షుగర్ వ్యాధి వచ్చే ముందు కనబడే సంకేతాలు ఇవే!

డయాబెటిస్ లేదా షుగర్ వ్యాధి ఇప్పుడొక సాధారణ సమస్యగా మారిపోయింది. అయితే ఈ వ్యాధి ఒక్కసారిగా మనపై దాడి చేయదు. షుగర్ బారిన పడే ముందు మన శరీరం కొన్ని స్పష్టమైన సంకేతాలను పంపుతుంది. కానీ చాలామంది వీటిని సాధారణ అనారోగ్య సమస్యలుగా భావించి నిర్లక్ష్యం చేస్తుంటారు. ఆ హెచ్చరికలను ముందే గుర్తిస్తే పెను ప్రమాదాన్ని నివారించవచ్చు.

మన శరీరం ఇచ్చే ఆ 7 ముఖ్యమైన సంకేతాల గురించి ఖమ్మంలోని ప్రసిద్ధ సన్ రైజ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ కు చెందిన సీనియర్ పీడియాట్రిక్స్ డాక్టర్ గౌతమ్ ఓ వీడియోలో చెప్పారు. ఆ సంకేతాలేంటో ఇక్కడ చూడండి.

7 Early Warning Signs of Diabetes Your Body Gives Before It Starts

విపరీతమైన దాహం, తరచుగా మూత్ర విసర్జన

మీకు ఎన్ని నీళ్లు తాగినా గొంతు తడారిపోతూ, దాహం తీరడం లేదా? ముఖ్యంగా రాత్రిపూట పదేపదే మూత్రానికి వెళ్లాల్సి వస్తోందా? రక్తంలో ఎక్కువగా ఉన్న గ్లూకోస్‌ ను మూత్రం రూపంలో బయటకు పంపడానికి కిడ్నీలు తీవ్రంగా శ్రమిస్తాయి. దీనివల్ల శరీరంలో నీటి శాతం తగ్గి విపరీతంగా దాహం వేస్తుంది.

కారణం లేని అలసట, నీరసం

తగినంత నిద్ర, విశ్రాంతి తీసుకున్నా రోజంతా విపరీతమైన నీరసంగా, బద్ధకంగా అనిపిస్తుందా? మనం తీసుకున్న ఆహారంలోని గ్లూకోస్‌ ను శరీరం సరిగ్గా ఉపయోగించుకోలేకపోవడమే దీనికి ప్రధాన కారణం. కణాలకు తగినంత శక్తి అందకపోవడం వల్ల ఇలా త్వరగా అలసిపోతుంటారు. రోజువారీ పనులపై ఆసక్తి తగ్గిపోతుంది.

శరీరంలో చెత్త మొత్తాన్ని తొలగించి, లివర్ ని శుభ్రపర్చే టీ ..చాలా ఈజీగా చేసుకోండిలా..శరీరంలో చెత్త మొత్తాన్ని తొలగించి, లివర్ ని శుభ్రపర్చే టీ ..చాలా ఈజీగా చేసుకోండిలా..

మెడ, సంకల దగ్గర నల్లటి మచ్చలు

మెడ వెనుక భాగంలో లేదా సంకల (చంకల) దగ్గర చర్మం నల్లగా, కాస్త మందంగా మారుతోందా? వైద్య పరిభాషలో దీనిని అకాంతోసిస్ నైగ్రికాన్స్(Acanthosis Nigricans) అని అంటారు. శరీరంలో ఇన్సులిన్ నిరోధకత పెరుగుతోందనడానికి ఇది ఒక కీలక సంకేతం.

కంటి చూపు మసకబారడం

పుస్తకం చదువుతున్నప్పుడు లేదా దూరపు వస్తువులను చూస్తున్నప్పుడు అకస్మాత్తుగా కళ్లు మసకబారుతున్నాయా? శరీరంలో షుగర్ లెవల్స్ హెచ్చుతగ్గులకు లోనైనప్పుడు కంటి లెన్స్‌ పై తీవ్ర ప్రభావం పడి, చూపు అస్పష్టంగా మారుతుంది. కాబట్టి చూపులో మార్పు వస్తే వెంటనే చెక్ చేయించుకోండి.

అకస్మాత్తుగా బరువు తగ్గడం

ఎలాంటి డైటింగ్ లేదా కఠిన వ్యాయామం చేయకుండానే మీరు బరువు తగ్గుతున్నారా? శరీరం గ్లూకోస్‌ ను శక్తిగా మార్చుకోలేనప్పుడు, తనకు కావలసిన ఎనర్జీ కోసం శరీరంలోని కొవ్వును, కండరాలను కరిగించడం ప్రారంభిస్తుంది. అందువల్లే ఎటువంటి కారణం లేకుండా బరువు తగ్గుతారు.

చేతులు, కాళ్లలో మొద్దుబారడం

మీ చేతులు, కాళ్లలో సూదులతో గుచ్చినట్లుగా లేదా మొద్దుబారినట్లుగా అనిపిస్తుందా? రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వల్ల శరీరంలోని సున్నితమైన నరాలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. దీనివల్లే తరచుగా తిమ్మిర్లు ఎక్కడం, స్పర్శ కోల్పోయినట్లు అనిపించడం జరుగుతుంది. వీటిని నిర్లక్ష్యం చేయకండి.

గాయాలు ఆలస్యంగా మానడం

చిన్నపాటి కోతలు, పుండ్లు లేదా దెబ్బలు తగిలినప్పుడు అవి మానడానికి సాధారణం కంటే చాలా సమయం పడుతోందా? శరీరంలో షుగర్ పెరగడం వల్ల రక్తప్రసరణ మందగించి, రోగనిరోధక శక్తి (ఇమ్యూనిటీ) తగ్గిపోతుంది. ఫలితంగా గాయాలు అంత త్వరగా మానవు.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Desktop Bottom Promotion