Latest Updates
-
కొల్హాపురి స్టైల్ కోడిగుడ్డు పులుసు..అన్నం, జొన్న రొట్టెలోకి అదిరిపోతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో పాము కాటుకి గురైతే ఏం చేయాలి? ఏం చేయకూడదు? -
ఈ వీకెండ్ కి నాన్వెజ్ వద్దా? నాన్ వెజ్ ను మించే రుచితో కాజు మసాలా ఈజీగా చేసుకోండిలా.. -
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.!
షడష్టక యోగం వల్ల నవంబర్ 11 నుంచి ఈ 3 రాశుల జీవితాలు మారనున్నాయి!
నవగ్రహాల గమనానికి మూలమైన సూర్యుడు, గురు గ్రహంతో కలిసి తన గమనాన్ని మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈనెల 11వ తేదీ ఉదయం 6.30 గంటలకు ఈ రెండు గ్రహాలు తమ గమనాన్ని మార్చుకోనున్నాయి. ఈ రెండు గ్రహాల గమనంలో మార్పుల కారణంగా మూడు రాశుల జాతకాలు మారనున్నాయి. వారి జీవితంలో వెలుగులు నిండనున్నాయి. వారికి అదృష్టం ప్రకాశించనుంది. అలాగే వారికి షడష్టక యోగం ఏర్పడనుంది. అయితే ఆ రాశులు ఏంటి? ఈ యోగం కారణంగా వారికి ఎలాంటి ప్రయోజనాలు చేకూరనున్నాయనేది ఈస్టోరీలో తెలుసుకుందాం.
మేష రాశి
ఈ రెండు గ్రహాల సంచారంలో మార్పుల కారణంగా షడష్టక యోగం ఏర్పడుతుంది. దీని కారణంగా మేషరాశి వారు చాలా బాగా లాభపడతారు. ముఖ్యంగా ఆర్ధిక వ్యవహారాల్లో వారికి అన్ని కలిసి వస్తుంది. ఆర్థికంగా వారి జీవితంలో పురోగతి కనిపిస్తుంది. పెట్టుబడుల్లో భారీగా లాభాలు వచ్చే అవకాశం ఉంది. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉద్యోగంలో ఉన్న వారికి పదోన్నతి లభించనుంది. రుణాలు తీరిపోవడంతో పాటు ఆర్ధిక మార్గాలు పెరగనున్నాయి. చేపట్టిన పనులన్నీ విజయవంతమవుతాయి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.

కర్కాటక రాశి
సూర్య భగవానుడు, గురువు గ్రహాల గమనంలో మార్పుల కారణంగా ఏర్పడే షడష్టక యోగం వల్ల కర్కాటక రాశి జాతకులు తమ జీవితంలో సుఖ సంతోషాలు, శాంతిని పొందుతారు. ఉద్యోగులకు ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే కార్యాలయంలో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. ఈ సమయంలో మీలోని నైపుణ్యాలను ప్రదర్శించేందుకు అద్భుతమైన సమయం. చేపట్టిన పనులన్నిటిలో విజయాన్ని చవిచూస్తారు. వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి. బంగారం, ఇల్లు, భూములు కొనే సూచనలు కనిపిస్తున్నాయి.
తులా రాశి
ఈ గ్రహాల గమనం కారణంగా ఏర్పడే షడష్టక యోగం వల్ల తులారాశి వారి జీవితం మూడు పూలు ఆరు కాయలుగా మారనుంది. దీని కారణంగా ఈ రాశి వారు మంచి ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందుతారు. బంధువుల మధ్య నెలకొన్న సమస్యలు, వివాదాలు పరిష్కారమవుతాయి. ఆర్ధిక సమస్యలన్నీ తిలిగిపోయి ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు. విదేశాలకు వెళ్లాలని అనుకునే వారికి చాలా మంచి అవకాశాలు దొరుకుతాయి.
ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. వ్యాపారం ప్రారంభించాలని అనుకునే వారికి ఇది అద్భుతమైన సమయం. వారికి చాలా గొప్ప అవకాశాలు లభిస్తాయి. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. విద్యార్థులు విద్యలో మెరుగ్గా రాణిస్తారు. ఎవరికీ హాని చేయకుండా, తమ పనిని తామే జాగ్రత్తగా నిర్వహించుకుంటే ఈ రాశివారికి అంతా మంచే జరుగుతుంది.
గమనిక: ఈ కథనంలో మేము పొందుపరిచి అంశాలు, విషయాలు జోతిష్యశాస్త్రం, పలు అధ్యయనాలు, ఇంటర్నెట్‌లో మాకు దొరికిన సమాచారం ఆధారంగా అందించబడింది. వీటి శాస్త్రీయతను మేము నిర్ధారించడం లేదు. పైగా జోతిష్యం అనేది మనిషిలోని ధైర్యాన్ని పెంపొందించేందుకు మాత్రమే ఉపయోగపడుతుంది. అందుకే ఈ కథనంలో విషయాలని విశ్వసించే ముందు, లేదా విశ్వసించాలన్నా తప్పనిసరిగా నిపుణుల సలహాలు తీసుకుంటే మంచిది. అప్పుడే మీకు తగిన ఫలితాలు దొరికే అవకాశం ఉంది. దీనిని విశ్వసించడం అనేది పూర్తిగా మీ బాధ్యత. బోల్డ్ స్కై తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications