Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
DAILY HOROSCOPE 2024: నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారికి స్నేహితులతో ప్రమాదం ఉంది!
ఈరోజు రాశి ఫలాలు కొన్ని రాశుల వారికి అనుకూలంగా మరికొన్ని రాశుల వారికి ప్రతికూలంగా కనిపిస్తున్నాయి. కొన్ని రాశుల వారికి కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశాలున్నాయి. ఆ రాశులు ఏమిటి? సమస్యలను అధిగమించేందుకు ఎలాంటి పరిహారాలు చేయాలి, అనేది ఈ స్టోరీలో మనం తెలుసుకుందాం.
రాశి ఫలాలు తెలుసుకునే ముందు ముందుగా ఈరోజు శుభఘడియలను తెలుసుకుందాం.
శుభ ఘడియలు
వర్జ్యం: ఉ. 7-23 వరకు
అమృత ఘడియలు: మ. 2-50 నుంచి 4-20 వరకు
దుర్ముహూర్తం: ఉ. 11-22 నుంచి 12-09 వరకు
రాహుకాలం: మ. 12-00 నుంచి 1-30 వరకు

రాశి ఫలాలు
మేషరాశి: మనోబలంతో చేసే పనులు పూర్తవుతాయి. శత్రువులపై విజయం సాధించే అవకాశముంది. కుటుంబంలో చిన్నచిన్న సమస్యలు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దుర్గాదేవి ఆరాధన మంచి ఫలితాలను ఇస్తుంది.
వృషభ రాశి: ఈ రాశివారికి అంతా శుభకాలమే నడుస్తుంది. వారు అనుకున్న పనులను అనుకున్న విధంగా పూర్తి చేసుకోగలుగుతారు. తోటివారితో తమ సంతోషాన్ని పంచుకుంటారు. సమాజంలో కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి. ధన, వస్త్ర లాభాలు పొందుతారు. సూర్య నమస్కారం వల్ల ఇంకా మంచి ఫలితాలు పొందవచ్చు.
మిథున: ఈ రాశి వారికి వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాల్లో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. వారి అధికార పరిధి పెరుగుతుంది. పట్టుదలే ఆయుధంగా ముందుకు సాగుతూ.. మానసికంగా ధృడంగా ఉంటారు. శ్రీసుభ్రమణ్య స్వామిని ఆరాధించాలి.
కర్కాటక: ప్రారంభించిన పనులన్నీ పూర్తవుతాయి. ఆర్ధిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. కోపతాపాలకు వెళ్లొద్దు. ప్రతీ విషయాన్ని శాంతంగా ఆలోచించి, వ్యవహరించాలి. శ్రీసుబ్రమణ్యస్వామి సందర్శన మేలు చేస్తుంది.
సింహ రాశి: ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. మీ మీ రంగాల్లో ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగకపోతే సమస్యలు తప్పవు. అవసరానికి సహాయం చేసే వారు ఉంటారు. బంధుప్రీతి కలదు. స్థిరాస్తికి సంబంధించిన వ్యవహారాల్లో సత్ఫలితాలు పొందుతారు.
కన్యరాశి: ఈ రాశి వారికి కార్య సిద్ధి ఉంటుంది. ఈ రాశి వారికి ఈరోజు జరిగే కొన్ని సంఘటనల ద్వారా మానసిక ఆనందాన్ని పొందుతారు. ఈరోజు కన్య రాశి వారు మంచి పనులను ప్రారంభించే అవకాశముంది. లక్ష్య సాధనలో ఆత్మీయుల సహకారం అందుతుంది. గురు ధ్యానం మంచిది.
తులారాశి: వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్న తులారాశి వారు ఈరోజు శుభవార్తను వింటారు. కీలక విషయాల్లో పెద్దలను కలుస్తారు. శ్రీఅష్టోత్తర శతనామావళి చదివితే ఇంకా బాగుంటుంది.
వృచ్చిక: ఈ రాశి వారికి వారి వారి రంగాల్లో లాభదాయక ఫలితాలు కలుగుతాయి. దైవబలం తోడవుతుంది. కాలం సహకరించడంతో ఆశయాలు నెరవేరుతాయి. శ్రీలక్ష్మి సందర్శన ఉత్తమ ఫలితాలనిస్తుంది.
ధనుస్సు: ఈ రాశి వారికి సంపూర్ణ కార్యసిద్ధి ఉంటుంది. సంపూర్ణ మనోబలంతో ఉంటారు. వారి వారి రంగాల్లో విజయం సాధిస్తారు. శ్రీవిష్ణు సహస్ర పారాయణ చేయడం మంచిది.
మకరం: ఈ రాశి వారు వారి వారి రంగాల్లో విశేషమైన అనుకూలమైన ఫలితాలను పొందుతారు. మొహమాటం వల్ల వీరికి ఖర్చులు పెరుగుతాయి. ఒక శుభవార్త మనోధైర్యాన్ని పెంచుతాయి. శ్రీఆంజనేయస్వామి ఆరాధన శుభప్రదం.
కుంభం: ఈ రాశి వారు కస్టపడి చేస్తే తప్ప పనులు పూర్తి అవ్వవు. కీలక విషయాల్లో సొంత నిర్ణయాలు వికటిస్తాయి. శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. కీలక విషయాల్లో తోటివారి సహకారం తీసుకుంటే మంచిది. కొందరి ప్రవర్తన వల్ల ఇబ్బంది కలుగుతుంది. సమయాన్ని వృధా చేయడం మంచిది కాదు. నవగ్రహ ధ్యానం శ్లోకం చదవడం మంచిది.
మీన: బంధువులతో కొంత ఆచితూచి వ్యవహరించాలి. మీ మీ రంగాల్లో ఒత్తిడిని దరిచేయనివ్వొద్దు. కొన్ని వ్యవహారాల్లో ఓర్పు చాలా అవసరం. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications
