Latest Updates
-
షుగర్ పేషెంట్లకు రోజులో ఎక్కువ డేంజరస్ టైం ఏది? బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ కి ఈజీ చిట్కాలు.. -
వర్క్ ఫ్రం హోంలో పెరుగుతున్న ఒత్తిడి.. ఆందోళన తగ్గేందుకు ఇలా చేయండి.! -
మెనోడివోర్స్ అంటే ఏంటి? నడివయసులో దాంపత్యం దారితప్పడానికి కారణమిదే.. -
పప్పులకు పురుగులు పడుతున్నాయా? ఈ ఒక్కటి వేస్తే చాలు ఏడాదైనా పాడవ్వవు! -
ప్రేమంటే రొమాన్స్ మాత్రమేనా.. ఎన్ని రకాలు ఉన్నాయో తెలిస్తే ఇట్టే లవ్లో పడిపోతారు.! -
త్వరగా ప్రెగ్నెన్నీ రావాలంటే..భార్యాభర్తలు తప్పక తినాల్సిన ఫ్రూట్ ఏది? -
వర్షాకాలంలో ఇంట్లో ఆ వాసన పోవాలంటే.. ఈ ఐదు జాగ్రత్తలు తప్పనిసరి.! -
కేవలం 1 స్పూన్ నూనెతో కుక్కర్ లో పానీ పూరీలు..డీప్ ఫ్రై లేకుండానే బండి మీది టేస్ట్! -
అభిజిత్ ముహూర్తం: ఈ రాశుల వారికి నేడు ధనయోగం.. పట్టిందల్లా బంగారం! -
ఎదుటి వ్యక్తిని ఈ నాలుగు ప్రశ్నలు అడుగుతున్నారా.. వారి దృష్టిలో మీ విలువ తగ్గినట్లే.!
డిసెంబర్ 31 కల్లా ఈ రాశి వారు ధనవంతులు అవుతారు.. కానీ ఇలా చేయాలి!
మనకున్న కోరికలు, ఆశయాలు నెరవేరాలంటే కేవలం శారీరక శ్రమ మాత్రమే కాదు, మన గ్రహ బలాలు కూడా బాగుండాలి. మనం చేసే కృషికి ఆ దేవుడు తోడు, కొంత అదృష్ట, గ్రహ బలం ఉంటేనే ఆ కార్యం సిద్ధిస్తుంది. మనం అనుకున్న కోరికలు, ఆశయాలు నెరవేరుతాయి. అయితే మరో రెండు నెలల్లో ఈ సంవత్సరం ముగుస్తుండడంతో.. కొన్ని రాశుల వారు తమ కలలు, ఆశయాలను నెరవేర్చుకోవడంలో ముందు ఉంటారు.
ఈ రాశుల అధిపతులు వారి వారి అనుకూల స్థానాల్లో సంచరిస్తున్నారు. దీని కారణంగా ఆయా రాశుల వారు తాము అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. అలాగే తమ కోరికలు నెరవేర్చుకొని ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. ఇంతకీ ఆ రాశులేమిటి, వారికి ఎలాంటి ప్రయోజనాలు చేకూరనున్నాయనేది ఇప్పుడు తెలుసుకుందాం.
ఏ రాశుల వారి కలలు నెరవేరతాయంటే!

వృషభ రాశి: ఈ రాశికి అధిపతి శుక్రుడు. దీని కారణంగా ఈ రాశి వారి కోరికలకు, ఆశలకు అసలు అంతే ఉండదు. ఆకాశాన్ని సైతం కావాలని అనుకుంటూ ఉంటారు. మరీ ముఖ్యంగా వీరిలో డబ్బు సంపాదించాలనే కోరిక అధికంగా ఉంటుంది. ఈ క్రమంలో డబ్బులు సంపాదించుకునేందుకు వీరు ఎలాంటి పనికైనా వెనకాడరు. ఎలాంటి కష్టమొచ్చినా పట్టు వదలని విక్రమార్కుడిలా ఆ పనిని పూర్తి చేసి డబ్బులు సంపాదిస్తారు.
ఆ పట్టుదలే మరో రెండు నెలల్లో ఈ రాశి వారిని సుసంపన్నులను చేసే అవకాశముంది. పైగా ఈ రాశి వారికి శుక్రుడు అధిపతి అయినందున కచ్చితంగా ఈ రాశి వారి కోరికలు మరో రెండు నెలల్లో నెరవేరనున్నాయి.
సింహ రాశి: ఈ రాశి వారికి అధిపతి రవి. రవి అధిపతిగా ఉన్న రాశి వారిలో పట్టుదల, సృజనాత్మకత చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి తమపై తమకు నమ్మకం కొంచెం ఎక్కువగానే ఉంటుంది. సింహరాశి వారిలో అత్యధిక మందికి అధికారం మీద మోజు ఉంటుంది.
ప్రస్తుతం వారికి అనుకూలమైన కాలం నడుస్తుందున వీరు.. అధికారం, వృత్తి వ్యాపారాల్లో ఆధిపత్యం, ఉద్యోగ జీవితంలో ఉన్నత జీవితం కోసం కస్టపడి అనుకున్నది సాధించే అవకాశముంది. మరో రెండు నెలల్లో ఈ రాశి వారికి ఈ సూచనలు కనిపిస్తున్నాయి.
ధనస్సు: ఈ రాశికి అధిపతి గురువు. గురువు భాగ్యం, విస్తరణకు సూచకంగా చెప్పుకుంటూ ఉంటారు. అందుకే ధనుస్సు రాశి వారిలో పట్టుదల, లక్ష్యాలను ఎంచుకునే గుణం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ లక్ష్యాలను సాధించే వరకు వీరు నిద్రపోరు కూడా. అందుకే ఈ రాశి వారికి గురువు అనుగ్రహం కొంచెం ఉన్నా.. మరో రెండు నెలల్లో ఈ సంవత్సరంలో వారు చేయాలనుకున్న పనులు పూర్తి చేసేస్తారు. వీరు అనుకున్న పనులు నెరవేరడంతో పాటు ధన లాభం కూడా అధికంగా ఉంటుంది.
కుంభం: ఈ రాశికి అధిపతి శనీశ్వరుడు. అందుకే ఈ రాశి వారిలో సరికొత్త మార్పులకు, సరికొత్త ఆలోచనల వైపు నడుస్తూ ఉంటారు. అందుకే తమ భవిష్యత్తుపై కాలానికనుగుణంగా ఆలోచనలు చేస్తూ ముందుకు సాగుతూ ఉంటారు. ఈ రాశి వారిలో ప్రజా సంబంధాలు మెరుగుపరుచుకోవడం, పాలన పరంగా గొప్ప స్థాయికి వెళ్లడం, సేవా రంగాల్లో గుర్తింపు తెచ్చుకోవడం వంటి కోరికలు ఉంటాయి. ఆ కోరికలు వీరి ముందడుగు ఆలోచనలు, లక్ష్య సాధన పట్టుదలతో మరో రెండు నెలల్లో నెరవేరనున్నాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications