Latest Updates
-
India’s One Day Capital: ఒక్క రోజు మాత్రమే భారతదేశ రాజధానిగా ఉన్న నగరం ఏదో మీకు తెలుసా? -
ఇడ్లీ, దోశెలను వదలనివ్వని అద్భుతమైన మదురై స్పెషల్ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
చలికాలంలో ఈ సాంబార్ చేసుకుంటే..జలుబు, తలనొప్పి అన్నీ పరార్! -
కోట్ల ఆస్తి, డ్రైవర్ తో ఎఫైర్.. ప్రియుడి మోజులో కన్నకొడుకునే బలిచ్చిన తల్లి.. -
బజార్ స్వీట్లు ఇక ఆపేయండి.. సొరకాయతో అద్భుతమైన కలకండ్ ఇలా చేసుకోండి.. -
చలికాలంలో గొంతు నొప్పి, గరగర వేధిస్తున్నాయా? వంటింట్లో దొరికే ఈ పదార్థాలతో చిటికెలో రిలీఫ్.. -
100 ఏళ్లు గుర్తుండిపోయే పచ్చిమిర్చి పచ్చడి..ఎందులోకి అయినా అమృతమే! -
ఖాళీ స్వీట్ బాక్సులు పారేస్తున్నారా?.. ఈ ఉపయోగాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు! -
హోటల్ స్టైల్ పూరీ మసాలా ఇంట్లోనే.. ఈ సీక్రెట్ టిప్స్ తో చేసి చూడండి! -
నెల రోజులు నిల్వ ఉండే ఆరోగ్యకరమైన మరమరాల లడ్డు..మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే..
బిర్యానీకి మించిన రుచి..తక్కువ మసాలాలతో పిల్లలు,పెద్దలు మెచ్చే మొరాదాబాదీ చికెన్ పులావ్ ఇలా వండండి!
బిర్యానీ అంటే ఇష్టం లేని వారెవరు ఉంటారు చెప్పండి? కానీ ప్రతిసారీ హెవీ మసాలాలతో కాకుండా, కాస్త భిన్నంగా, తక్కువ నూనెతో, కమ్మని సువాసనతో ఉండే పులావ్ తినాలనిపిస్తే మొరాదాబాదీ చికెన్ పులావ్ బెస్ట్ ఛాయిస్. ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ ప్రాంతానికి చెందిన ఈ వంటకం, పచ్చిమిర్చి కారం, సోంపు సువాసన, మిరపకాయ ఊరగాయ ఇచ్చే ప్రత్యేక రుచితో భోజనప్రియుల మనసు దోచుకుంటుంది.
టమాటోలు, కారం పొడి లేకుండానే అద్భుతమైన రుచిని అందించే ఈ వంటకం పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ తెగ నచ్చేస్తుంది. మొరాదాబాదీ చికెన్ పులావ్ ను మీ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
మారినేషన్ కోసం:
పచ్చిమిర్చి: 8-10
అల్లం వెల్లుల్లి పేస్ట్: 2 టేబుల్ స్పూన్లు
పెరుగు: ¾ కప్పు
నిమ్మకాయ: 1
మిరపకాయ ఊరగాయ: 2 టేబుల్ స్పూన్లు
జీలకర్ర: 1 టీస్పూన్
కచ్చాపచ్చాగా దంచిన సోంపు: 1 టేబుల్ స్పూన్
చికెన్: 1 కిలో
పులావ్ తయారీకి కావలసినవి:
నూనె: 2 టేబుల్ స్పూన్లు
ఉల్లిపాయ: 1
షాజీరా: 1 టీస్పూన్
దాల్చిన చెక్క: 1 చిన్న ముక్క
యాలకులు: 5
నల్ల యాలక్కాయ: 1
లవంగాలు: 5
మిరియాలు: 1 టీస్పూన్
జాపత్రి: 1
బిర్యానీ ఆకులు: 2
ఉప్పు: రుచికి సరిపడా
ధనియాల పొడి: 1 టేబుల్ స్పూన్
జీలకర్ర పొడి: 1 టీస్పూన్
బిర్యానీ బియ్యం: 3 కప్పులు
నీళ్ళు: 4.5 కప్పులు
ఇడ్లీ, దోశెలను వదలనివ్వని అద్భుతమైన మదురై స్పెషల్ చట్నీ..ఎలా చేసుకోవాలంటే..
తయారీ విధానం
-ముందుగా శుభ్రంగా కడిగిన చికెన్ ను ఒక గిన్నెలోకి తీసుకోండి. అందులో పచ్చిమిర్చి కచ్చాపచ్చాగా దంచినవి లేదా చీలికలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, నిమ్మరసం, మిరపకాయ ఊరగాయ, జీలకర్ర, దంచిన సోంపు వేసి ముక్కలకు బాగా పట్టేలా కలపండి. కనీసం అరగంట పాటు పక్కన ఉంచితే మసాలాల రుచి ముక్కల్లోకి చక్కగా ఇంకుతుంది.
-ఇదే సమయంలో బిర్యానీ బియ్యాన్ని కడిగి 30 నిమిషాలు నానబెట్టుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద మందపాటి గిన్నె పెట్టి 2 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేయండి. అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించండి. తర్వాత అరగంట పక్కన పెట్టుకున్న చికెన్ ను ఇందులో వేసి బాగా కలపండి. వెంటనే షాజీరా, దాల్చిన చెక్క, యాలకులు, నల్ల యాలక్కాయ, లవంగాలు, మిరియాలు, జాపత్రి, బిర్యానీ ఆకులు,రుచికి సరిపడా ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి మంటను మీడియంలో ఉంచి కలుపుతూ ఉడికించండి.
-పెరుగు, చికెన్ లోని నీటితోనే ముక్కలు దాదాపు 70 శాతం వరకు ఉడికిపోయి, నూనె పైకి తేలుతుంది.
-ఇప్పుడు నానబెట్టిన బిర్యానీ బియ్యాన్ని నీళ్ళు వంపేసి అందులో వేయండి. మెతుకు విరగకుండా జాగ్రత్తగా కలిపి,నాలుగున్నర కప్పుల నీళ్ళు పోసి ఉప్పు సరిచూసుకోండి. మూత పెట్టి, నీళ్ళు మరగడం మొదలైన తర్వాత మంటను పూర్తిగా తగ్గించి 12 నుండి 15 నిమిషాలు దమ్ చేసుకోండి. నీరంతా ఇగిరిపోయి అన్నం పొడిపొడిగా ఉడికిన తర్వాత స్టవ్ ఆపేయండి. వెంటనే మూత తీయకుండా పది నిమిషాలు అలాగే వదిలేస్తే ఆవిరికి బియ్యం మరింత పొడవుగా, మృదువుగా మారుతాయి.
-అంతే నోరూరించే మొరాదాబాదీ చికెన్ పులావ్ రెడీ. దీనిని చల్లటి పెరుగు రైతా లేదా పుదీనా చట్నీతో వడ్డిస్తే ఆ రుచే అద్భుతం.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
