Latest Updates
-
ఇంట్లోకి గబ్బిలం వస్తే శుభమా? అశుభమా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
చికెన్ కర్రీలోకి అదిరిపోయే కాంబినేషన్.. కేరళ మలబార్ పరోటా ఇలా చేస్తే పొరలు పొరలుగా వస్తుంది! -
అల్లం, పచ్చిమిర్చి ఘాటుతో కరకరలాడే పంచ్ మెల్ దాల్ పకోడా.. ఒక్కసారి రుచి చూస్తే వదిలిపెట్టరు! -
బ్రెయిన్ ఫాగ్ అంటే ఏంటి? గుండె జబ్బులకు ఇది ముందస్తు సంకేతమా! -
ఆకు కూరల కంటే ఎక్కువ బలం: మోకాళ్లలో గుజ్జు రప్పించి, ఎముకల్ని గట్టిగా చేసే నల్లేరు రోటి పచ్చడి -
Fridge Vastu: మీ ఇంట్లో ఫ్రిజ్ పైన ఈ 3 వస్తువులు పెడితే పట్టిందల్లా బంగారమే! -
చపాతీ, దోశల్లోకి అదిరిపోయే మలేషియన్ ఎగ్ మసాలా..4 గుడ్లు ఉంటే ఈజీగా ఇలా చేసేయండి -
ఫైబర్, పోషకాలు నిండిన పర్ఫెక్ట్ బ్రేక్ ఫాస్ట్..సొరకాయ మునగాకు ఇడ్లీ ఎలా చేసుకోవాలంటే.. -
ఇన్‌స్టా వ్యామోహం.. 18 ఏళ్ల యువకుడి కోసం ముగ్గురు పిల్లలను వదిలేసిన 38 ఏళ్ల మహిళ, చివరికి.! -
ఒక్కసారి చేస్తే ఏడాది పాటు నిల్వ ఉండే బంగాళదుంప పాపడాలు..ఇంట్లోనే చేసుకోండిలా..
శ్రావణ మాసంలో ఈ ఐదు నక్షత్రాల వారికి తిరుగే ఉండదు.. గోల్డెన్ డేస్ ఆరంభం.!
పవిత్ర శ్రావణ మాసం ప్రారంభమైంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ మాసంలో సూర్యుడి అనుగ్రహంతో పాటు ఇతర గ్రహాల అనుకూల సంచారం ఐదు నక్షత్రాల వారికి విపరీతంగా కలిసి రానుంది. వారికి వృత్తిపరమైన, ఆర్థిక విషయాల్లో అదృష్టం వరించనుంది. మరి ఆ నక్షత్రాలేంటి.. వారికి కలిసిరానున్న విషయాలేంటి.. చూద్దాం..

రోహిణి నక్షత్రం
ఆగష్టు 13 నుంచి సెప్టెంబర్ 11 శ్రావణమాసం కొనసాగుతుంది. ఈ మాసంలో సూర్యుడితో పాటు గురుడు, శని, బుధ గ్రహాలు అనుకూలంగా సంచరించడం వల్ల కొన్ని నక్షత్రాల వారికి ప్రయోజనం చేకూరనుంది. అందులో రోహిణి నక్షత్రం ఒకటి. ఈ నక్షత్రానికి చంద్రుడు అధిపతి కాగా.. ఈ గ్రహ స్థానం అనుకూలంగా ఉండి వారి ఆలోచనలు, అభిప్రాయాలు చాలా స్పష్టంగా ఉంటాయి. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న పనుల్లో పురోగతి లభిస్తుంది. వృత్తిపరంగా కొత్త బాధ్యతలు, ప్రమోషన్లు అందుకుంటారు. వ్యాపారంలో ఆదాయం పెరుగుతుంది. ఊహించని లాభాలు అందుకుంటారు. ఈ నక్షత్రం వారికి ఈ మాసంలో పట్టిందల్లా బంగారమే అవుతుంది.
ఉత్తర ఫల్గుణి నక్షత్రం
ఉత్తర ఫల్గుణి నక్షత్రానికి అధిపతి సూర్యుడు కాగా.. ఈ మాసంలో వీరు ప్రత్యేమైన ప్రయోజనాలు పొందుతారు. వృత్తిపరంగా మీరు చేస్తున్న ఉద్యోగంలో గుర్తింపు అందుకుంటారు. ప్రమోషన్ పొందవచ్చు, లేదా అదనపు బాధ్యతలు అందుకోవచ్చు. ప్రభుత్వ రంగం, పరిపాల విభాగాల్లో ఉన్న వారికి జీతం, ఇతర విషయాల్లో పురోగతి పొందుతారు. వ్యాపార రంగంలో ఉన్నతంగా రాణిస్తారు. కుటుంబీకులతో సంతోషంగా గడుపుతారు.

అనురాధ నక్షత్రం
అనురాధ నక్షత్రానికి శని అధిపతిగా ఉండటంతో ఈ గ్రహం సంచారం స్థిరమైన ఫలితాలు, ప్రయోజనాలను అందిస్తుంది. శని దేవుడి కృపతో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారు మంచి అవకాశాలు అందుకుంటారు. వ్యాపార రంగంలో కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. విదేశీ అవకాశాలు కూడా మీ వ్యాపార విస్తరణకు కలిసి వస్తాయి. విద్యార్థులు చదువులో రాణిస్తారు. ఇతరుల వద్ద నిలిచిపోయిన మీ డబ్బు తిరిగి పొందుతారు. చేసే పనిలోనూ విజయం అందుకుంటారు.
శ్రవణ నక్షత్రం
శ్రావణ మాసంలో శ్రవణ నక్షత్రానికి చంద్రుడు అధిపతిగా ఉండటంతో గురుడి దృష్టి కారణంగా వీరి జీవితం పాజిటివ్‌గా ఉంటుంది. కుటుంబంలో నెలకొన్న సమస్యలకు పరిష్కారం రావడంతో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. కుటుంబీకుల మధ్య అవగాహన పెరుగుతుంది. వ్యాపారరంగంలో విజయం అందుకుంటారు. విదేశీ కంపెనీలతో వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. మీ మాటకు విలువ పెరిగి గౌరవం పొందుతారు.
ధనిష్ఠ నక్షత్రం
ధనిష్ఠ నక్షత్రానికి కుజుడు అధిపతిగా ఉండటంతో వీరు ఏ పని మొదలుపెట్టినా సక్సెస్ చూస్తారు. ఫలితంగా ఆదాయ మార్గాలు పెరగడంతో ఆర్థికంగా పురోగతి కనిపిస్తుంది. దీర్ఘకాలికంగా మీరు చేస్తున్న ఒక కీలకమైన పని పూర్త్యయ్యే అవకాశం ఉంది. విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నట్లయితే ఇది మంచి సమయం. ఏకాగ్రతతో చదివితే మంచి ఫలితాలు అందుకుంటాయి. శత్రు బాధ వదిలిపోతుంది. తోబుట్టువుల మధ్య ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. కుటుంబీకులతో కలిసి దైవ దర్శనాలు చేసుకునే అవకాశం ఉంటుంది. ఫ్యామిలీతో సంతోషంగా గడుపుతారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications
