జూన్‌లో గ్రహాల మార్పులు.. ఏ తేదీన ఏ రాశి వారికి ఎలా ఉందంటే.!

ఈ ఏడాది జూన్‌ నెల చాలా మంది జీవితాల్లో మార్పులు తీసుకురాబోతుంది. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా కొత్త అవకాశాలు అందిపుచ్చుకునే సమయంలో గ్రహాల సంచారం ప్రతిఫలాలనిచ్చేందుకు సిద్ధమైందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆ నెలలో ఒక్కో రోజు ఒక్కో రాశి వారికి అనుకూలంగా మారనుంది. ఆ తేదీలేంటో ఇక్కడ చూద్దాం.

astrology says june planetary transits each day has its own luck for each zodiac sign

మేష రాశి జూన్ 13న చాలా కలిసివస్తుంది. ఆ రోజు శుక్రుడు సింహరాశిలోకి ప్రవేశించడం వల్ల ఆ ఉగ్రమైన శక్తి క్రియేటివిటీ, ప్రేమానుబంధాల దిశగా మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది. కొత్త అనుభవాలను స్వీకరించడానికి ఇది సరైన సమయం. ఆత్మవిశ్వాసంతో ఉంటూ ఏ పనిలోనూ వెనుకడుగు వేయకుండా జీవితాన్ని సంపూర్ణంగా ఆస్వాదించాలని జ్యోతిష్యులు చెబుతున్నారు.

వృషభ రాశి వారికి జూన్‌ 29న పౌర్ణమి రోజున వినూత్న మార్పులు ఎదురయ్యే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఆ రోజు వారికి అత్యంత అదృష్టకరమైన రోజు. రోజువారీ పనులు కాకుండా కొత్త అధ్యాయాన్ని చూస్తారు. వృత్తిపరంగా, ప్రయాణాల పరంగా సానుకూల మార్పులు అకస్మాత్తుగా చోటుచేసుకుంటాయి. ఈ మార్పులను సంతోషంగా స్వీకరించాలి.

జూన్‌ 5న గ్రహశకలం కుంభరాశిలోకి తిరోగమనం చెందినప్పుడు మిథున రాశి వారికి అదృష్టం వరిస్తుంది. ఈ కారణంగా మీ జీవితంలో ఎదురయ్యే పరిణామాల్లో ఏది ముఖ్యమో అర్థం చేసుకోవడానికి దోహదపడుతుంది. దీర్ఘకాలిక లక్ష్యాల వైపు అడుగులు వేస్తారు. సంబంధాలు మెరుగుపడతాయి. భావోద్వేగ నిర్ణయాల పరంగా మీరు క్లారిటీగా ఉన్నట్లయితే అదే మీ బలం.

జూన్‌ 8న కర్కాటక రాశి వారికి విముక్తి లభిస్తుంది. రిలేషన్స్‌, వ్యక్తిగతంగా, వృత్తిపరంగా బలమైన భావోద్వేగాలను పొందుతారు. వీరు భయాలను వదిలివేసి భవిష్యత్తు వైపు సంతోషంగా ప్రయాణించేలా గ్రహాల సంచారం ప్రోత్సహిస్తుంది.

జూన్‌ 19న సింహరాశికి అత్యంత అదృష్టకరమైన రోజు. ఆత్మగౌరవాన్ని పునరుద్ధరించుకుంటారు. మీ విలువ పెరుగుతుంది. కెరీర్‌, లీడర్‌షిప్‌ అవకాశాలు ఊహించని విధంగా వస్తాయి. దీర్ఘకాలిక విజయానికి ఆత్మవిశ్వాసమే కీలకంగా మారుతుందని గమనించాలి.

కన్యా రాశి వారికి జూన్ 28 కలిసి వస్తుంది. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా బలమైన నిర్ణయాలు తీసుకునే స్కిల్స్‌ మీకు అందుతాయి. వీరు ముఖ్యంగా వృత్తిపరంగా గొప్ప పురోగతి సాధించవచ్చు. అయితే, ముఖ్యంగా పని మరియు వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యత పాటించడం ముఖ్యం.

తులా రాశి వారికి జూన్‌ 21 సంతృప్తికరమైన రోజు. సూర్యుడు, బృహస్పతి కలిసి మీ వృత్తిపరమైన లక్ష్యాలు, సమాజ గుర్తింపునకు దోహదపడతాయి. మీ కృషికి గుర్తింపుగా మీరు ఎదురుచూస్తున్న ప్రశంసలు, అవకాశాలను పొందుతారు. తులా రాశి వారికి అత్యంత అదృష్టకరమైన రోజు ఇది.

astrology says june planetary transits each day has its own luck for each zodiac sign


వృశ్చిక రాశి వారికి జూన్ 30న అతిపెద్ద పురోగతి లభిస్తుంది. ఉద్యోగాల్లో ప్రమోషన్స్, బదిలీలు, ప్రాజెక్టులు అకస్మాత్తుగా వచ్చి చేరుతాయి. అవకాశాలు వచ్చినప్పుడు ఈ రాశి వారు వేగంగా స్పందించి వాటిని స్వీకరించాలి.

ధనుస్సు రాశి వారికి జూన్‌ 13 కలిసి వస్తుంది. సాహసాలు చేయడానికి, కొత్త పనులు చేయడానికి.. స్వేచ్ఛాయుతంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఆకస్మిక మార్పులను స్వీకరించాలని జ్యోతిషులు చెబుతున్నారు. నిర్ణయాలు తీసుకున్నాక వాటి గురించి అతిగా ఆలోచించడం మానుకోవాలని చెబుతున్నారు.

జూన్‌ 21న మకర రాశి వారికి అదృష్టకరమైన రోజు. ఓర్పుగా ఉండటం కీలకం. చేసే పనిలో జాగ్రత్తగా ప్రణాళికలు వేసుకోవడం ద్వారా స్థిరమైన పురోగతి లభిస్తుంది. నిలకడపై దృష్టి సారించాలి. వృత్తిపరమైన ప్రాజెక్టులు, ఆర్థిక లక్ష్యాలు ఊపందుకుంటాయి.

జూన్‌ 14న కుంభరాశి వారికి శక్తివంతమైన రోజు. సృజనాత్మక కార్యకలాపాలు ప్రారంభిస్తారు. సంబంధాలు, ప్రయాణాల్లో మార్పులు చోటుచేసుకుంటాయి. వ్యక్తిగత స్వేచ్ఛ బలంగా ఉంటుంది. మీన రాశి వారికి జూన్‌ 1న సమస్త మద్దతు ఉంటుంది. ముఖ్యమైన వ్యక్తులతో తిరిగి అనుబంధాన్ని ఏర్పరుచుకుంటారు.

Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.

Desktop Bottom Promotion