Latest Updates
-
బెండకాయ ఎప్పుడు వండినా జిగురుగా ఉంటుందా.?..ఈ పద్ధతిలో ట్రై చేస్తే అస్సలు వదిలిపెట్టరు.! -
ఆకలినే ఆయుధంగా మార్చి 20 రోజులుగా నిరాహార దీక్ష.. ఎందుకీ ఉద్యమం, ఎవరీ సోనం వాంగ్ చుక్.! -
గ్రహాల శక్తితో పాటు దైవానుగ్రహం.. పూజలో ఈ రంగు వస్త్రాన్నే ఎందుకు ఉపయోగిస్తారో తెలుసా.? -
రాత్రి పూట స్వీట్ తినాలనిపిస్తుందా? ఓవెన్ అక్కర్లేకుండానే ఇంట్లోనే బేకరీ స్టైల్ బనానా బ్రెడ్ చేసుకోండిలా.. -
పిల్లలు, వృద్ధుల ఎముకల బలానికి రాగి, మునగాకు రోటి.. రోజూ ఒక్కటి తింటే చాలు.! -
మగవారిలో వీర్య కణాల సంఖ్య దారుణంగా పడిపోవడానికి ఈ పది ఆహార పదార్థాలే కారణం.! -
పప్పుచారులోకి బెస్ట్ సైడ్ డిష్.. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ వడ.. 10 నిమిషాల్లో చేసేయండిలా -
ఈ మూడు రాశుల వారికి ఊహించని ఆర్థిక అవకాశాలు.. ఏ పరిహారాలు చేస్తే ఇంకా మంచిది.! -
వారం రోజులు నిల్వ ఉండే సొరకాయ హల్వా..రసాలూరుతూ భలే రుచిగా.. -
మీ పిల్లలు రోజులో ఎన్ని చాక్లెట్స్ తింటున్నారు.. ఈ లిమిట్ దాటితే ఎంత ప్రమాదమో తెలుసా.?
రాత్రి ఈ పనులు చేయవద్దు.. లేదంటే దరిద్రదేవత ప్రవేశిస్తుంది..!
హిందూ శాస్త్రాన్ని పాటించిన వారికి జీవితం సంతోషంగా వుంటుంది. ఎలాంటి నెగటివ్ ఎనర్జీలు కూడా ఏమీ చేయవు. రాహువైనా, శనీ అయినా అన్నింటికి హిందూ శాస్త్రం పరిష్కారం చెప్పింది. ఎన్నో ఏళ్ల క్రితమే మనిషి ఎదుర్కొనే సమస్యలకు పరిష్కారాలను, పరిహారాలను హిందూ పండితులు కనుగ్గొన్నారు. వారు చెప్పినట్టు ఆచరిస్తే జీవితం సుఖమయంలో సంతోషంగా ఎలాంటి చెడు ప్రభావం కలగకుండా వుంటుంది. అలాంటి ఇళ్లల్లోకి లక్ష్మీదేవి తప్పక వస్తుంది. అయితే రాత్రి సమయంలో కొన్ని పనులను అస్సలు చేయకూడదని పండితులు చెబుతూ వున్నారు. అలాంటి పనులు గనుక చేస్తే దరిద్రం పట్టుకుంటుందని, లేని సమస్యలు వచ్చి మీదపడతాయని అంటున్నారు.
1. సాయంత్రి 7 గంటల లోపల చెత్త ఊడవద్దు అని పండితులు చెబుతున్నారు. ఒక వేళ తప్పక ఊడవాల్సిన పరిస్థితి వస్తే సాయంత్రం 6 గంటల లోపు పూర్తిచేయాలని అంటున్నారు. సాయత్రం లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చే సమయం కాబట్టి ఈ నియమాన్ని పెట్టారు. లేదంటే తరువాత రోజు ఉదయం శుభ్రం చేసుకోవాలని చెబుతున్నారు.
2. సాయంత్రం 6 తరువాత కూడా తలస్నానం చేయవద్దని అంటున్నారు. పండితులు చెప్పడమే కాదు దీని వెనక శాస్త్రీయ కారణం వుంది. తలస్నానం వల్ల తలలో తడి అలాగే వుంటుంది. తడితో పడుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం వుంది.
3. రాత్రిసమయంలో పెరుగు కూడా తినవద్దని పండితులు హెచ్చరిస్తున్నారు. పెరుగులో కొవ్వు పదార్ధం ఎక్కువగా వుంటుంది. దీని వల్ల గుండెలో కొవ్వు చేరి గెండె సమస్యలు వచ్చే అవకాశాలు వున్నాయ్.

4. రాత్రి సమయంలో ఇంటికి ఎవ్వరు వచ్చి అడిగినా ఉప్పు, పాలు, ధాన్యం, బంగారం ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వరాదని చెబుతున్నారు. ఈ వస్తువున్న లక్ష్మీ దేవి కొలువై వుంటుంది కాబట్టి ఈ వస్తువులను ఇవ్వొదని అంటున్నారు.
5. రాత్రి వేలల్లో దుమ్ము దులపవద్దు, బట్టలు ఉతకవద్దు, చిరిగిన బట్టలను కూడా కుట్టవద్దని శాస్త్రం చెబుతోంది.
6. రాత్రి సమయంలో గుమ్మడికాయను పగలకొట్టవద్దని అంటున్నారు. కూరలు చేసుకోవడానికైనా సరే సాయంత్రం 6లోపే ఇలాంటి కార్యక్రమాలు పూర్తిచేసుకోవాలని హెచ్చరిస్తున్నారు.
7. రాత్రి సమయంలో ఎండిమిరపకాయలను కూడా వేయించవద్దని చెబుతున్నారు. అలా చేస్తే దరిత్రదేవత ఇంట్లోకి వస్తుందని అంటున్నారు.
8. స్త్రీలు రాత్రి సమయంలో జుట్టును విరబోసుకొని తిరగవద్దు. జుట్టు ముళ్లను కూడా రాత్రి సమయంలో వేసుకోవద్దని పండితులు చెబుతున్నారు. అలా చేయడం వల్ల ఇంట్లో వెంట్రుకలు రాలిపడతాయ్. దీంతో లక్ష్మీ దేవి ఇళ్లు విడిచి వెళ్లిపోతుంది.
9. రాత్రి సమయంలో గొడవలు కూడా పెట్టుకోవద్దని హిందూ శాస్త్రం చెబుతోంది. కొంత మంది భార్యా భర్తలు ఆఫీసు నుంచి రాగానే గొడవలు పెట్టుకుంటారు. ఇంట్లో గృహలక్ష్మి ఏడిస్తే మహాలక్ష్మి ఇళ్లు విడిచి వెళ్లిపోతుందని పండితులు చెబుతున్నారు.
10. రాత్రి వేళల్లో గోళ్లను కూడా కత్తిరించవద్దు. ఉదయం, మధ్యాహ్నం సమయంలోనే గొళ్లను కత్తిరించాలి. మంగళవారం, ఆదివారం, శుక్రవారం కూడా గోళ్లను కత్తిరించవద్దని పండితులు చెబుతున్నారు.
11. పైన చెప్పిన నియమాలన్నింటినీ ఖచ్ఛితంగా పాటిస్తే లక్ష్మీ దేవి ఇళ్లు విడిచి వెళ్లిపోదు. పాటించకపోతే దరిత్రదేవత ఇంట్లోకి వచ్చి కూర్చుంటుంది అని పండితులు చెబుతున్నారు. పైన చెప్పిన వాటికి శాస్త్రీయ కారణాలు కూడా వున్నాయ్.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications