్ధులు రాశులను బట్టి, వారు జాతక చక్రాన్ని బట్టి పరిస్థితిని కాలాన్ని అంచనా వేసి అధికారంలోకి ఎవరు రాబోతున్నారోజ జ్యోతిష్య పండితులు ముందుగానే ఒక అంచనా వేశారు. కేవలం కొందరి జ్యోతిష్యుల మినహా దాదాపు వారు చెప్పిన విధంగానే ఫలితాలు ఎన్నో ఏళ్ల నుంచి వస్తున్నాయ్. ఈసారి కూడా జ్యోతిష్యులు చెప్పినట్టుగానే జరగనుందా వేచి చూడాలి.
ఎన్నికలపై జ్యోతిష్యం ఏం చెబుతుంది ?
దేశంలో జనరల్ ఎలక్షన్‌కు సంబంధించిన పోలింగ్ జూన్ 1తో ముగిసిపోయింది. ఇక ఫలితాలు వెలువడ్డం ఒక్కటే వుంది. అటు లోక్‌సభ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయ్, ఈన్నికల్లో ఎవరు గెలుస్తారనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొని వుంది. ఈ గ్యాప్‌లో ఎక్జిట్ పోల్ ఫలాతాలు విడుదలవుతూ వున్నాయ్. కానీ ఎక్జిట్ పోల్స్ కన్నా కూడా జ్యోతిష్యుల పోల్స్‌కే ఎక్కువ ప్రాధాన్యత లభిస్తోంది.
ఎన్నికల నిబంధలను బట్టి ఎక్జిట్ పోల్స్‌ను వోటింగ్ పూర్తయ్యే వరకు ఇవ్వరాదు. కానీ జ్యోతిష్య పోల్స్‌కు ఇలాంటి నిబంధనలు ఏవీ లేకపోవడంతో జ్యోతిష్యులు రాష్ట్ర దేశ ఎన్నికలపై తమ జ్యోతిష్యం ఏమి చెబుతుందో వెళ్లడిస్తున్నారు.
ప్రముఖ జ్యోతిష్యులు వేణు స్వామి గురించి అందరికీ తెలిసిందే ఆయన సెలబ్రెటీలను జ్యోతిష్యం చెబుతుంటారు. ఆయన అపాయింట్‌మెంట్ దొరకడం చాలా కష్టం. అలాంటి ప్రముఖ జ్యోతిష్యులు ఎన్నికలపై తన అభిప్రాయాన్ని చెప్పారు. వైసీపీ చాలా తక్కువ మెజారిటీతో మళ్లీ అధికారంలోకి వస్తుందని వేణు స్వామి జ్యోతిష్యం చెప్పాడు. సీఎం జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాన్ జాతకాలను పరిశీలించి వేణు స్వామి ఈ రిపోర్ట్ ఇచ్చారు.

మరో ప్రముఖ జ్యోతిష్యులు ఉపదృష్ట నాగాదిత్య కూడా తన అభిప్రాయాన్ని చెప్పారు. ఈయన కూడా సెలబ్రెటీలకు జ్యోతిష్యాన్ని చెబుతాడు. ఈయన చెప్పేది వేణు స్వామి చెప్పేదానికి కొంత భిన్నంగా వుంది. ఈ చెప్పిన ప్రకారం టీడీపీ, జనసేన కలిసి అధికారంలోకి వస్తుందని అన్నారు. వైసీపీకి 100 స్థానాలకు పైగానే ఫలితాలు వస్తాయని అంటున్నారు.
ఇక మరో జ్యోతిష్యుడు కప్పగంతు శ్రీరామకృష్ణ శర్మ కూడా ఏపీ రాష్ట్ర ఫలితాలపై తన అభిప్రాయాన్ని వెళ్లడించారు. ఈయనకు ఎన్నో ఏళ్ల నుంచి పంచాంగం రాయం అనుభవం వుంది. ఈయన లెక్క ప్రకారం వైసీపీనే మళ్లీ అధికారంలోకి వస్తుందని అంటున్నారు.
రాజులు తీసుకునే నిర్ణయాలను బట్టి ఆ రాజ్యం భవిష్యత్తు వుంటుంది. ఎవరు పట్టాభిషక్తులు కావాలన్నది కూడా అప్పటి కాలంలో పండితులు జ్యోతిష్యాన్ని ఆధారం చేసుకొని చూసేవారు. ఇప్పుడు కూడా ఎన్నికలు జరిగినా ఫలితాలు మాత్రం జ్యోతిష్యం, గ్రహాల ప్రభావం, రాశి చక్రం ఆధారంగానే వస్తాయ్. దీన్ని ఎవ్వరూ మార్చలేదని ప్రముఖ జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications