Latest Updates
-
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.! -
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్!
Maha shivratri 2025: మహా శివరాత్రి రోజు ఏ రాశి వారు ఎలాంటి మంత్రం జపిస్తే పుణ్యం కలుగుతుందో తెలుసా?
హిందువులకు మహాశివరాత్రి అనేది అతిపెద్ద, అత్యంత గొప్ప పండగ. ఈరోజు శివ భక్తులందరూ ఉపవాసం ఉండడంతో పాటు రాత్రంతా జారగం చేస్తూ.. శివుడిని పూజిస్తుంటారు. ఈ సంవత్సరం మహా శివరాత్రి ఫిబ్రవరి 26వ తేదీన వస్తుంది. ఈ రోజున ప్రతి ఒక్కరూ శివుని పూర్తి ఆశీస్సులు పొందాలనుకుంటే, ప్రతి ఒక్కరూ తమ రాశి ప్రకారం కొన్ని మంత్రాలను పఠించాల్సిన అవసరం ఉంది. ఆ మంత్రాలు ఏంటి? వాటిని ఏ విధంగా మంత్రించాలి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మేష రాశి
మేష రాశి వారు "ఓం రుద్రాయ నమః" అనే మంత్రాన్ని జపించడం మంచిది. ఈ మంత్రాన్ని జపించడం ద్వారా, మీరు అన్ని రకాల బాధలు మరియు సమస్యల నుండి విముక్తి పొందవచ్చు.

వృషభ రాశి
వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులు "ఓం నమశివాయ నమః" అనే పంచాక్షరి మంత్రాన్ని పఠించడం ద్వారా అన్ని రకాల చెడుల నుండి విముక్తి పొందుతారు.
మిథున రాశి
మిథున రాశిలో జన్మించిన వ్యక్తులు "ఓం మహేశ్వరాయ నమః" అనే మంత్రాన్ని జపించడం ద్వారా శివుని అనుగ్రహంతో జీవితంలో మంచి పురోగతిని చూడవచ్చు. అలాగే తాము అనుకున్న లక్ష్యాలను సులభంగా సాధించగలుగుతారు.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారు మహా శివరాత్రి రోజున "ఓం నాగేశ్వరాయ నమః" అనే మంత్రాన్ని పఠించడం ద్వారా శని, రాహువు వలన కలిగే కాల సర్ప దోషం తొలిగిపోతుంది. అలాగే ఇతర చిన్న చిన్న దోషాల నుండి విముక్తి కలుగుతుంది.
సింహ రాశి
సింహ రాశి వారు "ఓం నమః శివాయ కలాం మహాకల్ కలాం కృపాలం ఓం నమః" అనే మంత్రాన్ని పఠించి శివుడిని పూజిస్తే వారి జీవితాల్లో సమస్యలు తగ్గుతాయి.
కన్య రాశి
కన్య రాశిలో జన్మించిన వ్యక్తులు "ఓం శ్రీకంఠాయ నమః" అనే శివ మంత్రాన్ని జపిస్తే వారి జీవితాల్లోని చీకటిని తొలగి, శివుని అనుగ్రహంతో సంపన్నమైన జీవితాన్ని గడపవచ్చు.
తులా రాశి
తుల రాశి వారు మహా శివరాత్రి రోజున శివుని అనుగ్రహంతో "ఓం నమః శివాయ గురు దేవే నమః" అనే మంత్రాన్ని జపించడం ద్వారా జీవితంలో కొత్త మార్గాలను, కొత్త అవకాశాలను పొందవచ్చు.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారు "ఓం చంద్రమౌళేశ్వర నమః" అనే శివ మంత్రాన్ని జపించడం ద్వారా ఆందోళన, నిరాశ, శారీరక లేదా మానసిక ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారు మహా శివరాత్రి రోజున "ఓం నమో భగవతే రుద్రాయ" అనే శివ మంత్రాన్ని పఠించాలి. ఈ మంత్రాన్ని జపించడం ద్వారా ధనుస్సు రాశి వారు తమ అంతర్గత బలాన్ని పెంచుకుంటారు.
మకర రాశి
మకర రాశిలో జన్మించిన వారు "ఓం శంభవే నమః" అనే మంత్రాన్ని జపించడం మంచిది. ఈ మంత్రాన్ని జపించడం వల్ల మీరు పనిలో మంచి విజయం సాధిస్తారు. శివుని ఆశీస్సులతో, దీర్ఘకాల కోరికలన్నీ నెరవేరుతాయి.
కుంభ రాశి
కుంభ రాశిలో జన్మించిన వారు "ఓం త్రయంబగం యజామహే సుగంతిం పుష్టివర్ధనం ఉర్వరుగమివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ మామృత్" అనే మంత్రాన్ని పఠించడం ద్వారా జీవితంలో ఎదుర్కొనే సమస్యల నుండి బయటపడవచ్చు. గరిష్ట ప్రయోజనాలను పొందడానికి రాత్రంతా మహా మృత్యుంజయ మంత్రాన్ని జపించడం మంచిది.
మీన రాశి
మీన రాశి వారు మహా శివరాత్రి నాడు "ఓం పాశుపాదయే నమః" అనే మంత్రాన్ని జపిస్తే, శివుని ఆశీస్సులతో వారు విజయం సాధించి, తమ లక్ష్యాలను సులభంగా సాధించగలరు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications