Latest Updates
-
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.! -
శరీరానికి చలవ చేసే కమ్మని కీరదోసకాయ దోశ..పిల్లల ఈవెనింగ్ స్నాక్ గా సూపర్! -
అల్సర్ తగ్గించి ఆకలిని పెంచే అద్భుతమైన తమిళనాడు వంటకం.. ఒక్కసారి తింటే జన్మలో వదిలిపెట్టరు.! -
గణేష్ నిమజ్జనం 2026: అనంత చతుర్దశి నాడు 4 మహా యోగాలు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే! -
పెర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.! -
ముంబై రోడ్ సైడ్ తవా పులావ్..మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
గొంతు నొప్పిని ఒక్క ముద్దతో తరిమేసే వెల్లుల్లి కారం పచ్చడి.. అసలు సిసలైన పద్ధతి ఇదే.! -
చిన్న వయసులోనే మెటబాలిక్ సిండ్రోమ్.. ఇది వ్యాధి కాదు.. కానీ ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
మీ పుట్టిన తేదీ ప్రకారం మీ స్నేహితులు, విరోధులు ఎవరో తెలుసా.. వీరితో కాస్త జాగ్రత్త.!
సంఖ్యా శాస్త్రం ప్రకారం ప్రతి వ్యక్తి స్వభావం, వ్యక్తిత్వం అనేది పుట్టినతేదీతో ముడిపడి ఉంటుంది. మూల సంఖ్య ఆధారంగా సదరు వ్యక్తి ఆలోచనా విధానం, ప్రవర్తన, సంబంధాల ప్రాధాన్యత తదితర అంశాలను వెల్లడిస్తుంది. ప్రతి మూల సంఖ్య ఒక్కో గ్రహంతో ముడిపడి ఉంటుంది. ఈ క్రమంలో మూల సంఖ్యల మధ్య కూడా అనుకూలతలు, అభిప్రాయభేదాలు ఉండొచ్చు. మరి ఇందులో మీ మూల సంఖ్య ఏది.. మీ సంబంధాలు ఎవరితో ఎలా ఉండనున్నాయో న్యూమరాలజీ ప్రకారం తెలుసుకుందాం..

మూల సంఖ్య- 1
నెల ఏదైనా సరే 1, 10, 19, 28వ తేదీల్లో జన్మించిన వారి రాడిక్స్ సంఖ్య ఒకటి. సూర్యుడితో సంబంధం ఉన్న ఈ సంఖ్య రోజున పుట్టిన వ్యక్తులు ఆత్మవిశ్వాసం, కష్టపడి పనిచేసే స్వభావం, క్రమశిక్షణతో ఉంటారు. తాము తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉంటారు. ఇలాంటి వారు 5, 9 మూల సంఖ్య ఉన్న వ్యక్తులతో స్నేహపూర్వకంగా ఉంటారు. కానీ 8వ రాడిక్స్ సంఖ్య ఉన్నవారితో అభిప్రాయ భేదాలు తలెత్తే అవకాశం ఉందని సంఖ్యా శాస్త్రం చెబుతోంది.
మూల సంఖ్య- 2
2, 11, 20, 29 తేదీల్లో జన్మించిన వారి రాడిక్స్ సంఖ్య- 2. వీరు భావోద్వేగపూరితంగా, ప్రశాంతంగా, ఆలోచనాత్మకంగా ఉంటారు. క్లిష్టమైన పరిస్థితుల్లోనూ ఓర్పుతో ఉండే గుణం ఉంటుంది. వీరు 3, 5 మూల సంఖ్య ఉన్నవారితో ఫ్రెండ్లీగా ఉంటారు. అయితే 4, 8, 9 వారితో అభిప్రాయాలు, ఆలోచనల పరంగా వ్యత్యాసం ఉంటుంది.
మూల సంఖ్య- 3
మీరు పుట్టిన తేదీ 3, 12, 21, 30 అయితే మీ రాడిక్స్ నంబర్- 3. వీరిలో తెలివితేటలు, వాక్చాతుర్యం, ధార్మిక భావాలు, ఉదార స్వభావం ఎక్కువగా ఉంటాయి. 1, 2, 9 మూల సంఖ్య ఉన్నవారితో ఈజీగా కలిసిపోగలరు. కానీ 6వ సంఖ్య ఉన్నవారితో విభేదాలు తలెత్తవచ్చు. వారితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి.

మూల సంఖ్య- 4
మీరు 4, 13, 22, 31 తేదీల్లో పుట్టినట్లయితే మీలో నిజాయతీ ఎక్కువగా ఉంటుంది. క్రమశిక్షణతో జీవితాన్ని గడుపుతారు. నియమాలను పాటిస్తారు. 6, 7 రాడిక్స్ నంబర్ వారితో స్నేహపూర్వకంగా ఉంటారు. 2, 9 ఉన్న వ్యక్తులతో ఆలోచనల పరంగా వైవిధ్యం ఉంటుంది.
మూల సంఖ్య- 5
5, 14, 23 తేదీల్లో పుట్టినవారిలో తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. ధైర్యానికి కొదవ లేదు. వివేకవంతులు. వీరు 6, 7, 8 సంఖ్య ఉన్న వ్యక్తులతో కలిసి ఉండేందుకు ఇష్టపడతారు. అంతేకాకుండా వీరికి ఎవరితోనూ ఎక్కువగా విభేదాలు ఉండవు. అందరితో కలిసిపోయే సామర్థ్యం ఉంటుంది.
మూల సంఖ్య- 6
6, 15, 24 తేదీల్లో పుట్టిన వారు సంబంధాలకు ప్రాధాన్యత ఇస్తారు. స్నేహానికి విలువ ఇవ్వడంలో ముందుంటారు. 5, 7, 8 సంఖ్య ఉన్నవారితో వీరికి మంచి సాంగత్యం ఉంటుంది. 3 నంబర్ వారితో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు.
మూల సంఖ్య 7
7, 16, 25 తేదీల్లో జన్మించిన వారు నలుగురితో బాగా కలిసిపోతారు. 5, 6, 8వ సంఖ్య గల వారితో స్నేహపూర్వక వాతావరణాన్ని కొనసాగిస్తారు. అయితే వీరు ఫలానా సంఖ్య ఉన్నవారితో విభేదంగా ఉంటారని లేదు. కానీ వారి ఆలోచనలకు కాకుండా పర్సనల్ విషయాలకు ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తులతో అంతగా కలిసిపోలేరు.
మూల సంఖ్య 8
8, 17, 26 తేదీల్లో జన్మించిన వారు 4, 5, 6, 7 సంఖ్యలు ఉన్న వ్యక్తుల ఆలోచనలు, అభిప్రాయాలు వీరికి అనుకూలంగా ఉంటాయి. అయితే 1, 2 సంఖ్యలు ఉన్నవారితో అభిప్రాయ భేదాలు రావచ్చు. వీరు సంబంధాల్లో సామరస్యాన్ని కాపాడుకోవడానికి కష్టపడతారు
మూల సంఖ్య- 9
9, 18, 27 తేదీల్లో జన్మించిన వారి మూల సంఖ్య 9. వీరు 1, 3, 5, 9 నంబర్లు ఉన్నవారితో మంచి అనుబంధం కలిగి ఉంటారు. ఆలోచనవిధానం, స్వభావం వీరికి సరిపోతుంది. కానీ 4వ నంబరు ఉన్న వ్యక్తులతో అభిప్రాయ భేదాలు ఎదుర్కోవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications
