Latest Updates
-
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.! -
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ! -
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.!
1st May Unlucky Zodiac signs: ఇవాళ అన్ని దరిద్రాలు ఈ 4 రాశులకే..జాగ్రత్త లేకుంటే పెద్ద ప్రమాదం!
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ప్రతి రోజూ గ్రహాల కదలికలు,నక్షత్రాల స్థానాల్లో మార్పులు ఉంటాయి. దీని కారణంగా కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు, మరికొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలు ఉంటాయి. ఇవాళ చంద్రుడు మిథున రాశిలో, సూర్యుడు మేషరాశిలో, రాహువు బుధుడు శుక్రుడు శని కలిసి మీనరాశిలో, బృహస్పతి వృషభరాశిలో,కేతువు కన్య రాశిలో,కుజుడు కర్కాటక రాశిలో ఉంటారు. ఇదే సమయంలో మృగశిర నక్షత్రం ఇవాళ మధ్యాహ్నాం దాకా ప్రభావవంతంగా ఉంటుంది..తర్వాత ఆర్థ నక్షత్రం తన ప్రభావాన్ని చూపిస్తుంది. యోగం విషయానికొస్తే ఇవాళ ఉదయం 8:34 వరకు అశుభకరమైన అతిగండ యోగం ఉంటుంది. దీంతో పాటు బిష్ణి కరణంగా ఉదయం 11: 23 వరకు కొనసాగుతుంది. ఇవాళ నాలుగు రాశుల వారికి ఇబ్బందులు ఉంటాయని జ్యోతిష్య పండితులు తెలిపారు.
కన్య రాశి
విశ్లేషణాత్మక దృక్పథం, అంకిత భావం,పరిపూర్ణత కోసం తపించే కన్య రాశి వ్యక్తులకు ఈ రోజు ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయని జ్యోతిష్య పండితులు చెప్పారు. అన్ని విషయాల్లో గందరగోళం నెలకొంటుంది. పనిలో పదే పదే అంతరాయలు,ఇబ్బందులు ఎదురవుతాయి. మీరు మంచిగా మాట్లాడినా కూడా అది బూతులా ఎదుటివారికి వినబడుతుంది. ఎదుటివారితో లేదా కుటుంబసభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని పండితులు సూచించారు. మానసిక ఒత్తిడి కూడా ఇవాళ బాగా పెరుగుతుంది. ఆరోగ్య ఇబ్బందులు కూడా ఉంటాయి. కడుపు సంబంధిత సమస్యలు, చర్మ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఈ రోజు ఉంటుంది. నాడీ సంబంధిత బలహీనత కూడా వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉండొచ్చు.

సింహ రాశి
నాయకత్వ లక్షణాలు, ఆత్మ విశ్వాసం, ప్రకాశవంతమైన వ్యక్తిత్వం, సృజనాత్మకత కలిగిన సింహరాశి వ్యక్తులకు ఈ రోజు ఇబ్బందికరంగా ఉంటుంది. ఏ పని చేపట్టినా అది ప్రతికూల ఫలితాలను కలిగిస్తుంది. పనిలో జాప్యం జరుగుతుంది. ఈ రోజు మీరు తీసుకునే నిర్ణయాలు తప్పుగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మానసిక అస్థిరత ఉంటుంది. ఆఫీసులో లేదా పని ప్రదేశంలో తోటి ఉద్యోగులతో గొడవలు ఉండే అవకాశముంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. ఇవాళ ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిదని, ఆర్థిక లావాదేవీకు కూడా దూరంగా ఉండాలని అగ్రిమెంట్లపై సంతకాలు చేయకపోవడం మంచిదని సూచిస్తున్నారు. అయితే మీ ఆత్మవిశ్వాసంతో ఈ రోజు ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొంటారని చెప్పారు.
తుల రాశి
ఆకర్షణీయమైన వ్యక్తిత్వం, సామాజిక సృహ,రాజకీయ చతురత, న్యాయబుద్ది కలిగిన తుల రాశి వ్యక్తులు ఈ రోజు వాహనం నడిపే విషయంలో అయినా లేదా మరే విషయంలో కూడా నిర్లక్ష్యం ఉంటే తీవ్ర ప్రమాదం తప్పదని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. ప్రతికూల ప్రభావాల కారణంగా ఎమోషనల్ అయ్యి సరిలేని నిర్ణయాలను తీసుకునే అవకాశం ఉంటుంది. చాలా లోతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని సూచిస్తున్నారు. వివాహ బంధం, ప్రేమ సంబంధాల్లో గందరగోళ పరిస్థితులు ఉంటాయని తెలిపారు. పెద్ద నిర్ణయాలకు దూరంగా ఉండటం మంచిదని సూచిస్తున్నారు.
వృశ్చిక రాశి
ఇవాళ వృశ్చిక రాశి వ్యక్తులు గడ్డు పరిస్థితులు ఎదుర్కోక తప్పదని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. గ్రహాల మార్పులు, యోగ ప్రభావం కారణంగా ప్రతికూల ఫలితాలు ఉంటాయని దీని వల్ల ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాయని తెలిపారు. వీలైనంతవరకు ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిదని తెలిపారు. భావోద్వేగానికి గురై తప్పుడు నిర్ణయాలను తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. కాబట్టి ఏ నిర్ణయమైనా తీసుకునేముందు ఒకటికి 10సార్లు ఆలోచించాలని సూచించారు. ఎమోషనల్ గా ఉన్నసమయంలో ఏ నిర్ణయం తీసుకోకూడదని తెలిపారు. సంబంధాలలో కూడా ఉద్రికత్త ఉండే ఛాన్స్ ఉంది. హానికర పరిస్థితులు ఈ రోజు మొత్తం ఉంటాయి కాబట్టి ఏ పని చేసినా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications